Just In
- 28 min ago
ధర భారీగా పెరిగిన ఏ మాత్రం తగ్గని క్రేజ్.. ఇప్పటికే 50,000లకి పైగా బుకింగ్స్!
- 1 hr ago
టూవీలర్స్ కోసం గ్రీన్ వెహికల్ రేటింగ్; పర్యావరణానికి మీ టూవీలర్ ఎంత సేఫ్?
- 1 hr ago
చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!
- 2 hrs ago
మినీ కూపర్ కొనుగోలుచేసిన బిగ్ బాస్ 6 కన్నడ టైటిల్ విన్నర్: వివరాలు
Don't Miss
- Movies
Vakeelsaab 10 days collections:సెకండ్ వీకెండ్లో ఊహించని కలెక్షన్స్..వాళ్లకు ప్రత్యేక షోలు..ఇంకా ఎంత రావాలంటే?
- Sports
'తొలి టెస్టు అనంతరం జట్టులో చోటు దక్కక పోవడం బాధించింది.. నా టెక్నిక్ గురించి కలత చెందా'
- News
కరోనా ఎఫెక్ట్ ... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన వాయిదా
- Lifestyle
ఇలా చేస్తే బలహీనమైన జుట్టు సహజంగా బలపడుతుంది..కొత్త జుట్టు వస్తుంది..
- Finance
పెద్ద బ్యాంకుల కంటే బెట్టర్! సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ రేట్లు ఇలా
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హ్యుందాయ్ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్స్; రూ.1 లక్ష వరకూ తగ్గింపు!
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ డిసెంబర్ 2020 నెలలో భాగంగా, ఎంపిక చేసిన మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. భారత మార్కెట్లో హ్యుందాయ్ విక్రయిస్తున్న శాంత్రో, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్, ఔరా మరియు ఎలంట్రా మోడళ్లపై నగదు తగ్గింపులు మరియు వివిధ రకాల ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

హ్యుందాయ్ అందిస్తున్న ఈ ఇయర్ ఎండ్ ఆఫర్లలో కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి కస్టమర్లు గరిష్టంగా రూ.1 లక్ష వరకు విలువై ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లు డిసెంబర్ 1 మరియు డిసెంబర్ 31, 2020 వరకూ చెల్లుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా లభిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

హ్యుందాయ్ శాంత్రో
కంపెనీ నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్‌తో హ్యుందాయ్ శాంత్రోపై డిసెంబర్ 2020 నెలలో కంపెనీ గరిష్టంగా రూ.50,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.30,000 వరకు నగదు తగ్గింపుతో పాటు రూ.15,000 వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ: మరోసారి పెరిగిన కెటిఎమ్, హస్క్వార్నా మోటార్‌సైకిల్ ధరలు

ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ శాంత్రో పెట్రోల్ మరియు పెట్రోల్-సిఎన్‌జి ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.4.63 లక్షల నుంచి రూ.6.31 లక్షల మధ్యలో ఉన్నాయి అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ.

గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారుపై దీపావళి సీజన్‌లో ఆఫర్ చేసినట్లుగానే, కంపెనీ ఈ మోడల్‌పై గరిష్టంగా రూ.60,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.40,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పోరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ: ఈ జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ ధర కేవలం 50 డాలర్లు మాత్రమే!

హ్యుందాయ్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో గ్రాండ్ 10 పాత తరం మోడల్. ఇందులో కంపెనీ కొత్త తరం అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌ను కూడా విక్రయిస్తోంది. ప్రస్తుతం గ్రాండ్ ఐ10 కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో కేవలం రెండు వేరియంట్లు (మాగ్నా మరియు స్పోర్ట్జ్) మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

గ్రాండ్ ఐ10 నియోస్
గ్రాండ్ ఐ10కి సక్సెసర్‌గా వచ్చిన కొత్త తరం హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌పై కూడా కంపెనీ గరిష్టంగా రూ.60,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.40,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ: 27 నగరాల్లో ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల

మూడవ తరానికి చెందిన ఈ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ బహుళ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.2-లీటర్ డీజిల్ ఇంజన్, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజ్ మరియు ఫ్యాక్టరీతో ఫిట్టెడ్ సిఎన్‌జి యూనిట్‌లు ఉన్నాయి. గ్రాండ్ ఐ 10 నియోస్‌లో శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది.

హ్యుందాయ్ ఔరా
గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఇదివరకటి హ్యుందాయ్ ఎక్సెంట్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన కొత్త కాంపాక్ట్-సెడాన్ ఈ హ్యుందాయ్ ఔరా. డిసెంబర్ 2020 నెలలో హ్యుందాయ్ ఔరాను కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.70,000 వరకూ విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో వేరియంట్‌ను బట్టి రూ.50,000 వరకు నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్‌లు కలిసి ఉన్నాయి.
MOST READ: భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

హ్యుందాయ్ ఎలంట్రా
హ్యుందాయ్ నుండి లభిస్తున్న ప్రీమియ సెడాన్ ఎలంట్రాపై కంపెనీ ఈ డిసెంబర్ నెల ఆఫర్లలో భాగంగా లక్ష రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో వేరియంట్‌ను బట్టి రూ.70,000 వరకు నగదు తగ్గింపు, రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి. మార్కెట్లో హ్యుందాయ్ ఎలంట్రా ధరలు రూ.17.6 లక్షల నుంచి (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) ప్రారంభం అవుతాయి.

హ్యుందాయ్ ఇయర్ ఎండ్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత కార్ మార్కెట్లో ఇతర కంపెనీల మాదిరిగానే హ్యుందాయ్ కూడా ఇయర్ ఎండ్ ఆఫర్లను ప్రకటించింది. హ్యుందాయ్ అందిస్తున్న ఈ ఆఫర్లు గడచిన దీపావళి సీజన్‌లో ప్రకటించిన ఆఫర్ల కంటే మెరుగ్గా ఉన్నాయి. మంచి డీల్‌లో పైన పేర్కొన్న హ్యుందాయ్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు.