హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ, హ్యుందాయ్ వెన్యూలో ఓ సరికొత్త ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన వేరియంట్‌ను అధికారికంగా విడుదల చేసింది. అంతే కాకుండా, హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు సరికొత్త 'స్పోర్ట్ ట్రిమ్' వేరియంట్‌లో కూడా లభ్యం కానుంది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఐఎమ్‌టి గేర్‌బాక్స్ అమర్చిన కొత్త హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ వేరియంట్ ధర రూ.9.99 లక్షలుగా ఉండగా, కొత్తగా ప్రవేశపెట్టిన టాప్-ఎండ్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ.11.58 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఐఎమ్‌టి)తో హ్యుందాయ్ వెన్యూ

ఐఎమ్‌టి అనే గేర్‌బాక్స్‌తో విడుదలైన హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ 1.0-లీటర్ టి-జిడిఐ పెట్రోల్ ఇంజన్‌తో ప్రత్యేకంగా లభిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి - ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) అనే రెండు టాప్-స్పెక్ వేరియంట్‌లలో లభిస్తుంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

* హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి ఎక్స్ఎక్స్ - రూ.9.99 లక్షలు

* హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి ఎక్స్ఎక్స్ (ఓ) - రూ.11.08 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

MOST READ:బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ వెన్యూ కారులోని ఐఎమ్‌టి గేర్‌బాక్స్ 2-పెడల్ ట్రాన్స్‌మిషన్ సౌలభ్యంతో మాన్యువల్ ట్రాన్స్మిషన్ పనితీరును అందిస్తుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి క్లచ్-పెడల్ లేని మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులోని సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌లో ఎలక్ట్రో-మెకానికల్ యాక్చుయేటెడ్ క్లచ్ ఉంటుంది, ఇది ఇ్బబందులు లేని గేర్‌షిఫ్ట్‌లను అందిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కొత్త ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ హ్యుందాయ్ అందిస్తున్న శక్తివంతమైన 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇటీవలే అప్‌గ్రేడ్ చేసిన ఈ బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని మరియు 170 ఎన్ఎమ్‌ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కొత్త గేర్‌బాక్స్‌తో పాటుగా, హ్యుందాయ్ వెన్యూ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో (ఐఎమ్‌టి మరియు 7-స్పీడ్ డిసిటి) లభ్యం కానుంది.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కార్ డ్రైవ్ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ వెన్యూ స్పోర్ట్ ట్రిమ్

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఐఎమ్‌టి ట్రాన్స్‌మిషన్‌తో పాటుగా కంపెనీ కొత్త హ్యుందాయ్ వెన్యూ ‘స్పోర్ట్ ట్రిమ్' వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. కొత్త స్పోర్ట్ ట్రిమ్ ఇప్పుడు మూడు వేరియంట్లలో (ఎస్ఎక్స్, ఎస్ఎక్స్+ మరియు ఎస్ఎక్స్ (ఓ)) ఆఫర్ చేయబడుతోంది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

వెన్యూ స్పోర్ట్ ట్రిమ్ ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటిలో ఒకటి కొత్త ఐఎమ్‌టి ట్రాన్స్‌మిషన్‌కు అనుసంధానించబడిన 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, మరొకటి స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లు ఇందులో ఉన్నాయి. ఇకపోతే, హ్యుందాయ్ వెన్యూ స్పోర్ట్ ట్రిమ్ మిడ్-స్పెక్ వేరియంట్ అయిన ‘ఎస్ఎక్స్ +' మాత్రం కేవలం ఒకే టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:సుజుకి హయబుసాగా మారిన బజాజ్ పల్సర్

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్తగా విడుదలైన ఈ మూడు వేరియంట్లలో ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కాస్మోటిక్ అప్‌డేట్‌లతో పాటు అనేక కొత్త ఫీచర్లు మరియు పరికరాలను కూడా జోడించారు. కొత్త హ్యుందాయ్ వెన్యూ స్పోర్ట్ ట్రిమ్ ఇప్పుడు సరికొత్త డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ (టైటాన్ గ్రే / ఫాంటమ్ బ్లాక్)తో లభిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇందులో డార్క్ గ్రే కలర్ ఫ్రంట్ బంపర్ గార్నిష్, రూఫ్ ట్రాక్స్, ‘స్పోర్ట్' యాంబ్లం, ఎరుపు రంగు ఇన్సర్ట్‌లతో గ్లోసీ-బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్లు మరియు వీల్ ఆర్చెస్‌పై ఎరుపు రంగు ఇన్సర్ట్‌లు వంటి ఎక్స్‌టీరియర్ మార్పులు ఉన్నాయి.

MOST READ:లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఇంటీరియర్ మార్పులను గమనిస్తే, కొత్త హ్యుందాయ్ వెన్యూ స్పోర్ట్ ట్రిమ్‌లో మెటల్ పెడల్స్, ఎరుపు రంగు స్టిచింగ్‌తో కూడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఎక్స్‌టీరియర్ మాదిరిగానే అనేక ప్రాంతాల్లో గ్రే అండ్ రెడ్ కలర్ గార్నిష్‌ను ఇంటీరియర్‌లో కూడా చూడొచ్చు. వెన్యూ 7 డిసిటి ఎస్ఎక్స్+ ట్రిమ్, ఇప్పుడు పాడిల్-షిఫ్టర్లను కూడా కలిగి ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హ్యుందాయ్ వెన్యూ భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్-ఎస్‌యూవీలలో ఒకటి, ఈ మోడల్ మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. హ్యుందాయ్ తాజాగా ఇందులో కొత్త ఐఎమ్‌టి మరియు కొత్త స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్లను ప్రవేశపెట్టి ఈ మోడల్ రేంజ్‌ను మరింత విస్తరించింది. ఇది ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యువి300, టాటా నెక్సాన్ మరియు త్వరలో విడుదల కానున్న కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Hyundai India has officially launched the iMT (Intelligent Manual Transmission) on their compact-SUV, the Venue in the country. Alongside this, the Hyundai Venue now also comes with a brand new 'Sport Trim' as well. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X