జేమ్స్ బాండ్ సినిమాలో డ్రైవ్ చేయబోయే కారు ఇదే

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జేమ్స్ బాండ్ గురించి అందరికి తెలుసు, ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. జేమ్స్ బాండ్ యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్సులకి, గన్ షాట్స్ కి, కార్ చేసింగ్ కి మాత్రమే కాకుండా గొప్ప విలన్ గా కూడా ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు జేమ్స్ బాండ్ యొక్క రాబోయే సినిమా లో ఒక కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కారుని ఉపయోగించనున్నారు. జేమ్స్ బాండ్ ఉపయోగించనున్న ఈ సూపర్ కార్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందా!

జేమ్స్ బాండ్ సినిమాలో డ్రైవ్ చేయబోయే కారు ఇదే

జేమ్స్ బాండ్ మూవీస్ లో కార్ చేసింగ్స్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. యితడు మునుపటి సినిమాలో కూడా డిబి 5 మరియు డిబిఎస్ వంటి అనేక కార్లను ఉపయోగించారు. ఇప్పుడు కొత్తగా రాబోయే జేమ్స్ బాండ్ సినిమా "నో టైమ్ టు డై" లో కొత్త ఆస్టన్ మార్టిన్ ప్రదర్శించబడుతుంది. ఈ కొత్త కారుని ఆస్టన్ మార్టిన్ వల్హల్లా అని పిలుస్తారు.

జేమ్స్ బాండ్ ఉపయోగించనున్న ఈ కార్ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ తయారు చేసింది. జేమ్స్ బాండ్ తన మూవీలో ఉపయోగించే కారు ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడవచ్చు.

జేమ్స్ బాండ్ సినిమాలో డ్రైవ్ చేయబోయే కారు ఇదే

ఈ వీడియోను సూపర్ కార్ బ్లాన్డీ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోలో మనం చూసినట్లయితే కారు అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సూపర్ కార్ చాలా అప్డేటెడ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. వల్హల్లా మిడ్-ఇంజిన్ స్పోర్ట్స్ కారు ట్రాక్ బేస్డ్ స్పోర్ట్స్ కార్ ఆస్టన్ మార్టిన్ వాల్కైర్ ఆధారంగా రూపొందించబడింది.

జేమ్స్ బాండ్ సినిమాలో డ్రైవ్ చేయబోయే కారు ఇదే

ఇది ప్రజా రహదారులపై సులభంగా ఉపయోగించబడుతుంది. ఈ సూపర్ కారుని మూవీలో ఉపయోగించనున్నట్లు వీడియోలో మనకు తెలుస్తుంది. కానీ దీనిని జేమ్స్ బాండ్ ఉపయోగిస్తారా లేకుంటే సహాయ నటుడు ఉపయోగిస్తాడా అనే విషయం ఖచ్చితంగా తెలియదు.

జేమ్స్ బాండ్ సినిమాలో డ్రైవ్ చేయబోయే కారు ఇదే

ఈ వీడియోలో మనం సూపర్ కార్ ని గమనించినట్లయితే దీనికి ముందు వైపు వెనుకవైపు హెడ్ లైట్స్, సెంటర్ కన్సోల్ మరియు స్విచ్‌లు కారు బరువును తగ్గించడానికి 3 డి లో ముద్రించబడ్డాయి. ఇది మిడ్-ఇంజిన్ స్పోర్ట్స్ కార్ కాబట్టి ఇంజిన్ వెనుక భాగంలో ఉంచబడుతుంది. ఆస్టన్ మార్టిన్ ఇంజిన్ కంపార్ట్మెంట్లోకి ఎక్కువ గాలిని ప్రసారం చేయడానికి పైకప్పు స్కూప్ ఇచ్చింది.

జేమ్స్ బాండ్ సినిమాలో డ్రైవ్ చేయబోయే కారు ఇదే

ఈ సూపర్ కారు యొక్క డోర్లు ఈగల్ రెక్కలలాగా విస్తృతంగా తెరిచి ఉంటాయి. మెరుగైన ఏరోడైనమిక్స్ కోసం ఈ స్పోర్ట్స్ కార్ ఓఆర్విఎమ్ లను ఇవ్వదు. దీనికి బదులుగా ఇందులో కెమెరా ఉంటుంది. ఇది డ్రైవింగ్ చేసే వ్యక్తికి ట్రాఫిక్ లో ఉన్నప్పుడు లేదా ముందు ఉన్న వాహనాలను వీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది స్పెస్ షిప్ లాంటి స్టీరింగ్ వీల్ ని కలిగి ఉంటుంది. ఈ కార్ యొక్క సీట్లు బాలిస్టిక్ నైలాన్ నుండి తయారు చేయబడ్డాయి. ఇది మిలటరీ గ్రేడ్ మెటీరియల్.

జేమ్స్ బాండ్ సినిమాలో డ్రైవ్ చేయబోయే కారు ఇదే

వల్హల్లా హైబ్రిడ్ సూపర్ కారు ట్విన్-టర్బో వి 6 ఇంజిన్ ద్వారా 1000 పిఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సూపర్ కార్ రాబోయే చిత్రంలో డిబి 5, డిబిఎస్ సూపర్ లెగెర్రా మరియు ఆస్టన్ మార్టిన్ వి 8 లతో పాటు కనిపిస్తుంది.

Image Courtesy: Supercar Blondie/YouTube

More from DriveSpark

Article Published On: Wednesday, February 12, 2020, 13:48 [IST]
English summary
This is the car that James Bond is going to drive in his next movie [Video]. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+