Just In
- 9 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 21 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 21 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 24 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- News
వైఎస్ జగన్‌కు నారా లోకేష్ లేఖ: కేసీఆర్, మోడీ సర్కార్‌తో ముడిపెడుతూ
- Movies
Vakeelsaab 9 days collections: టార్గెట్‌కు ఇంకా కొద్దీ దూరంలోనే.. కోవిడ్ కష్టకాలంలో సాధ్యమేనా?
- Finance
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ ఛార్జీలపై ఎస్బీఐ వడ్డీ రేటు, ఫ్రీ ట్రాన్సాక్షన్స్
- Sports
MI vs SRH: ఏం చెప్పాలో తెలియడం లేదు.. ఈ ఓటమిని ఎలా తీసుకోవాలో అంతకన్నా అర్థం కావడం లేదు: వార్నర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, ఇదే కొత్త ధరల జాబితా!
అందరూ ఊహించినట్లుగానే హ్యుందాయ్ కార్స్ ఇండియా లిమిటెడ్ తమ వాహనాల ధరలను పెంచింది. పెరిగిన ధరలు జనవరి 1, 2021వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ అందిస్తున్న క్రెటా, వెన్యూ, వెర్నా, శాంత్రో, గ్రాండ్ ఐ 10 నియోస్, ఔరా మరియు ఐ20 మోడళ్ల ధరలను పెంచింది. మోడల్‌ను బట్టి వీటి ధరలు రూ.7,521 నుండి రూ.32,880 మేర పెరిగాయి.

హ్యుందాయ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా ధరలు రూ.27,335 మేర పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో దీని ధరలు రూ.9.82 లక్షల నుండి రూ.17.33 లక్షల మధ్యలో ఉన్నాయి. కంపెనీ ఇటీవలే, ఇందులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

హ్యుందాయ్ అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ ధరను కంపెనీ రూ.25,672 మేర పెంచింది. మార్కెట్లో దీని ధరలు రూ.6.76 లక్షల నుండి రూ.11.66 లక్షల మధ్యలో ఉన్నాయి. గడచిన అక్టోబర్ 2020లో కంపెనీ ఈ మోడల్ ధరలను రూ.5,000 నుండి రూ.12,000 మేర పెంచింది.
MOST READ:కొత్త స్టైల్‌లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ వెర్నా ధరలను కంపెనీ అత్యధికంగా రూ.32,880 మేర పెంచింది. ప్రస్తుతం మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.9.03 లక్షలుగా ఉంది. ఇకపోతే, హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ శాంత్రో ధరను కంపెనీ రూ.9,112 మేర పెంచింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.8,652 మేర పెరగగా, సిఎన్‌జి వెర్షన్ ధర రూ.14,556 మేర పెరిగింది. కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ ఐ10 మోడల్‌తో పాటుగా కంపెనీ కొత్త ఐ10 నియోస్ అమ్మకాలను కూడా కొనసాగిస్తోంది.
MOST READ:గుడ్ న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ చూడండి

హ్యుందాయ్ ఎక్సెంట్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వచ్చిన సరికొత్త మోడల్ ఔరా ధరను కూడా కంపెనీ పెంచింది. హ్యుందాయ్ ఔరా కాంపాక్ట్ సెడాన్ ధర రూ.11,745 మేర పెరగగా, సిఎన్‌జి వెర్షన్ ధర రూ.17,988 మేర పెరిగింది.

హ్యుందాయ్ తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 2020 మోడల్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ధరలను మాత్రం కంపెనీ స్వల్పంగా పెంచింది. రూ.7,521 మేర కంపెనీ ఈ మోడల్ ధరలను పెంచింది. హ్యుందాయ్ లైనప్‌లో అత్యల్ప ధరల పెరుగుదలను అందుకున్నది ఐ20 మాత్రమే.
MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

హ్యుందాయ్ మోటార్ ఇండియా, అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్ కూడా జనవరి 2021 నుండి ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కియా మోటార్స్ ప్రోడక్ట్ లైనప్‌లో కార్నివాల్ మినహా ఇతర మోడళ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న సప్లయ్ చైన్, ప్రభావితమైన దిగుమతులు, పెరిగిన ముడిపదార్థాల ధరలు మరియు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు మొదలైన కారణాల వలన కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ కంపెనీలు ధరల పెంపుకు సిద్ధమవుతున్నాయి.
MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి