హ్యుందాయ్ కార్లకు ఐసిఐసిఐ లోన్స్; ఈజీ ఫైనాన్సింగ్ స్కీమ్ - వివరాలు

హ్యుందాయ్ కారును కొనాలనుకునే కస్టమర్ల కలను నిజం చేసేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్), ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా హ్యుందాయ్ 'క్లిక్ టు బై' ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు టైలర్ మేడ్ ఫైనాన్స్ ఆప్షన్లను ఎంచుకునే సౌకర్యాన్ని కల్పించారు.

హ్యుందాయ్ కార్లకు ఐసిఐసిఐ లోన్స్; ఈజీ ఫైనాన్సింగ్ స్కీమ్ - వివరాలు

హ్యుందాయ్ అందిస్తున్న ఆన్‌లైన్ రిటైల్ సేల్ ప్లాట్‌ఫామ్ 'క్లిక్ టు బై'కు ఐసిఐసిఐ బ్యాంక్ తమ ఫైనాన్స్ సొల్యూషన్స్‌ని అనుసంధానం చేసింది. ఈ రెండు మేజర్ బ్రాండ్ల మధ్య భాగస్వామ్యం కారణంగా, వినియోగదారులకు తమ అభిమాన హ్యుందాయ్ కారును కొనుగోలు చేయడానికి అవసరమైన ఫైనాన్స్ సదుపాయాలను చాలా సులభమైన పద్ధతిలో అందించాలనే లక్ష్యంతో హ్యుందాయ్ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

హ్యుందాయ్ కార్లకు ఐసిఐసిఐ లోన్స్; ఈజీ ఫైనాన్సింగ్ స్కీమ్ - వివరాలు

ఐసిఐసిఐ బ్యాంక్‌లో ఇప్పటికే ముందస్తుగా ఆమోదించబడిన (ప్రీ అప్రూవ్డ్) కార్ లోన్స్ కలిగిన లక్షలాది మంది కస్టమర్లను హ్యుందాయ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఆకర్షించనుంది. ఇలాంటి కస్టమర్లు కేవలం కొన్ని క్లిక్కులతోనే 'క్లిక్ టు బై' పోర్టల్ ద్వారా నిమిషాల్లో రుణాన్ని పొంది తమ డ్రీమ్ కారును సొంతం చేసుకోవచ్చు. ఈ సదుపాయం ద్వారా రుణాలు వేగంగా ప్రాసెస్ కావటమే కాకుండా, కార్ లోన్స్ కోసం కస్టమర్లు బ్రాంచ్‌ను భౌతికంగా సందర్శించాల్సిన అవసరాన్ని నివారిస్తుంది.

హ్యుందాయ్ కార్లకు ఐసిఐసిఐ లోన్స్; ఈజీ ఫైనాన్సింగ్ స్కీమ్ - వివరాలు

మరోవైపు, ఈ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా బ్యాంక్ తమ కస్టమర్లకు దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయటంతో పాటుగా, 100 శాతం ఆన్-రోడ్ ఫండింగ్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, కంపెనీ ప్రారంభించిన ఈ కొత్త ప్రణాళిక ద్వారా ఇది కాంటాక్ట్‌లెస్ డిజిటల్ ప్రాసెసింగ్ సేవలను అందించడంతో పాటుగా సామాజిక దూరాన్ని పాటించేలా చేసినట్లు అవుతుంది.

హ్యుందాయ్ కార్లకు ఐసిఐసిఐ లోన్స్; ఈజీ ఫైనాన్సింగ్ స్కీమ్ - వివరాలు

హ్యుందాయ్-ఐసిఐసిఐల మధ్య భాగస్వామ్యంపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ ప్లానింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ డబ్ల్యుఎస్ ఓహ్ మాట్లాడుతూ, "హ్యుందాయ్ తన ఉత్పత్తులు మరియు పరిష్కారాల ద్వారా కస్టమర్లు ఆనందాన్ని పంచుతోంది. క్లిక్ టు బై ద్వారా హ్యుందాయ్ తమ వినియోగదారులకు ఆన్‌లైన్ ద్వారా కారు కొనుగోలు చేసేటప్పు ప్రారంభం నుంచి చివరి వరకూ కావల్సిన అన్ని రకాల మద్దతును ఆఫర్ చేస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్‌తో మా భాగస్వామ్యం ద్వారా, దేశంలోని ఏ రిమోట్ ప్రదేశం నుండైనా కస్టమర్ తమకు నచ్చిన హ్యుందాయ్ కారును కొనుగోలు చేసేలా వారి ప్రయాణాన్ని బలపరుస్తాము మరియు అత్యంత ఉత్పాదక ఫైనాన్స్ డీల్స్‌తో వారికి రియల్ టైమ్ లావాదేవీలను అందిస్తామని" అన్నారు.

హ్యుందాయ్ కార్లకు ఐసిఐసిఐ లోన్స్; ఈజీ ఫైనాన్సింగ్ స్కీమ్ - వివరాలు

ఐసిఐసిఐ బ్యాంక్ సెక్యూర్ అసెట్స్ హెడ్ రవి నారాయణన్ మాట్లాడుతూ.. "కొత్త హ్యుందాయ్ కార్లను కొనాలని చూస్తున్న కస్టమర్ల కోసం ఆన్‌లైన్ ఫైనాన్స్ సొల్యూషన్స్‌ను అందించడానికి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌తో చేతులు కలపడం మాకు చాలా ఆనందంగా ఉంది. హెచ్‌ఎంఐఎల్‌తో ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్ చేయటం ద్వారా ఐసిఐసిఐ బ్యాంక్ నుండి ప్రీ-అప్రూవ్డ్ కార్ లోన్స్ సదుపాయం కలిగిన కస్టమర్లు 'క్లిక్ టు బై' వెబ్‌సైట్ ద్వారా తక్షణమే రుణాలను పొంది, కొనుగోళ్లు జరపవచ్చు. ఈ భాగస్వామ్యంతో, మా నుండి ఫైనాన్స్ పొందిన కస్టమర్లు హ్యుందాయ్ కార్ల కొనుగోలులో సౌకర్యవంతమైన, ఇబ్బందులు లేని అనుభవాన్ని పొందుతురాని మేము నమ్ముతున్నామ"ని అన్నారు.

హ్యుందాయ్ కార్లకు ఐసిఐసిఐ లోన్స్; ఈజీ ఫైనాన్సింగ్ స్కీమ్ - వివరాలు

'క్లిక్ టు బై' అనేది హ్యుందాయ్ ఆఫర్ చేస్తున్న ఎండ్-టూ-ఎండ్ అన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్, దీని ద్వారా కొత్త కార్లను షోరూమ్‌లను సందర్శించాల్సిన అవసరం లేకుండానే కొనుగోలు చేయవచ్చు. ఈ పోర్టల్ సాయంతో వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు కొత్త కార్లను అన్వేషించడం, వాటిని మనకు నచ్చినట్లుగా కస్టమైజే చేసుకోవటం, ఆన్-రోడ్ ధరలు తెలుసుకోవటం, డెడికేటెడ్ సేల్స్ కన్సల్టెంట్స్, ప్రముఖ బ్యాంక్‌ల నుంచి ఆన్‌లైన్ ఫైనాన్స్ ఆప్షన్స్, స్పెషల్ ఆన్‌లైన్ ప్రమోషన్స్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

హ్యుందాయ్ కార్లకు ఐసిఐసిఐ లోన్స్; ఈజీ ఫైనాన్సింగ్ స్కీమ్ - వివరాలు

కారు డెలివరీకి పట్టే సమయం, శానిటైజ్ చేయబడిన కార్లను టెస్ట్ డ్రైవ్ కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవటం, పూర్తిగా శానిటైజ్ చేసిన కార్లను డోర్ డెలివరీ పొదటం మొదలైన వివరాలను కూడా ఈ క్లిక్ టూ బై ద్వారా తెలుసుకోవచ్చు. హ్యుందాయ్ బ్రాండ్ ఇప్పటికే తమ ఆన్‌లైన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో అనేక విజయాలను సాధించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటి వరకూ అత్యధికంగా శోధించబడిన ఎస్‌యూవీ సరికొత్త క్రెటా అని కూడా కంపెనీ ప్రకటించింది - మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.

హ్యుందాయ్ కార్లకు ఐసిఐసిఐ లోన్స్; ఈజీ ఫైనాన్సింగ్ స్కీమ్ - వివరాలు

హ్యుందాయ్-ఐసిఐసిఐ డీల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితుల్లో అనేక మంది తయారీదారులు ఇబ్బంది లేని, నేరుగా సంప్రదించాల్సిన అవసరం లేని ఆన్‌లైన్ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్, ఐసిఐసిఐ సంస్థలు కూడా తమ వినియోగదారులకు కాంటాక్ట్‌లెస్ సేవలను అందించేందుకు ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పుడు కస్టమర్లు సురక్షితంగా ఇంటి పట్టునే ఉండి తమకు నచ్చిన హ్యుందాయ్ కారును కేవలం కొన్ని క్లిక్కులతో ఇంటికే రప్పించుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, June 23, 2020, 15:04 [IST]
English summary
Hyundai Motor India Limited (HMIL) signed an MoU with ICICI Bank to offer customised online four-wheeler financing solutions to customers across India. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+