హ్యుందాయ్ స్పేర్ పార్ట్స్‌పై డిస్కౌంట్స్; ఆన్‌లైన్ ఆర్డర్లపై స్పెషల్ డీల్స్

హ్యుందాయ్ ఇండియా, దేశంలో తమ కస్టమర్ల కోసం కంపెనీ అధికారిక విడిభాగాలపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఇందుకోసం మోబిస్ ఇండియా లిమిటెడ్‌తో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

హ్యుందాయ్ స్పేర్ పార్ట్స్‌పై డిస్కౌంట్స్; ఆన్‌లైన్ ఆర్డర్లపై స్పెషల్ డీల్స్

మోబిస్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో హ్యుందాయ్ బ్రాండ్ కోసం అధిక-నాణ్యత కలిగిన సర్టిఫైడ్ ఆటోమోటివ్ విడిభాగాలు మరియు ఉపకరణాలను తయారుచేసే సంస్థ. ఈ మేరకు ‘హ్యుందాయ్ మొబిలిటీ మెంబర్‌షిప్' పేరుతో మోబిస్ ఇండియా ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను కూడా ప్రారంభించింది.

హ్యుందాయ్ స్పేర్ పార్ట్స్‌పై డిస్కౌంట్స్; ఆన్‌లైన్ ఆర్డర్లపై స్పెషల్ డీల్స్

ఈ యాప్ సాయంతో కస్టమర్లు తమ హ్యుందాయ్ కార్లకు కావల్సిన విడిభాగాలను ఆన్‌లైన్‌లోనే నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇలా ఆన్‌లైన్ ద్వారా విడిభాగాలను ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది.

MOST READ:162 అడుగుల జీప్ ఎస్‌యూవీలతో తయారైన గణేష్ మహారాజ్ [వీడియో]

హ్యుందాయ్ స్పేర్ పార్ట్స్‌పై డిస్కౌంట్స్; ఆన్‌లైన్ ఆర్డర్లపై స్పెషల్ డీల్స్

హ్యుందాయ్ మొబిలిటీ మెంబర్‌షిప్ యాపిల్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఆయా యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది, కస్టమర్లు ఈ యాప్‌ను ఉచితంగా తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హ్యుందాయ్ స్పేర్ పార్ట్స్‌పై డిస్కౌంట్స్; ఆన్‌లైన్ ఆర్డర్లపై స్పెషల్ డీల్స్

ఈ సందర్భంగా మోబిస్ ఇండియా ఏఎస్ పార్ట్స్ డివిజన్ మేనేజింగ్ డైరెక్టర్ వూసుక్ లీమ్ మాట్లాడుతూ, "కస్టమర్ సంతృప్తి మరియు ఆనందాలే మా కంపెనీకి మూలస్తంభాలు. మానవ జీవితం ఫాస్ట్ ట్రాక్‌పై పరుగులు తీస్తోంది, ఇటువంటి పరిస్థితుల్లో డిమాండ్‌కు తగిన సప్లైయ్‌ని మరియు సర్వీస్‌కి సంబంధించిన పరిష్కాల కోసం తక్షణ మార్గాలను అన్వేషించడం చాలా అవసరం."

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

హ్యుందాయ్ స్పేర్ పార్ట్స్‌పై డిస్కౌంట్స్; ఆన్‌లైన్ ఆర్డర్లపై స్పెషల్ డీల్స్

"అందువల్లనే, మేము మా విశ్వసనీయ కస్టమర్ల కోసం దశలవారీగా ఆకర్షణీయమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. హ్యుందాయ్ మోటార్స్ మరియు హ్యుందాయ్ మొబిలిటీ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ (ఎమ్‌ఎమ్‌పి)తో భాగస్వామ్యం ద్వారా, మా కస్టమర్లు హ్యుందాయ్ జెన్యూన్ యాక్సెసరీస్‌ను సులువుగా యాక్సెస్ చేసుకోవటమే కాకుండా వాటిపై అదనపు తగ్గింపులను మరియు ప్రయోజనాలను కూడా పొందుతారని" అయన అన్నారు.

హ్యుందాయ్ స్పేర్ పార్ట్స్‌పై డిస్కౌంట్స్; ఆన్‌లైన్ ఆర్డర్లపై స్పెషల్ డీల్స్

"దేశంలో విజృంభిస్తున్న కోవిడ్-19తో పోరాటం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో, మేము ప్రవేశపెట్టిన లేటెస్ట్ హ్యుందాయ్ మోబిస్ కవచ్ ఉపకరణాలు ఈ మహమ్మారిని ఎదుర్కోవటంలో సహకరిస్తాయి. హ్యుందాయ్ కవచ్ సేఫ్టీ ప్యాక్‌లో హ్యుందాయ్ జెన్యూన్ హ్యూమిడిఫైయర్, హ్యుందాయ్ జెన్యూన్ వాక్యూమ్ క్లీనర్ మరియు హ్యుందాయ్ జెన్యూన్ టెంపరేచర్ గన్ ఉంటాయి. ఇవి మీ ప్రయాణాన్ని మరితం సురక్షితంగా నావిగేట్ చేయడానికి ఆరోగ్యాన్ని మరియు పరిశుభ్రతను కాపాడుకోవడానికి సహకరిస్తాయి. మా కస్టమర్లు ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో పొందవచ్చు" అని లీమ్ చెప్పారు.

MOST READ:త్వరలో భారత్‌కి రానున్న రూ. 6.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్.. మీరు చూసారా

హ్యుందాయ్ స్పేర్ పార్ట్స్‌పై డిస్కౌంట్స్; ఆన్‌లైన్ ఆర్డర్లపై స్పెషల్ డీల్స్

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి నుండి తమను తాము రక్షించుకోవడానికి హ్యుందాయ్ మోటార్ ఇండియా ‘కవచ్' బ్రాండ్ పేరుతో వినియోగదారులకు వైరస్ ప్రొటెక్షన్ ఉత్పత్తులను అందిస్తోంది.

ఇందులో కెఎన్95 ఫేస్ మాస్క్, హ్యూమిడిఫైయర్, యాంటీ బాక్టీరియల్ స్ప్రే, పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, ప్రీమియం క్వాలిటీ పివిసి మెటీరియల్‌తో తయారైన ఫ్లోర్ మ్యాట్ (అలెర్జీ కారకాలను నివారించడానికి కారు ఫ్లోర్‌ను పూర్తిగా లామినేట్ చేస్తుంది), ఉష్ణోగ్రత తనిఖీ గన్ మరియు ఫేస్ షీల్డ్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఉపకరణాలన్నింటినీ మొబైల్ యాప్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

హ్యుందాయ్ స్పేర్ పార్ట్స్‌పై డిస్కౌంట్స్; ఆన్‌లైన్ ఆర్డర్లపై స్పెషల్ డీల్స్

హ్యుందాయ్ యాక్ససరీస్ కోసం కొత్త మొబైల్ యాప్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మెయింటినెన్స్ ఖర్చులను తగ్గించేందుకు మరియు వేగంగా హ్యుందాయ్ జెన్యూన్ స్పేర్ పార్ట్స్‌ను అందించేందుకు కంపెనీ ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ కస్టమర్లు ఇప్పుడు చాలా హ్యాండీగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా, మొబైల్/ఆన్‌లైన్ ఆర్డర్లపై కంపెనీ ప్రత్యేక డిస్కౌంట్లు మరియు ఆఫర్లను అందిస్తున్న నేపథ్యంలో, కస్టమర్లు నకిలీ స్పేర్ పార్ట్‌లకు దూరంగా ఉండి, వాటి కోసం అధిక మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు.

MOST READ:ఆగస్ట్ నెలలో సుజుకి మోటార్‌సైకిల్స్ అమ్మకాలు.. ఇలా ఉన్నాయి

Most Read Articles

English summary
Hyundai India has partnered with Mobis India Limited, to offer attractive discounts on spare parts to its customers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X