మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు ఇటీవలి కాలంలో చాలా అడ్వాన్స్ అయిన సంగతి తెలిసినదే. ఒకప్పుడు టోల్ ప్లాజాలు దాటాలంటే, అక్కడే గంటల కొద్దీ సమయం వృధా అయ్యేది. ఆ తర్వాతి కాలంలో వచ్చిన ఈటిసి మరియు ఫాస్ట్ ట్యాగ్ వంటి సేవల కారణంగా, కేవలం నిమిషాల్లోనే వాహనాలు టోల్ గేట్లను దాటేస్తున్న సంగతి తెలిసినదే.

మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

కాగా, ఇప్పుడు భవిష్యత్తులో అసలు టోల్ బూత్‌లనేవే లేకుండా చేస్తామని, టోల్ చార్జీల కోసం జిపిఎస్ ఆధారిత టెక్నాలజీని ఉపయోగిస్తామని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

దేశవ్యాప్తంగా వాహనాలకు ఇబ్బంది లేని విధంగా, జిపిఎస్ ఆధారిత టెక్నాలజీ టోల్ సేకరణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని గడ్కరీ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ తరహా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

MOST READ:అప్డేటెడ్ ఫీచర్లతో లాంచ్ అయిన కొత్త బజాజ్ ప్లాటినా 100 కిక్ స్టార్ట్ ; ధర & వివరాలు

మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీ రాబోయే రెండేళ్లలో భారతదేశాన్ని ‘టోల్ బూత్ ఫ్రీ'గా చేస్తుందని గురువారం నాడు అస్సోచం ఫౌండేషన్ వీక్ ప్రోగ్రాంలో ప్రసంగించిన సందర్భంగా గడ్కరీ తెలిపారు.

మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

ఈ టెక్నాలజీ సాయంతో వాహనాల కదలికల ఆధారంగా టోల్ మొత్తాన్ని లెక్కించి, సదరు మొత్తాన్ని నేరుగా యూజర్ బ్యాంకు ఖాతా నుండి తీసివేస్తామని ఆయన వివరించారు.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న అన్ని వాణిజ్య వాహనాలు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌లతో వస్తున్నప్పటికీ, పాత వాహనాల్లో జిపిఎస్ టెక్నాలజీని వ్యవస్థాపించడానికి ప్రభుత్వం ఓ కొత్త ప్రణాళికను రూపొందిస్తుందని ఆయన అన్నారు.

MOST READ:ఆడి క్యూ 2 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది..చూసారా !

మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

వచ్చే ఏడాది మార్చ్ నాటికి భారతదేశంలో టోల్ వసూళ్ల మొత్తం రూ.34,000 కోట్లకు చేరుకుంటుందని నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. టోల్ వసూలు కోసం జిపిఎస్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వచ్చే ఐదేళ్లలో టోల్ ఆదాయం రూ.1,34,000 కోట్లకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు.

మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

భారతదేశంలో ఉపాధి కల్పన మరియు పేదరిక నిర్మూలనకు పారిశ్రామిక అభివృద్ధి ఎంతో ముఖ్యమని గడ్కరీ అన్నారు. అయితే ప్రస్తుతం, పరిశ్రమలు భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉండటం వలన, వృద్ధి రేట్లను పెంచడానికి పరిశ్రమల వికేంద్రీకరణ అత్యవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు.

MOST READ:హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ పొందాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

దేశంలో పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలోనూ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు.

మరో రెండేళ్లలో దేశంలో టోల్ బూత్‌లనేవే ఉండవు: నితిన్ గడ్కరీ

ఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది జనవరి నుండి దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు టోల్ చెల్లించే ప్రతి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

MOST READ:ఈ రూల్స్ సాధరణ వాహనాలకు మాత్రమే కాదు పోలీస్ వాహనాలకు కూడా వర్తిస్తాయి.. ఆ రూల్స్ ఏవో మీరూ చూడండి

Most Read Articles

English summary
India Will Become Toll-booth Free In Next Two Years, Says Nitin Gadkari. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X