Just In
Don't Miss
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- News
విచ్చలవిడి దోపిడీ: కేసీఆర్ సర్కారుపై విజయశాంతి, వేలకోట్ల అవినీతి అంటూ వివేక్
- Finance
ఢిల్లీలో రూ.85 దాటిన పెట్రోల్ ధరలు, ముంబైలో రూ.92
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హ్యుందాయ్ కస్టమర్ల కోసం 'ల్యాంప్ ఆన్ ఛాలెంజ్' - అసలేంటిది?
కోవిడ్-19 మహమ్మారి కారణంగా మన దేశం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఎదుర్కుంది. ఇంకా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ లాక్‌డౌన్ కొనసాగుతూనే ఉంది. గడచిన మే నెలలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపుల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ విధులకు హాజరు అవుతున్నారు. వ్యాపారస్థులు తమ వ్యాపారాలను సాగిస్తున్నారు.

దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ దాదాపు రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత క్రమంగా వృద్ధిని కనబరుస్తోంది. ప్రజా రవాణా స్థంభించిపోవటం, కొన్నిచోట్ల ప్రజా రవాణా ఉన్నప్పటికీ ప్రజలు వాటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపకపోవటంతో ద్విచక్ర, నాలుగు చక్ర వానాలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. లాక్‌డౌన్ ముందు కన్నా ఎక్కువ సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు.

దీంతో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వాహనాలను తయారు చేసేందుకు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు ఆటోమొబైల్ కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పథకాలు, ఆఫర్లు, డిస్కౌంట్లు, సర్వీస్ క్యాంపైన్లతో ముందుకొస్తున్నారు.
MOST READ:ఎలక్ట్రిక్ కారుకి పెట్రోల్ నింపడానికి ట్రై చేసిన వ్యక్తి : ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

తాజాగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తమ వినియోగదారుల కోసం సోషల్ మీడియా వేదికగా ‘లాంప్ ఆన్ ఛాలెంజ్' అనే ప్రత్యేకమైన పోటీని ప్రారంభించింది. బ్రేక్ లైట్ల యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రమాదాలను నివారించడంలో దాని ముఖ్య పాత్ర గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడంపై ఈ పోటీ దృష్టి సారించింది. లాంప్ ఆన్ ఛాలెంజ్ పోటీ జూలై 16న ప్రారంభమైంది మరియు ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది.

ఈ పోటీ గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. "హ్యుందాయ్ ఓ బాధ్యతాయుతమైన మరియు కేరింగ్ బ్రాండ్‌గా తమ కస్టమర్లలో కారు మెయింటినెన్స్, భద్రత విషయాల గురించి అవగాహన కల్పించేందుకు మేము ఎల్లప్పుడూ ముందంజలో ఉంటాం. ఇలాంటి సమస్యలపై ప్రజలను ఎడ్యుకేట్ చేయటం ద్వారా పెద్ద ప్రభావాన్ని సృష్టించడానికి ఇలాంటి ప్రయత్నాలు అవసరం. 'లాంప్ ఆన్ ఛాలెంజ్' అనేది డిజిటల్ ఓ పోటీ, ఇది ప్రజలకు ఓ నిజమైన ఐ-ఓపెనర్‌గా ఉంటుంద"ని అన్నారు.
MOST READ:వర్షపు నీటిలో పడవపై ప్రయాణించిన వ్యక్తిపై కేసు బుక్ చేసిన పోలీసులు : ఎందుకో తెలుసా

లాంప్ ఆన్ ఛాలెంజ్ పోటీ మూడు-దశల ప్రక్రియను కలిగి ఉంటుంది. ఇందులో మొదటది, కస్టమర్లు బ్రేక్ లైట్లతో కారు వెనుక భాగాన్ని చూపించే చిత్రాన్ని తీయాలి. రెండవది, వారు తమ కారు నెంబర్ ప్లేట్ కనపడకుండా ఉండేలా కవర్ చేయాలి. చివరిది కాని, ఈ చిత్రాన్ని హ్యుందాయ్ యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో (హ్యుందాయ్ ఇండియా) ఇద్దరు స్నేహితులతో కలిపి ట్యాగ్ చేయాలి. ఇలా పోస్ట్ చేసేటప్పుడు #Hyundai మరియు #LampOn_India అనే రెండు హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగించాలి. ఈ ప్రమాణాలకు అర్హత సాధించే మొదటి 100 ఎంట్రీలకు ఉత్తేజకరమైన ఆఫర్‌లు మరియు బహుమతులు ఉంటాయని కంపెనీ పేర్కొంది.

హ్యుందాయ్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే తమ కాంపాక్ట్-ఎస్‌యూవీ వెన్యూలో ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్)ను విడుదల చేసింది. ఐఎమ్‌టి అమర్చిన వేరియంట్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.11.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.
MOST READ:చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

హ్యుందాయ్ ల్యాంప్ ఆన్ ఛాలెంజ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
పైన చెప్పినట్లుగా, ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులను ప్రకటించిన తర్వాత దేశంలో కార్ల తయారీదారులు తమ వ్యాపారాన్ని తిరిగి గాడిలోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యుందాయ్ కూడా ఈ లైట్ ఆన్ ఛాలెంజ్ ద్వారా, అనేక మంది కస్టమర్ను ఎంగేజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.