జులై 28న మారుతి సుజుకి ఎస్-క్రాస్ బిఎస్6 విడుదల - వివరాలు
మారుతి సుజుకి తమ లైనప్‌లో మరో బిఎస్6 వాహనాన్ని ఈ నెలాఖరులోగా విడుదల చేయనుంది. నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ చైన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతున్న ఎస్-క్రాస్ క్రాసోవర్‌లో కంపెనీ కొత్తగా బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

టీమ్‌బిహెచ్‌పి నుండి వచ్చిన తాజా నివేదికల ప్రకారం, కొత్త మారుతి సుజుకి ఎస్-క్రాస్ జూలై 28, 2020వ తేదీన విడుదల కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మోడల్ అమ్మకాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇండియా మార్కెట్లో ప్రీమియం క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్ కోసం కంపెనీ ఇప్పటికే సేల్స్ ట్రైనింగ్‌ను కూడా ప్రారంభించినట్లు సమాచారం.

మరోవైపు నెక్సా డీలర్లు కూడా కొత్త 2020 ఎస్-క్రాస్ కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించారు. రూ.11,000 టోకెన్ అమౌంట్‌తో కస్టమర్లు ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు. కొత్త బిఎస్6 ఎస్-క్రాస్ మోడల్‌ను మారుతి సుజుకి 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శినకు ఉంచింది, ఆ సమయంలో ఈ క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్‌లో చేసిన కొన్ని మార్పులను కంపెనీ వెల్లడించింది.

ఈ అధునాతన క్రాస్ఓవర్‌లో సుజుకి నుండి పాపులర్ అయిన 1.5-లీటర్ ‘ఎస్‌హెచ్‌విఎస్' మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్‌ను ఇప్పటికే కంపెనీ అందిస్తున్న ఎర్టిగా, సియాజ్ మరియు విటారా బ్రెజ్జా మోడళ్లలో వినియోగిస్తున్నారు.

ఈ 1.5 లీటర్, ఫోర్ సిలిండర్, మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 104 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండొచ్చని సమాచారం. ఈ కొత్త మోడల్ విడుదల సమయంలో కంపెనీ హై-స్పెక్ వేరియంట్‌లపై ఆప్షనల్ ఫోర్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఆఫర్ చేయవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కొత్త ఇంజన్ మాత్రమే కాకుండా, 2020 ఎస్-క్రాస్ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కొద్దిపాటి డిజైన్ మార్పులు కూడా ఉన్నాయి. వీటిలో రీడిజైన్ చేసిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అయితే, ఎస్-క్రాస్ మొత్తం డిజైన్ మరియు సిల్హౌట్ మాత్రం మారదని తెలిస్తోంది.

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇది బ్రాండ్ యొక్క సరికొత్త స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఫీచర్లతో పాటుగా బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. కొత్త 2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ ఇంటీరియర్స్‌లో కొత్త అప్‌హోలెస్ట్రీ కూడా ఉండనుంది, ఇది మరింత ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌ను ఆఫర్ చేయనుంది.

బిఎస్4 మోడళ్లలో కనిపించిన డీజిల్ ఇంజన్‌ను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినందున ఈ కొత్త 2020 ఎస్-క్రాస్ మోడల్‌లో ప్రస్తుతానికి డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. బిఎస్4 వెర్షన్ ఎస్-క్రాస్ మోడల్‌ను రూ.8.80 లక్షల నుండి రూ.11.43 లక్షల మధ్యలో విక్రయించారు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). కొత్త మోడల్ ధరలు కూడా ఇంచు మించు ఇదే రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

2020 మారుతి సుజుకి ఎస్-క్రాస్ బిఎస్6 క్రాసోవర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఎస్-క్రాస్ బిఎస్6 మోడల్ విడుదల ఆలస్యం అయింది. మారుతి సుజుకి నుండి రాబోయే ఈ క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్‌ను నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ చైన్‌లో విక్రయిస్తారు. ఎస్-క్రాస్ ఇప్పటికే మంచి ప్రజాదరణ పొందిన మోడల్, ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న పెట్రోల్ ఇంజన్‌తో ఇది మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని మా అభిప్రాయం.


Click it and Unblock the Notifications








