బిఎస్ 4 హ్యుందాయ్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు, దేనిపై ఎంతంటే.. ?
భారత ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఏప్రిల్ 1 కల్లా దాదాపు అన్ని వాహనాలు బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేయాలి. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు తమ వాహనాలను బిఎస్-6 నిబంధనలకు అనుకూలంగా తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ క్రమంలో హ్యుందాయ్ కంపెనీ తమ బిఎస్-4 వాహనాలపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. హ్యుందాయ్ ప్రకటించినా ఈ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడా తెలుసుకుందాం.. !

ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన హ్యుందాయ్ తమ బిఎస్-4 వాహనాలపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. హ్యుందాయ్ యొక్క బిఎస్ 4 సాంట్రోపై దాదాపు 30,000 వరకు తగ్గింపును ప్రకటించింది. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్ గా 20,000 రూపాయల తగ్గింపును ప్రకటించి మొత్తం సాంట్రోపై 50,000 రూపాయల వరకు తగ్గింపును ప్రకటించింది.

అదే విధంగా బిఎస్ 6 వెర్షన్ పై 20,000 వరకు తగ్గింపు, 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ను ప్రకటించింది. ఈ విధమైన ఆఫర్లను ప్రకటించడం ద్వారా వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించడానికి అనుకూలంగా ఉంటుంది.

| Models | Cash Discount | Exchange Bonus + Corporate Discount |
| Santro (BS4) | Rs 30,000 | Rs 20,000 + Rs 5,000 |
| Santro (BS6) | Rs 20,000 | Rs 15,000 + Rs 5,000 |
| Grand i10 (BS4) | Rs 40,000 | Rs 30,000 + Rs 5,000 |
| Grand i10 (BS6) | Rs 25,000 | Rs 15,000 + Rs 5,000 |
| Grand i10 NIOS Diesel (BS4) | Rs 40,000 | Rs 10,000 + Rs 5,000 |
| Grand i10 NIOS Diesel (BS6) | Rs 10,000 | Rs 10,000 + Rs 5,000 |
| Xcent (BS4) | Rs 90,000 | Rs 5,000 (Corporate Discount) |
| Elite i20 (Era & Magna+) (BS4) | Rs 20,000 | Rs 20,000 + Rs 5,000 |
| Elite i20 (Sportz+ & Above) (BS4) | Rs 40,000 | Rs 20,000 + Rs 5,000 |
| Elite i20 (BS6) | Rs 15,000 | Rs 15,000 + Rs 5,000 |
| Verna (BS4) | Rs 50,000 | Rs 30,000 + Rs 10,000 |
| Creta (P & D) 1.6 Variants Only (BS4) | Rs 75,000 | Rs 30,000 + Rs 10,000 |
| Elantra (BS4) | Rs 1,25,000 | Rs 75,000 + Rs 50,000 |
| Elantra (BS6) | Rs 40,000 | Rs 40,000 + Rs 20,000 |
| Tucson (BS4) | Rs 1,25,000 | Rs 75,000 + Rs 50,000 |
| Tucson (BS6) | NIL | Rs 25,000 + Rs 25,000 |

హ్యుందాయ్ యొక్క బిఎస్ 6 గ్రాండ్ ఐ 10 పై 40000 రూపాయల తగ్గింపు, మరియు రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపు అవకాశాన్ని కల్పించింది. అదేవిధంగా బిఎస్-6 వెర్సన్ పై కూడా రూ. 45,000 డిస్కౌంట్ కల్పించింది. బిఎస్-6 గ్రాండ్ ఐ డీజిల్ వెర్షన్ పై రూ. 40,000 తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రకటించింది.

బిఎస్ 4 నియోస్ 1.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌పై రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 కార్పొరేట్ తగ్గింపుని ప్రకటించింది. అంటే కాకుండా బిఎస్ 4 ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ పై భారీగా దాదాపు రూ. 90,000 తగ్గింపును ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ బిఎస్ 4 ఎలైట్ ఐ 20 ఎరా మరియు మాగ్నా ప్లస్ వేరియంట్లపై 20,000 రూపాయల వరకు తగ్గింపుతో పాటు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కల్పించింది.

సరికొత్త బిఎస్ 6 ఎలైట్ ఐ 20 ను రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కల్పించింది. అంతే కాకుండా కొత్త తరం ఎలైట్ ఐ 20 ఈ ఏడాది మధ్యలో వచ్చే అవకాశం ఉండగా, ఫేస్‌లిఫ్టెడ్ వెర్నా మార్చి 26 న విక్రయించనుంది. సి-సెగ్మెంట్ సెడాన్ రూ. 50,000 నగదు తగ్గింపు, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్ ను ప్రకటించింది.

హ్యుందాయ్ క్రెటా యొక్క బిఎస్ 4 వెర్షన్ లోని 1.6 లీటర్ వేరియంట్లపై రూ. 1.15 లక్షల తగ్గింపు. ఎలంట్రా బిఎస్-4 పై రూ. 2.50 లక్షలు, బిఎస్-6 వెర్షన్‌పై కూడా రూ. 1 లక్షల తగ్గింపు. బిఎస్ 4 టక్సన్ రూ. 2.50 లక్షల తగ్గింపు. అదే విధంగా బిఎస్-6 ఫేస్‌లిఫ్టెడ్ టక్సన్‌ను రూ. 25 వేల ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రకటించింది.
Source: Gaadiwaadi


Click it and Unblock the Notifications








