Just In
- 9 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 21 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 21 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 24 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Movies
Rang De Total Collections: నితిన్‌కు రెండో షాక్.. 24.50 కోట్ల టార్గెట్.. చివరకు వచ్చింది ఎంతంటే!
- Sports
మంచి గిఫ్ట్‌తో బెన్‌స్టోక్స్‌కు రాజస్థాన్ రాయల్స్ వీడ్కోలు..!
- News
కరోనా టీకానే వివేక్‌ను బలి తీసుకుంది.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలు
- Finance
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ ఛార్జీలపై ఎస్బీఐ వడ్డీ రేటు, ఫ్రీ ట్రాన్సాక్షన్స్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020లో అన్నీ కష్టాలు, నష్టాలే.. మరి 2021లో అవి తొలగిపోయేనా..?
మరికొన్ని గంటల్లో 2020 సంవత్సరం ముగియబోతోంది. ఈ సంవత్సరం చాలా మందికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. కరోనా మహమ్మారి ధాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, వ్యాపారాలు దెబ్బతిన్నాయ్, పరిశ్రమలు మూతపడ్డాయ్, ఉద్యోగస్తులు రోడ్డున పడ్డారు. ఇలా ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు!

ఈ 2020 సంవత్సరంలో భారత ఆటోమోటివ్ పరిశ్రమ కూడా అనేక సవాళ్లను ఎదుర్కుంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభమైన ఆటో ఎక్స్‌పోతో ఎన్నో ఆశలు మరియు ఆశయాలతో ఆటోమొబైల్ రంగం కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. అయితే, ఆ వెంటనే కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందటం, లాక్‌డౌన్ విధించడం వలన తీవ్ర నష్టాలను ఎదుర్కొంది.

లాక్‌డౌన్ నేపథ్యంలో, దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ఏప్రిల్ 2020 నెలలో 0 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అప్పటి నుండి 2020 ద్వితీయార్థం వరకూ ఆటోమొబైల్ కంపెనీలు నష్టాల బాటను పట్టాయి. గత 2020 సంవత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమలోని హైలైట్స్ ఇలా ఉన్నాయి:
MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

ఆటో ఎక్స్‌పో 2020 - అంగరంగ వైభవంగా ప్రారంభం
ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోతో 2020 సంవత్సరంలో ఆటో పరిశ్రమ ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆటో ఎక్స్‌పోలో అనేక కొత్త బ్రాండ్‌లు తమ సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శించాయి. వీటిలో చాలా వరకూ మోడళ్లు ఈ ఏడాదే విడుదల కావల్సి ఉన్నప్పటికీ, మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి.

మారుతి సుజుకి, హోండా, బిఎమ్‌డబ్ల్యూ, టొయోటా వంటి ప్రముఖ దేశీయ మరియు విదేశీయ బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను మరియు కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శించాయి. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా అనేక కొత్త మోడళ్లను కంపెనీలు ప్రదర్శించాయి. అయితే, వీటిలో ఏవీ మార్కెట్‌ను చేరుకోలేకపోయాయి.
MOST READ:పెట్రోల్ బంక్‌లోనే బ్యాటరీ ఎక్స్చేంజ్ సెంటర్స్ ప్రారంభించనున్న హెచ్‌పి ; వివరాలు

బిఎస్6 ఉద్గార నిబంధనలకు మారడం
దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కాలుష్య నిబంధనలను కఠినతరం చేసింది. ఫలితంగా, ఏప్రిల్ 1వ తేదీ నుండి బిఎస్6 కాలుష్య నిబంధనలు అమల్లోకి వచ్చాయి. భారతదేశంలోని అన్ని వాహన తయారీదారులు తమ మొత్తం పోర్ట్‌ఫోలియోను తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయటం మొదలుపెట్టారు.

మూలిగే నక్క మీద తాటి పండు పడిందన్న చందంగా, బిఎస్6 అప్‌డేట్ కారణంగా, కొత్త మోడళ్ల ధరలన్నీ అనూహ్యంగా పెరిగిపోయాయి. కొన్ని కంపెనీలైతే తమ ఉత్పత్తులను మార్కెట్ నుండి తొలగించివేశాయి. డీజిల్ ఇంజన్లతో నడిచే వాహనాలు అటకెక్కాయి. మారుతి సుజుకి, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, రెనో, నిస్సాన్ వంటి కంపెనీలు డీజిల్ కార్ల తయారీని నిలిపివేశాయి.
MOST READ:మీ ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలా? అయితే ఇలా చేయండి!

కోవిడ్-19 లాక్‌డౌన్ - ఫైటింగ్ స్పిరిట్
గడచిన మార్చి 2020 మధ్య నుండి మొదలుకొని మే 2020 వరకు దేశంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను చూసింది. ఈ సమయంలో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే, ఈ సమయంలో కోవిడ్‌తో ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తమవంతు సాయం అందించేందుకు ఆటో పరిశ్రమ కదలి వచ్చింది.

మహమ్మారిపై పోరులో భాగంగా తమ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఆటోమొబైల్ కంపెనీలు భారీ మొత్తాలలో విరాళాలను అందించారు. కొన్ని వాహన తయారీదారులు పిపిఇ కిట్లు, ఫేస్ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్స్ మరియు వెంటిలేటర్లు వంటి పరికరాల అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ విపత్కర కాలంలో ఆటోమొబైల్ పరిశ్రమలు చేసిన సాయం నిజంగా ప్రశంశనీయం.
MOST READ:వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

ఏప్రిల్‌లో సున్నా అమ్మకాలు
మార్చ్ 2020 నెలాఖరు సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆటో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఏప్రిల్ 2020 నెలలో సున్నా అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సమయంలో వాహనాల తయారీ, సర్వీస్, రీపేర్స్ వంటి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈనెల నుండే కంపెనీలు నష్టాల బాట పట్టడం ప్రారంభించాయి.

పండుగ సీజన్ రికవరీ - పరిశ్రమకు పునరుజ్జీవం
అయితే, ఈ ఏడాది ద్వితీయార్ధంలో లాక్‌డౌన్ మినహాయింపుల నేపథ్యంలో, ఆటోమొబైల్ కంపెనీలు తిరిగి లాక్‌డౌన్ ముందు నాటి పరిస్థితులను చేరుకునేందుకు ఎంతగానో కృషి చేశాయి. మరోవైపు కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, ప్రజలు కూడా వ్యక్తిగత రవాణా వైపు ఆసక్తి చూపడంతో దేశంలో వాహనాల విక్రయం జోరందుకుంది.

కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు కూడా ప్రోత్సాహకర ఆఫర్లను ప్రకటించాయి. పండుగ సీజన్ సెంటిమెంట్ జోరందుకోవటంతో మార్కెట్లో వాహనాల అమ్మకాలు కూడా పెరిగాయి. కొత్త మోడళ్లు రావటం మొదలు పెట్టాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వాహనాలను అందించేందుకు కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాలను కూడా పూర్తిస్థాయికి పెంచాయి.

గత 2020 సంవత్సరంలో అనేక ఒడిదుడుకులను చూసిన భారత ఆటోమొబైల్ పరిశ్రమ, ఇప్పుడిప్పుడే తిరిగి యధాస్థాయికి చేరుకుంటోంది. అయితే, కోవిడ్-19 ఇంకా వ్యాక్సీన్ అందుబాటులోకి రాకపోవటం, మరోవైపు సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో, 2021లో భారత ఆటోమొబైల్ పరిశ్రమకు ఎలా ఉండబోతోందనే అంశంపై ఆసక్తి నెలకొని ఉంది.