ఇకపై హ్యుందాయ్ కస్టమర్లందరికీ మొబిలిటీ మెంబర్‌షిప్ - వివరాలు

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) ఇప్పటి వరకూ తమ కొత్త కార్ల యజమానులకు మాత్రమే అందిస్తున్న 'హ్యుందాయ్ మొబిలిటీ మెంబర్‌షిప్'ను ఇదివరకే హ్యుందాయ్ కార్లు కలిగి ఉన్న కస్టమర్లందరికీ పొడగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఇకపై హ్యుందాయ్ కస్టమర్లందరికీ మొబిలిటీ మెంబర్‌షిప్ - వివరాలు

గడచిన ఆగస్ట్ నెలలో హ్యుందాయ్ తమ మొబిలిటీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలుత దీనిని కేవలం కొత్తగా హ్యుందాయ్ కారు కొనేవారికి మాత్రమే ఆఫర్ చేసేవారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటివరకు లక్ష మందికి పైగా చందాదారులు వచ్చారని, ఇకపై ఈ సేవలను ప్రస్తుత హ్యుందాయ్ వినియోగదారులకు కూడా విస్తరిస్తామని కంపెనీ పేర్కొంది.

ఇకపై హ్యుందాయ్ కస్టమర్లందరికీ మొబిలిటీ మెంబర్‌షిప్ - వివరాలు

'హ్యుందాయ్ మొబిలిటీ మెంబర్‌షిప్' ప్రోగ్రాం కింద సేవలను అందించడానికి కంపెనీ 31 బ్రాండ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత మార్కెట్లో ఈ రకమైన సభ్యత్వ కార్యక్రమం ఇదే మొదటిదని కంపెనీ తెలిపింది. ఈ సభ్యత్వ కార్యక్రమంలో సభ్యత్వం పొందిన వినియోగదారులు ప్రత్యేకమైన తగ్గింపులను కూడా పొందే అవకాశం ఉంది.

MOST READ:మీకు తెలుసా.. 2021 డాకర్ ర్యాలీలో పాల్గొనే హీరో మోటార్‌స్పోర్ట్ టీమ్ ఇదే

ఇకపై హ్యుందాయ్ కస్టమర్లందరికీ మొబిలిటీ మెంబర్‌షిప్ - వివరాలు

హ్యుందాయ్ మొబిలిటీ మెంబర్‌షిప్ (Hyundai Mobility Membership) కోసం యాపిల్ మరియు గూగుల్ ప్లే స్టోర్లలో ఓ ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ అప్లికేషన్‌ను వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకొని ఇందులోని రిజిస్టర్ కావటంతో పాటుగా అనేక ఇతర ఫీచర్లను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇకపై హ్యుందాయ్ కస్టమర్లందరికీ మొబిలిటీ మెంబర్‌షిప్ - వివరాలు

హ్యుందాయ్ మొబిలిటీ మెంబర్‌షిప్‌లో భాగంగా కారుకి సంబంధించి యాక్ససరీలు, లూబ్రికెంట్స్ మరియు టైర్లు మొదలైన వాటిపై ప్రస్తుత మరియు కొత్త హ్యుందాయ్ వినియోగదారులు ప్రత్యేకమైన డిస్కౌంట్లను పొందవచ్చు. హ్యుందాయ్ వీటి కోసం మోబిస్, షెల్ మరియు జెకె టైర్స్ వంటి కంపెనీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

ఇకపై హ్యుందాయ్ కస్టమర్లందరికీ మొబిలిటీ మెంబర్‌షిప్ - వివరాలు

అలాగే, మొబిలిటీ సేవల కోసం రెవ్, జూమ్‌కార్, అవిస్ మరియు సవారీ వంటి రైడ్ భాగస్వాములతో కూడా అనుబంధాన్ని ఏర్పరచుకుంది. అంతేకాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గానా మరియు జి5, ఆహారం కోసం డైనౌట్ మరియు చయోస్, ఆరోగ్యానికి సంబంధించి 1ఎంజి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం పోర్ట్రానిక్స్ మరియు లెర్నింగ్ కోసం వేదాంత వంటి సంస్థలతో హ్యుందాయ్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.

ఇకపై హ్యుందాయ్ కస్టమర్లందరికీ మొబిలిటీ మెంబర్‌షిప్ - వివరాలు

ఈ సేవలను పొందాలంటే, పైన పేర్కొన్నట్లుగా హ్యుందాయ్ కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో 'హ్యుందాయ్ మొబిలిటీ మెంబర్‌షిప్' అప్లికేషన్‌ను ప్లేస్టోర్/యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యాప్‌లో తమ హ్యుందాయ్ కారు మరియు వ్యక్తిగత వివరాలను నమోదు చేసి సైన్ అప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యాప్‌లో సైన ఇన్ అయ్యి, పైన పేర్కొన్న ఆఫర్లను, వివిధ రకాల కంపెనీలు అందించే సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు.

MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

ఇకపై హ్యుందాయ్ కస్టమర్లందరికీ మొబిలిటీ మెంబర్‌షిప్ - వివరాలు

హ్యుందాయ్ మొబిలిటీ మెంబర్‌షిప్‌లో వీడియో యాప్‌పై ఉచిత చందా, మ్యూజిక్ యాప్‌పై తగ్గింపు, ఫిట్‌నెస్, ట్రావెల్, రైడ్ సహా అనేక ఇతర యాప్‌లపై ఉచిత చందా మరియు సేవలను పొందవచ్చు. అయితే, ఇందులో వివిధ యాప్‌ల నుండి అందిస్తున్న సేవలకు హ్యుందాయ్‌కి నేరుగా ఎలాంటి ప్రత్యక్ష సంబంధం మాత్రం ఉండదు (ప్రత్యేకించి చెల్లింపుల విషయంలో).

ఇకపై హ్యుందాయ్ కస్టమర్లందరికీ మొబిలిటీ మెంబర్‌షిప్ - వివరాలు

ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే కస్టమర్‌లు లేదా డిజిటల్ లైఫ్‌కి అలవాటు పడిన వారికి హ్యుందాయ్ మొబిలిటీ మెంబర్‌షిప్ వన్ స్టాప్ సొల్యూషన్స్‌ని అందించే లక్ష్యంగా ఈ సేవలను ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం, హ్యుందాయ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.membership.hyundai.co.in ని సందర్శించండి.

MOST READ:ఒకే రోజు ఏడు గ్లోస్టర్ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన ఎంజి మోటార్ ; ఎక్కడో తెలుసా ?

Most Read Articles

English summary
Hyundai India has extended the ‘Hyundai Mobility Membership’ to all existing Hyundai customers in addition to the new car owners. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X