Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త హ్యుందాయ్ శాంత్రో సిఎన్‌జి వేరియంట్స్ విడుదల: ధర, ఫీచర్లు
హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 'శాంత్రో'లో కంపెనీ రెండు కొత్త సిఎన్‌జి వేరియంట్‌లను విడుదల చేసింది. హ్యుందాయ్ శాంత్రా ఇప్పుడు మాగ్నా సిఎన్‌జి మరియు స్పోర్ట్జ్ సిఎన్‌జి అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది.

కొత్త వచ్చిన హ్యుందాయ్ శాంత్రో సిఎన్‌జి వేరియంట్లు దాని పెట్రోల్ వేరియంట్ల మాదిరిగానే ఒకే రకమైన ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటాయి. హ్యుందాయ్ శాంత్రో మాగ్నా సిఎన్‌జిలో 2-డిన్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, మాన్యువల్ ఏసి, బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ శాంత్రో స్పోర్ట్జ్ సిఎన్‌జి, మాగ్నా సిఎన్‌జి వేరియంట్‌కు ఎగువన ఉంటుంది మరియు అదనపు పరికరాలను కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బిల్ట్-ఇన్ నావిగేషన్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లతో కూడిన ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, కీలెస్ ఎంట్రీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.
MOST READ:పోర్స్చే పనామెరా 4 10 ఇయర్ ఎడిషన్ ఫస్ట్ లుక్ రివ్యూ

ఇంజన్ పరంగా రెండు కొత్త వేరియంట్లు ఒకేలా ఉంటాయి. ఇందులో 1.1-లీటర్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. సిఎన్‌జితో నడిచే ఈ ఇంజన్ 60 బిహెచ్‌పి పవర్‌ను మరియు 85 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. పెట్రోల్‌తో నడిచే అదే ఇంజన్ 69 బిహెచ్‌పి పవర్‌ను మరియు 99 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది. సిఎన్‌జి వెర్షన్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లేదు.

పైన పేర్కొన్న అప్‌డేట్స్ మినహా కొత్త హ్యుందాయ్ శాంత్రో సిఎన్‌జి వేరియంట్లలో వేరే ఏ ఇతర మార్పులు లేవు. హ్యుందాయ్ శాంత్రో యొక్క రెండు సిఎన్‌జి వేరియంట్లు ఒకే రకమైన భద్రతా పరికరాలను కలిగి ఉంటాయి. ఇందులో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డ్రైవర్స్ ఎయిర్ బ్యాగ్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:ఈ స్టార్ కపుల్స్ పెళ్లి రోజు కొన్న కారు ధర రూ. 2.65 కోట్లు.. ఇంతకీ వారు ఎవరో తెలుసా ?

కొత్త తరం హ్యుందాయ్ శాంత్రోను గత ఏడాది భారత మార్కెట్లో కంపెనీ విడుదల చేసింది. దాదాపు 7 సంవత్సరాల విరామం తర్వాత కంపెనీ తిరిగి శాంత్రో మోడల్‌ను పునఃప్రవేశపెట్టింది. కొరియన్ కార్ బ్రాండ్ నుంచి వచ్చిన హ్యుందాయ్ శాంత్రో భారత స్మాల్ కార్ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన బెస్ట్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లో ఒకటిగా ఉంది.

హ్యుందాయ్ శాంత్రో భారత మార్కెట్లోని ఈ విభాగంలో మారుతి సుజుకి సెలెరియో, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ మరియు టాటా టియాగో మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. కొత్తగా వచ్చిన హ్యుందాయ్ శాంత్రో సిఎన్‌జి వేరియంట్లు ఈ విభాగంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి మోడల్‌కు పోటీగా నిలుస్తుంది.
భారత మార్కెట్లో హ్యుందాయ్ శాంత్రో సిఎన్‌జి వేరియంట్ల ధరలు ఇలా ఉన్నాయి:
-> హ్యుందాయ్ శాంత్రో మాగ్నా సిఎన్‌జి - రూ.5.87 లక్షలు
-> హ్యుందాయ్ శాంత్రో స్పోర్ట్జ్ సిఎన్‌జి - రూ.6.00
(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
MOST READ:మీరు ఈ బైక్ గుర్తుపట్టారా.. ఇది అందరికీ ఇష్టమైన బైక్ కూడా

హ్యుందా శాంత్రో సిఎన్‌జి వేరియంట్ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ శాంత్రో అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్. ఈ హ్యాచ్‌బ్యాక్ తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుండి హ్యుందాయ్ నెలవారీ అమ్మకాలు క్రమంగా పెరుగుతూ, కంపెనీకి మంచి ఫలితాలను తెచ్చిపెడుతోంది. కొత్తగా వచ్చిన సిఎన్‌జి వేరియంట్లతో మెట్రో నగరాల్లో ఈ మోడల్ అమ్మకాలు మరింత జోరందుకునే ఆస్కారం ఉంది.