Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి మానవరహిత సాయుధ వాహనం
భారతదేశం నేడు సురక్షితంగా ఉందంటే దానికి ప్రధాన కారం ఇండియన్ ఆర్మీ. భారతదేశ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని శత్రువుల భారీ నుంచి కాపాడుతున్నారు. అప్పుడప్పుడు చిన్న చిన్న యుద్దాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ యుద్ధాల్లో చాల మంది సైనికులు వీర మరణం పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ యుద్ధ సమయంలో ఎక్కువమంది సైనికులు చనిపోకుండా ఉండటానికి రక్షణ రంగంలో ఒక కొత్త వాహనాన్ని విడుదల చేశారు.

యుద్ధాలలో పాల్గొని మానవరహితంగా యుద్ధం చేయగల వాహననాలను డిఫన్స్ ఆటో ఎక్స్‌పోలో డిఫన్స్ వారు ప్రదర్శించారు. ఈ వినూత్న వాహనం యుద్ధ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) ప్రోగ్రామ్ డైరెక్టర్ కల్నల్ అరవింద్ కుమార్ వారి ఆవిష్కరణను ప్రదర్శించారు.

సాధారణంగా సైనికులకు బదులుగా యంత్రాలు పోరాడుతుంటే ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుందని ఇటువంటి వాహనాలను తయారు చేయాలని దాదాపు ఒకటిన్నర సంవత్సరం ఈ కాన్సెప్ట్‌పై పనిచేసిన తరువాత, చెన్నైకి చెందిన డెన్నిస్ ఎబెనెజార్ తన యుద్ధ యంత్రాన్ని తయారు చేశారు.

భారతదేశంలో మొట్ట మొదటి మానవరహిత సాయుధ వాహనం ఈ సూరన్. ఇది యుద్ధ భూమిలో మానవ రహితంగా పోరాడగలదు. యుద్దభూమిలో ప్రాణనష్టం తగ్గించదానికి ఈ యంత్రం ఒక వరం అని స్టార్ట్-అప్ డిఫెన్స్ మాస్టర్ ఎండి 'ఎబెనెజార్' అన్నారు.

డిఫెన్స్ ఎక్స్‌పోలో సూరన్ చాలా ఆకర్షణీయంగా నిలిచింది. ఈ మానవరహిత సాయఉదా వాహనాన్ని మొబైల్ ఫోన్ ద్వారా లేదా కంట్రోల్ రూమ్ నుండి ఆపరేట్ చేయవచ్చు. దీని బరువు 500 కిలోల వరకు ఉంటుంది. ఇది మౌంటెడ్ గన్ టరెట్ కలిగి ఉంది. అంతే కాకుండా ఇది రిమోట్ కంట్రోల్ కంట్రోల్‌తో పనిచేయగలదు అని ఎబెనెజార్ ఈ యుద్ధ యంత్రం యొక్క ప్రత్యేకతలను చెప్పారు.

ఇది ఎటువంటి భాభాగంలో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉన్న కృత్రిమ మేధస్సుతో కూడి ఉందని ఆయన అన్నారు. ఈ యంత్రాన్ని మూడు రీతుల్లో ఆపరేట్ చేయవచ్చు అని తెలిపారు. రిమోట్‌తో టెలి-ఆపరేటెడ్, మొబైల్ కంట్రోల్ స్టేషన్ నుండి టెలి-ఆపరేటెడ్ మరియు అటానమస్ మోడ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు.

ఈ సాయుధ యంత్రంలో లాంగ్-రేంజ్ కెమెరాలు, హై-ఎండ్ ప్రాసెసర్లు, కంట్రోలర్లు, సెన్సార్లు, పవర్ బ్యాకప్ మొదలైనవి కూడా ఉన్నాయి. వీడియో గేమ్‌ల మాదిరిగానే అందంగా రూపొందించిన టెలి-ఆపరేషన్ నియంత్రణల ద్వారా గన్నర్లు ‘సూరన్'ను నియంత్రించవచ్చని అధికారులు తెలిపారు.

హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిఆర్‌డిఓ తదితరులు సహా పలువురు వాటాదారులు యుద్ధ యంత్రంపై ఆసక్తి చూపారని ఎబెనెజార్ తెలిపారు. ఆర్మీ చీఫ్ సందర్శించి సూరన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నారని ఆయన చెప్పారు.

యుద్ధ భూమిలో ఈ వాహనాలను ఉపయోగించడం ద్వారా సైనికుల మరణాల రేటు తగ్గించవచ్చు. అంటే కాకుండా ఇది అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వాళ్ళ దీనిని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేసే అవకాశం కూడా ఉందన్నారు.