హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో సమస్యలు, రీకాల్

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ఎలక్ట్రిక్ కారు 'హ్యుందాయ కోనా'లో కొన్ని సాంకేతికపరమైన సమస్యల దృష్ట్యా వాటిని వెనక్కి పిలిపిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 1, 2019 నుండి అక్టోబర్ 31, 2020 మధ్య కాలంలో తయారు చేసిన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రీకాల్ చేసింది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో సమస్యలు, రీకాల్

ఈ సమయంలో మొత్తం 456 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇవన్నీ కూడా ఈ స్వచ్ఛంద రీకాల్‌కు వర్తిస్తాయని వివరించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల హై-వోల్టేజ్ బ్యాటరీ వ్యవస్థలలోని విద్యుత్ లోపం కారణంగా వీటిని రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. రీకాల్‌కు వర్తించే వాహనాల్లో ఈ సమస్యను ఉచితంగా పరిష్కరిస్తామని కంపెనీ తెలిపింది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో సమస్యలు, రీకాల్

రీకాల్‌కు గురైన వాహనాల గురించి హ్యుందాయ్ తమ వినియోగదారులకు దశల వారీగా తెలియజేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కలిగి ఉన్న యజమానులు తమ వాహనాలను హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ల వద్దకు తీసుకువచ్చి, సదరు సమస్యను ఉచితంగా సరిచేయించుకోవచ్చు.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో సమస్యలు, రీకాల్

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇందులో 39.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌కు జతచేయబడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 134 బిహెచ్‌పి శక్తిని మరియు 395 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కోనా ఈవి కేవలం 9.7 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో సమస్యలు, రీకాల్

పూర్తి ఛార్జీపై హ్యుందాయ్ కోనా 452 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులోని 39.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏసి ఛార్జర్ ఉపయోగిస్తున్నప్పుడు వంద శాతం ఛార్జ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్‌కు కనెక్ట్ చేసినట్లయితే, కేవలం 57 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం చార్జ్ అవుతుంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో సమస్యలు, రీకాల్

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులోని ఇతర ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అడ్జస్టబల్ స్టీరింగ్, ఎయిర్ క్వాలిటీ కంట్రోల్, యాక్సెసరీ పవర్ అవుట్‌లెట్, రియర్ రీడింగ్ ల్యాంప్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ మరియు స్టోరేజ్‌తో కూడిన సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్ మొదలైనవి ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో సమస్యలు, రీకాల్

ఇంకా ఇందులో బటన్-టైప్ షిఫ్ట్-బై-వైర్ టెక్నాలజీ, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ వెంటిలేషన్ డక్ట్స్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి స్మార్ట్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి - ఎకో, ఎకో+, కంఫర్ట్ మరియు స్పోర్ట్. మరింత స్పోర్టీ ఫీల్ కోసం ఇందులో పాడిల్ షిఫ్టర్లు కూడా ఉంటాయి.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో సమస్యలు, రీకాల్

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఈబిడితో కూడిన ఏబిఎస్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, బహుళ ఎయిర్‌బ్యాగులు, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, సీట్ బెల్ట్ అలెర్ట్ అలారం, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్) మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో సమస్యలు, రీకాల్

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వాహనం రెండు వేరియంట్లు మరియు తొమ్మిది రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధరలు రూ.23.75 లక్షల నుండి ప్రారంభం అవుతాయి (ఎక్స్-షోరూమ్ ఇండియా). మార్కెట్లో ఇది ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి పోటీగా నిలుస్తుంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో సమస్యలు, రీకాల్

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు రీకాల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో హ్యుందాయ్ నుండి లభిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'కోనా'. ఈ కారులో భవిష్యత్తులో తలెత్తబోయే ఎలక్ట్రిక్ వ్యవస్థకు సంబంధించిన సమస్య గురించి కంపెనీ ముందస్తుగానే గుర్తించి స్వచ్ఛందంగా రీకాల్ ప్రకటించింది. హ్యుందాయ్ తమ వినియోగదారులకు ఇబ్బంది లేని సేవలను అందించే లక్ష్యంలో భాగంగా, ఈ సమస్యను ఉచితంగా సరిచేయనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 3, 2020, 9:50 [IST]
English summary
Hyundai Motor India has announced a voluntary recall for its Kona Electric SUV due to possible issue with BMS. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+