హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ ఇండియా అందిస్తున్న ప్రీమియం సెడాన్ వెర్నాలో కంపెనీ కొత్తగా ఓ బేస్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త "హ్యుందాయ్ వెర్నా ఇ" బేస్ వేరియంట్‌ను రూ.9.02 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేశారు. ఈ కొత్త బేస్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

దేశీయ విపణిలో హ్యుందాయ్ వెర్నా సెడాన్ కొనుగోలుదారులకు మరింత సరసమైన ఆప్షన్‌ను అందించే దిశగా కంపెనీ ఈ కొత్త బేస్ వేరియంట్‌ను విడుదల చేయగలిగింది. కొత్త వెర్నా ఇ బేస్ వేరియంట్ ఇప్పుడు ఈ సెడాన్ మొత్తం లైనప్‌లో నెక్స్ట్ లెవల్ వేరియంట్ కంటే రూ.36,000 తక్కువ ధరను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త బేస్ వేరియంట్ హ్యుందాయ్ వెర్నా దాని మునుపటి ఎంట్రీ లెవల్ ఎస్ వేరియంట్‌తో పోల్చి చూస్తే, ఈ కొత్త వెర్నా ఇ వేరియంట్‌లో కొన్ని ఫీచర్లు తక్కువగా ఉంటాయి. ఇందులో షార్క్-ఫిన్ యాంటెన్నా, సన్-గ్లాస్ హోల్డర్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండవు.

MOST READ:పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కొత్త వీడియో.. చూసారా !

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

అంతేకాకుండా హ్యుందాయ్ వెర్నా ఇ వేరియంట్‌లో స్వీట్-సౌండింగ్ ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు బ్రాండ్ యొక్క హ్యుందాయ్ ఐబ్లూ స్మార్ట్‌ఫోన్-కనెక్ట్ ఫీచర్లు కూడా లభించవు.

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇందులోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి పవర్‌ను మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ తమ వెర్నా సెడాన్‌ను 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా డీజిల్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో కూడా అందిస్తోంది. ఇందులోని 1.5-లీటర్ విజిటి డీజిల్ ఇంజన్ 114 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, శక్తివంతమైన 1.0-లీటర్, త్రీ సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి పవర్‌ను మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

గేర్‌బాక్స్ ఆప్షన్లలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. అలాగే, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మరింత స్పోర్టీ అనుభూతిని కోసం ఈ టర్బో వేరియంట్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు కూడా ఉన్నాయి.

MOST READ:ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ వెర్నాలో లభిస్తున్న ఇతర వేరియంట్లు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, కొత్త పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త రీస్టైల్డ్ ఏసి వెంట్స్, డాష్‌బోర్డ్‌లో కొత్త ఫాక్స్ వుడ్ ట్రిమ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కారులో హ్యుందాయ్ బ్రాండ్ యొక్క సరికొత్త బ్లూ లింక్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇందులో స్మార్ట్-వాచ్ యాప్ లింక్, రిమోట్ వెహికల్ స్టార్ట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ డాక్ మరియు సన్‌రూఫ్ వంటి కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2020 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ఆరు కలర్లలో లభిస్తుంది. భారత మార్కెట్లో కొత్త ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌కి గట్టి పోటీనిచ్చేందుకు హ్యుందాయ్ వెర్నా ఇ బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది.

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

మార్కెట్లో నాల్గవ మరియు ఐదవ తరం హోండా సిటీ కంటే కొత్త హ్యుందాయ్ వెర్నా వరుసగా రూ.27,000 మరియు రూ.1.8 లక్షలు తక్కువ ధరను కలిగి ఉంటుంది. హోండా సిటీ మోడళ్లతో పాటుగా స్కోడా రాపిడ్ మరియు టయోటా యారిస్ వంటి మోడళ్లకు కూడా హ్యుందాయ్ వెర్నా పోటీగా నిలుస్తుంది.

హ్యుందాయ్ వెర్నాలో చవకైన వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ వెర్నా బేస్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హ్యుందాయ్ వెర్నా సెడాన్‌లో కంపెనీ ఓ కొత్త బేస్ పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. కనీస ఫీచర్లతో సరసమైన ధరకే మంచి సెడాన్‌ను కొనాలని చూస్తున్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని హ్యుందాయ్ ఈ కొత్త వెర్నా బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది.

Most Read Articles

English summary
Hyundai India has launched a new base variant of the Verna in the Indian market. The new Hyundai Verna E variant retails at Rs 9.02 lakh (ex-showroom, Delhi). Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X