హ్యుందాయ్ వండర్ వారంటీ స్కీమ్ - వివరాలు

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ఎలక్ట్రిక్ కారు 'హ్యుందాయ కోనా'పై కంపెనీ ఓ సరికొత్త వారంటీ స్కీమ్‌ని ప్రారంభించింది. 'వండర్ వారంటీ స్కీమ్' పేరుతో ఓ వేరియబుల్ వారంటీ ఆప్షన్‌ను హ్యుందాయ్ ప్రకటించింది.

హ్యుందాయ్ వండర్ వారంటీ స్కీమ్ - వివరాలు

ఇప్పుడు హ్యుందాయ్ కోనా ఈవిని కొనుగోలు చేసే కస్టమర్లు మూడు సంవత్సరాలు / అపరిమిత కిలోమీటర్, నాలుగు సంవత్సరాలు / 60,000 కిలోమీటర్లు మరియు ఐదు సంవత్సరాలు / 50,000 కిలోమీటర్ల వారంటీ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఈ కొత్త వారంటీ ఆఫర్లు బ్యాటరీ ప్యాక్ కోసం స్టాండర్డ్‌గా అందిస్తున్న ఎనిమిది సంవత్సరాలు / 1,60,000 కిలోమీటర్లకు అదనంగా ఉంటాయి.

హ్యుందాయ్ వండర్ వారంటీ స్కీమ్ - వివరాలు

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులో 39.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌కు జతచేయబడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 134 బిహెచ్‌పి శక్తిని మరియు 395 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:పిల్లల కోసం బుగట్టి బేబీ 2 ఎలక్ట్రిక్ కార్

హ్యుందాయ్ వండర్ వారంటీ స్కీమ్ - వివరాలు

ఈ ఎలక్ట్రిక్ కారులో నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి - ఎకో, ఎకో+, కంఫర్ట్ మరియు స్పోర్ట్. మరింత స్పోర్టీ ఫీల్ కోసం ఇందులో పాడిల్ షిఫ్టర్లు కూడా ఉంటాయి. కోనా ఈవి కేవలం 9.7 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

హ్యుందాయ్ వండర్ వారంటీ స్కీమ్ - వివరాలు

పూర్తి ఛార్జీపై హ్యుందాయ్ కోనా 452 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులోని 39.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏసి ఛార్జర్ ఉపయోగిస్తున్నప్పుడు వంద శాతం ఛార్జ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్‌కు కనెక్ట్ చేసినట్లయితే, కేవలం 57 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం చార్జ్ అవుతుంది.

MOST READ:ఒక నెలరోజుల తరువాత పట్టుబడ్డ లంబోర్ఘిని సూపర్ కార్ : ఎలాగో తెలుసా !

హ్యుందాయ్ వండర్ వారంటీ స్కీమ్ - వివరాలు

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారులోని ఇతర ముఖ్య ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అడ్జస్టబల్ స్టీరింగ్, ఎయిర్ క్వాలిటీ కంట్రోల్, యాక్సెసరీ పవర్ అవుట్‌లెట్, రియర్ రీడింగ్ ల్యాంప్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ మరియు స్టోరేజ్‌తో కూడిన సెంట్రల్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్ మొదలైనవి ఉన్నాయి.

హ్యుందాయ్ వండర్ వారంటీ స్కీమ్ - వివరాలు

ఈ వాహనంలో బటన్-టైప్ షిఫ్ట్-బై-వైర్ టెక్నాలజీ, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ వెంటిలేషన్ డక్ట్స్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి స్మార్ట్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:మేడ్-ఇన్-ఇండియా సైకిల్ పై బ్రిటీష్ పిఎం బోరిస్ జాన్సన్

హ్యుందాయ్ వండర్ వారంటీ స్కీమ్ - వివరాలు

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఈబిడితో కూడిన ఏబిఎస్, చైల్డ్ సేఫ్టీ లాక్స్, బహుళ ఎయిర్‌బ్యాగులు, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, సీట్ బెల్ట్ అలెర్ట్ అలారం, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్) మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

హ్యుందాయ్ వండర్ వారంటీ స్కీమ్ - వివరాలు

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వాహనం రెండు వేరియంట్లు మరియు తొమ్మిది రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధరలు రూ.23.85 లక్షల నుండి 24.11 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్ ఇండియా) ఉన్నాయి.

MOST READ:భారత అమ్ములపొదలో చేరిన మరో బ్రహ్మాస్త్రం : రాఫెల్ ఫైటర్ జెట్స్

హ్యుందాయ్ వండర్ వారంటీ స్కీమ్ - వివరాలు

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు వండర్ వారంటీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మేము ఇంతకు ముందే చెప్పినట్లుగా, మరికొద్ది రోజుల్లో పండుగ సీజన్ రానున్న నేపథ్యంలో, కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త స్కీమ్‌లను ప్రారంభిస్తున్నాయి. ఈ కోవలోనే హ్యుందాయ్ కూడా తమ కోనా ఎలక్ట్రిక్ కారుపై నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు వివిధ రకాల వారంటీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కోనా కార్ విక్రయాలు పెరుగుతాయని హ్యుందాయ్ ఆశాభావంతో ఉంది.

Most Read Articles

English summary
South Korean auto manufacturer Hyundai has announced variable warranty options under its Wonder Warranty Scheme for its Hyundai Kona electric vehicle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X