హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి కమర్షియల్ చూశారా? ఇందులో గేర్‌బాక్సే హైలైట్!

హ్యుందాయ్ మోటార్ ఇండియా గడచిన నెలలో వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఓ సరికొత్త ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కూడిన వేరియంట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. తాజాగా ఈ కొత్త వేరియంట్‌లోని ఫీచర్లను హైలైట్ చేస్తూ కంపెనీ టెలివిజన్ కమర్షియల్‌ను కూడా విడుదల చేసింది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి కమర్షియల్ చూశారా? ఇందులో గేర్‌బాక్సే హైలైట్!

హ్యుందాయ్ విడుదల చేసిన వెన్యూ ఐఎమ్‌టి టెలివిజన్ కమర్షియల్‌లో కంపెనీ ఇందులోని బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీని, క్లచ్ రహిత ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఐఎమ్‌టి) టెక్నాలజీని మరియు ఈ బుజ్జి ఎస్‌యూవీ ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కూడా హైలైట్ చేసింది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి కమర్షియల్ చూశారా? ఇందులో గేర్‌బాక్సే హైలైట్!

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి స్పోర్ట్స్ వేరియంట్‌ను కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ సాయంతో లాక్/అన్‌లాక్ చేయవచ్చు. డ్యాష్‌బోర్డ్‌లో అమర్చిన బ్లూటూత్ ఎనేబల్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ద్వారా ఇది సాధ్యమవుతుంది.

MOST READ: గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31 వరకూ వాహన డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు

అలాగే, ఇందులో రెండు పెడల్స్ (బ్రేక్, యాక్సిలరేటర్) మాత్రమే ఉంటాయి, క్లచ్ పెడల్ ఉండదు. గేరు మార్చాలనుకున్న ప్రతిసారి ఇందులోని క్లచ్ ఆటోమేటిక్‌గా దానంతటత అదే యాంత్రికంగా ఆపరేట్ అవుతూ ఉంటుంది. సిటీ రోడ్లపై తక్కువ వేగంతో నడిపేటప్పుడు తరచూ గేర్ మార్చేటప్పుడు క్లచ్‌ను మ్యాన్యువల్‌గా నొక్కాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి కమర్షియల్ చూశారా? ఇందులో గేర్‌బాక్సే హైలైట్!

ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఐఎమ్‌టి)తో హ్యుందాయ్ విడుదల చేసిన వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ ప్రారంభ వేరియంట్ ధర రూ.9.99 లక్షలుగా ఉంది (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ఎస్‌యూవీ 1.0-లీటర్ టి-జిడిఐ పెట్రోల్ ఇంజన్‌తో ప్రత్యేకంగా లభిస్తుంది.

MOST READ: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయాలంటే పియూసి తప్పనిసరి: సుప్రీం కోర్ట్

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి కమర్షియల్ చూశారా? ఇందులో గేర్‌బాక్సే హైలైట్!

హ్యుందాయ్ వెన్యూ కారులోని ఐఎమ్‌టి గేర్‌బాక్స్ 2-పెడల్ ట్రాన్స్‌మిషన్ సౌలభ్యంతో మాన్యువల్ ట్రాన్స్మిషన్ పనితీరును అందిస్తుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి క్లచ్-పెడల్ లేని మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇందులోని సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌లో ఎలక్ట్రో-మెకానికల్ యాక్చుయేటెడ్ క్లచ్ ఉంటుంది, ఇది ఇ్బబందులు లేని గేర్‌షిఫ్ట్‌లను అందిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి కమర్షియల్ చూశారా? ఇందులో గేర్‌బాక్సే హైలైట్!

ఈ కొత్త ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ హ్యుందాయ్ అందిస్తున్న శక్తివంతమైన 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇటీవలే అప్‌గ్రేడ్ చేసిన ఈ బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని మరియు 170 ఎన్ఎమ్‌ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కొత్త గేర్‌బాక్స్‌తో పాటుగా, హ్యుందాయ్ వెన్యూ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో (ఐఎమ్‌టి మరియు 7-స్పీడ్ డిసిటి) లభ్యం కానుంది.

MOST READ: సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి ప్రవేశించిన ఎమ్‌జి మోటార్స్

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి కమర్షియల్ చూశారా? ఇందులో గేర్‌బాక్సే హైలైట్!

హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో లభిస్తున్న పాపులర్ మోడళ్లలో హ్యుందాయ్ వెన్యూ కూడా ఒకటి. ఇప్పుడు తాజాగా కొత్త ఐఎమ్‌టి గేర్‌బాక్స్ టెక్నాలజీతో వచ్చిన హ్యుందాయ్ వెన్యూ కొద్దిరోజుల్లోనే మంచి ప్రాచుర్యాన్ని పొందింది. ఇది ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యువి300, టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Hyundai India has officially launched the Venue iMT (Intelligent Manual Transmission) last month. Company now released a TVC, which hilights the all-new iMT transmission feature. Take a look. Read in Telugu.
Story first published: Tuesday, August 25, 2020, 18:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X