ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడనున్న బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందిన హ్యుందాయ్ సంస్థనుంచి ఇప్పటికే చాలా వాహనాలు విడుదలయ్యాయి. ఇప్పుడు బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ని రాబోయే ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడనున్న బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

దక్షిణ కొరియా తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్స్ రాబోయే ఆటో ఎక్స్‌పోలో సరికొత్త హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఆటో ఎక్స్‌పో కార్యక్రమానికి రెండు వారాల కన్నా తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు వాహనం యొక్క ఇంజిన్ లక్షణాలు వెల్లడయ్యాయి.

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడనున్న బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

సాధారణంగా హ్యుందాయ్ వెర్నా రెండు రకాల ఇంజిన్లను కలిగి ఉంటాయి. ఒకటి 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్. రెండు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజిన్ల యొక్క పనితీరు గణాంకాలను గమనించినట్లయితే 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్ 89 బిహెచ్‌పి శక్తి, 220 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. రెండవ ఇంజిన్ 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 99 బిహెచ్‌పి శక్తి వద్ద, 132 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తాయి.

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడనున్న బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుత తరం హ్యుందాయ్ వెర్నాలో 1.6-లీటర్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్‌లను కలిగి ఉంటాయి. వీటి యొక్క శక్తి మరియు పనితీరు గణాంకాలు 126 బిహెచ్‌పి శక్తి వద్ద 260 ఎన్ఎమ్ టార్క్, మరియు 121 బిహెచ్‌పి శక్తి వద్ద 151ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తాయి.

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడనున్న బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

రాబోయే హ్యుందాయ్ వెర్నా ఫేస్ లిఫ్ట్ బిఎస్ 6 మోడల్స్ యొక్క ఇంటీరియర్స్ అప్హోల్స్టరీ మరియు హైలైట్లను నవీనీకరించడం జరిగింది. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడనున్న బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

ఈ వాహనంలో ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, పుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఆడియో కోసం స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కలిగిన కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ వంటివి కలిగి ఉంటాయి.

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడనున్న బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

ఇవే కాకుండా 2020 వెర్నా బిఎస్ 6 మోడళ్లలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎంలు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు కూల్-బాక్స్ కూడా ఉన్నాయి.

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడనున్న బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

బిఎస్ 6 వెర్నా కారులో భద్రతా లక్షణాలు చాలా సురక్షితంగా ఉంటాయి. ఎబిఎస్ విత్ ఇబిడి, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ సేఫ్టీ అలారం, ఓవర్ స్పీడింగ్ హెచ్చరిక వ్యవస్థ, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్‌లు ఉంటాయి.

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడనున్న బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుత తరం హ్యుందాయ్ వెర్నా మోడళ్ల యొక్క ధర రూ .8.18 లక్షల నుంచి రూ .14.08 లక్షల మధ్య ఉంటుంది. అయితే ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల ధర మాత్రం రూ. 10 లక్ష నుంచి రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్- ఇండియా) మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడనున్న బిఎస్-6 హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

ఆటో ఎక్స్‌పోలో బిఎస్ 6 మోడల్ యొక్క హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ ని ఆవిష్కరించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఆటో ఎక్స్‌పోలో కొత్త మోడల్స్ మరియు ఫేస్ లిఫ్ట్ మోడల్స్ వంటి కార్లను ఇతర కంపెనీలు కూడా ఆవిష్కరించనున్నాయి. ఇవన్నీ నేటి తరం యొక్క వినియోగ దారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విడుదలచేయడం జరుగుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2020, 10:54 [IST]
English summary
Hyundai Verna Facelift BS6 Model To Be Unveiled At Auto Expo. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+