ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో ఫోర్ వీలర్లు అత్యంత కీలకమైనవి మరియు ప్రధానమైనవి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 100 మిలియన్లకు పైగా కార్లు తయారవుతాయని అంచనా. ఇటీవల ఓ యూకే ఆధారిత పరిశోధనా సంస్థ, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కార్లను తయారు చేసే దేశాలు మరియు కంపెనీల వివరాలను వెల్లడి చేసింది.

ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

ఈ డేటా ప్రకారం, ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ భారతదేశం కాగా, మొదటి స్థానంలో పొరుగు దేశమైన చైనా ఉంది. చైనాలో ప్రతి నిమిషానికి సగటున 48.9 వాహనాలు ఉత్పత్తి అవుతాయని ఆ నివేదిక వెల్లడిస్తోంది. ఇది భారతదేశంతో పోల్చుకుంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.

ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

చైనాలో ప్రతి ఏటా 25.7 మిలియన్ వాహనాలు ఉత్పత్తి అవుతాయి. అంటే, సగటున ప్రతి నిమిషానికి 48.9 వాహనాలు ఉత్పత్తి అవుతాయి. ఎస్ఏసి మరియు డాంగ్ఫెంగ్ వంటి పెద్ద కంపెనీల ప్రధాన కార్యాలయాలు చైనాలో ఉన్నాయి. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద వాహన ఉత్పత్తిదారుగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో యుఎస్ఏ, జపాన్, జర్మనీ మరియు భారతదేశాలు ఉన్నాయి.

MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

ఈ టాప్ 5 దేశాల్లో సగటున ప్రతి నిమిషానికి ఉత్పత్తి అయ్యే సగటు కార్ల సంఖ్య ఇలా ఉంది:

1. చైనా - నిమిషానికి 48.9 వాహనాలు

2. యుఎస్ఏ - నిమిషానికి 20.7 వాహనాలు

3. జపాన్ - నిమిషానికి 18.4 వాహనాలు

4. జర్మనీ - నిమిషానికి 8.9 వాహనాలు

5. భారతదేశం - నిమిషానికి 8.6 వాహనాలు

ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కంపెనీకి సగటున నిమిషానికి అత్యధికంగా 18.9 వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తిలోని టాప్ 20 కార్ల తయారీదారుల జాబితాలో టొయోటా మొదటి స్థానంలో ఉంది. ఈ కంపెనీ ఒక్కటే సంవత్సరానికి 1.04 కోట్ల వాహనాలను తయారు చేస్తుంది, వీటిలో టొయోటా మరియు లెక్సస్ రెండు బ్రాండ్‌ల వాహనాలు ఉన్నాయి.

MOST READ:పట్టాలెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ ట్రైన్స్ ; ఎప్పుడో తెలుసా ?

ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

సగటున ప్రతి నిమిషానికి వాహనాలను ఉత్పత్తి చేసే టాప్ 5 బ్రాండ్ల వివరాలు ఇలా ఉన్నాయి:

1. టొయోటా - నిమిషానికి 19.9 వాహనాలు

2. ఫోక్స్‌వ్యాగన్ - నిమిషానికి 19.8 వాహనాలు

3. హ్యుందాయ్ - నిమిషానికి 13.7 వాహనాలు

4. జనరల్ మోటార్స్ - నిమిషానికి 13 వాహనాలు

5. ఫోర్డ్ - నిమిషానికి 12.2 వాహనాలు

ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

టొయోటా మరియు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు సగటున ప్రతి నిమిషానికి చేసే ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలంటే యూకెకు 12 సంవత్సరాలు మరియు యుఎస్‌కు 9 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ రెండు బ్రాండ్లు ప్రపంచంలోని అతిపెద్ద ఆటో గ్రూపులలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి.

MOST READ:వరల్డ్ రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతున్న శ్రీ సిద్ధరూధ స్వామీజీ రైల్వే స్టేషన్ ; వివరాలు

ఆ విషయంలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది..

భారతదేశం విషయానికి వస్తే, మనదేశంలో ఇప్పటికీ మారుతి సుజుకి ఇండియానే దేశంలో కెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా కొనసాగుతోంది. కేవలం ఉత్పత్తి పరంగానే కాకుండా అమ్మకాల పరంగా కూడా ఈ బ్రాండ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. భారత మార్కెట్లో మారుతి సుజుకి కంపెనీ వాటా 49 శాతంగా ఉంది. దాని తరువాతి స్థానాల్లో హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా మరియు కియా మోటార్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.

Most Read Articles

English summary
India becomes fifth largest car producer in the world. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X