Just In
- 2 hrs ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 3 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 4 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 5 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- News
భారత్‌లో రెండో రోజూ భారీగా పెరిగిన కరోనా కేసులు: 16వేలకు పైగానే, మరణాలు పెరిగాయి
- Sports
పిచ్‌ను నిందించిన మాజీ క్రికెటర్లపై అశ్విన్ పరోక్ష వ్యాఖ్యలు!
- Movies
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హ్యుందాయ్ కార్లపై సెప్టెంబర్ డీల్స్; ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్!
హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబర్ నెలలో భాగంగా, ఎంపిక చేసిన మోడళ్లపై వివిధ రకాల డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలను ప్రకటించింది. ఈ నెలలో హ్యుంద్యాయ్ కారును కొనుగోలు చేసే కస్టమర్లు మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి రూ.60,000 వరకు గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు.

సెప్టెంబర్ నెలలో అందించే ప్రయోజనాల్లో భాగంగా కొత్త కొనుగోళ్లపై పొడిగించిన వారంటీ మరియు రోడ్-సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీలు ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్లలో భాగమైన మోడళ్లలో శాంట్రో, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్, ఎలైట్ ఐ20, ఔరా మరియు ఎలంట్రా కార్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ క్లిక్ టు బై ద్వారా కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా అధీకృత హ్యుందాయ్ డీలర్‌షిప్‌ల ద్వారా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ ఆఫర్లను పొందవచ్చు. ఈ ఆఫర్లు సెప్టెంబర్ 30, 2020 వరకు చెల్లుబాటులో ఉంటాయి. వివిధ హ్యుందాయ్ కార్లపై మోడల్ వారీగా అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
MOST READ:కియా సోనెట్‌లో అందరూ మెచ్చుకునే టాప్ 8 ఫీచర్లు ఏంటో తెలుసా?

హ్యుందాయ్ శాంట్రో
హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ శాంట్రో కారుపై కంపెనీ సెప్టెంబర్ నెల ఆఫర్లలో భాగంగా, గరిష్టంగా రూ.45,000 వరకు లాభాలను అందిస్తోంది. హ్యుందాయ్ శాంట్రో పెట్రోల్ మరియు సిఎన్‌జి ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇందులోని 1.1-లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ 67 బిహెచ్‌పి పవర్‌ను మరియు 99 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది ఈ విభాగంలో, టాటా టియాగో మరియు మారుతి సెలెరియో వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
MOST READ:ఒకినావా ఫౌండర్ & ఎండి జీతేందర్ శర్మతో ఇంటర్వ్యూ : ఇంటర్వ్యూలో ఎం చెప్పారో తెలుసా ?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వేరియంట్‌ను బట్టి రూ.60,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. గ్రాండ్ ఐ10 బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేయబడిన మోడల్. ఇది ఒకే ఒక పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది.

ఇందులోని 1.2-లీటర్ ‘కప్పా' ఇంజన్ గరిష్టంగా 81 బిహెచ్‌పి పవర్‌ను మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ మాగ్నా మరియు స్పోర్ట్జ్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.
MOST READ:రూ. 5 లక్షల లోపు ధర కలిగిన మారుతి సుజుకి టాప్ 5 కార్లు ఇవే.. చూసారా

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్
కొత్త తరం హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై కంపెనీ గరిష్టంగా రూ.25,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ హ్యాచ్‌బ్యాక్ బహుళ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో 1.2-లీటర్ డీజిల్ ఇంజన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌లు ఉన్నాయి.

అంతేకాకుండా, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసిన శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కూడా ఈ హ్యాచ్‌బ్యాక్ లభిస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఈ విభాగంలో మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఫోర్డ్ ఫిగో మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
MOST READ:మమ్ముట్టి ర్ కలెక్షన్ : ఈ కార్లకు ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో తెలుసా ?కా

హ్యుందాయ్ ఎలైట్ ఐ20
హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులోని అన్ని వేరియంట్లపై కంపెనీ రూ.60,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో ఆఫర్ చేస్తున్నారు. ఇందులోని 1.2-లీటర్ ఇంజన్ గరిష్టంగా 81 బిహెచ్‌పి పవర్‌ను మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

హ్యుందాయ్ ఔరా
హ్యుందాయ్ ఔరా అనేది ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న కాంపాక్ట్-సెడాన్, ఇది గతంలోని హ్యుందాయ్ ఎక్సెంట్ స్థానాన్ని భర్తీ చేయటానికి వచ్చిన మోడల్. ఈ కారుపై గరిష్టంగా రూ.20,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఈ కాంపాక్ట్ సెడాన్ కూడా గ్రాండ్ ఐ10 నియోస్‌లో కనిపించే మాదిరిగానే ఒకేరకమైన ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ ఎలాంట్రా
హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎలంట్రా. హ్యుందాయ్ 2019 తమ ఫ్లాగ్‌షిప్ ఎలాంట్రా సెడాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎలంట్రా పెట్రోల్ వేరియంట్‌లపై గరిష్టంగా రూ.60,000 మరియు డీజిల్ మోడళ్లపై రూ.30,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇది ఈ విభాగంలో హోండా సివిక్ మరియు స్కోడా ఆక్టేవియా వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

హ్యుందాయ్ సెప్టెంబర్ నెల డిస్కౌంట్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న పండుగ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు హ్యుందాయ్ తమ కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలను అందిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ సమయంలో కొనుగోలు నిర్ణయం తీసుకోవడంలో కస్టమర్లకు సహాయపడేందుకు కంపెనీ సులభమైన ఫైనాన్స్ పథకాలను మరియు సౌకర్యవంతమైన ఈఎమ్ఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది.