టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

అమెరికన్ పాపులర్ ఎస్‌యూవీ బ్రాండ్ జీప్ అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ కంపాస్‌లో కంపెనీ ఓ ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రాబోయే కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 7 సీటర్ వెర్షన్ కూడా ఉంటుందనే విషయాన్ని తాజాగా లీకైన స్పై చిత్రాలను చూస్తుంటే తెలుస్తోంది.

టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

ఎక్స్‌ప్రెస్ డ్రైవ్స్ విడుదల చేసిన స్పై చిత్రాల ప్రకారం, ఫియట్-క్రైస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పార్థ దత్తా భారత ఉపఖండం కోసం తమ బ్రాండ్ యొక్క భవిష్యత్ ప్రణాళికను వెల్లడించారు.

టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

వచ్చే రెండేళ్లలో ఓ సెవన్ సీటర్ ఎస్‌యూవీని దేశంలో విడుదల చేయాలని జీప్ యోచిస్తోంది. లో డి 3-రో అనే కోడ్‌నేమ్‌తో తయారు చేయనున్న ఈ ఎస్‌యూవీని 'గ్రాండ్ కంపాస్' అని పిలిచే అవకాశం ఉంది.

టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

ఈ కొత్త సెవన్ సీటర్ వాహనం, బ్రాండ్ నుంచి రాబోయే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆధారంగా ఉంటుందని సమాచారం. ఇది 2021 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో విడుదల కాచ్చని భావిస్తున్నట్లు డాక్టర్ దత్తా ధృవీకరించారు.

టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

మరోవైపు ప్రస్తుతం మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లు ఆధిపత్యం చలాయిస్తున్న, లాభదాయకమైన మరియు అత్యధిక పోటీ కలిగిన సబ్-4 మీటర్ విభాగంలోకి కూడా ప్రవేశించాలని జీప్ ప్రణాళికలను రచిస్తోంది.

టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

భారత మార్కెట్లో మరిన్ని ఐకానిక్ జీప్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు దత్తా ధృవీకరించారు. అయితే, ఏయే మోడళ్లు మరియు వేరియంట్లు లభిస్తాయనే విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు.

టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

దేశీయ విపణిలో జీప్ విడుదల చేయబోయే అన్ని వాహనాల ధరలను సాధ్యమైనంత పోటీగా ఉంచడానికి, జీప్ బ్రాండ్ తమ రంజాంగావ్ ప్లాంట్‌లో వీటిని తయారు చేసే అవకాశం ఉంది.

టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

భారతదేశంలో తమ ఉత్పత్తులను సరసమైన ధరకే అందించేందుకు వీలుగా, జీప్ బ్రాండ్ విడిభాగాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానికంగా వాటిని సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇలా చేయటం వలన కంపెనీ తమ ఉత్పాదక వ్యయాన్ని తగ్గించుకోవటంతో పాటుగా అత్యంత పోటీ ధరతో ఉత్పత్తులను అందించేందుకు సాద్యమవుతుంది.

టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

జీప్ ఇండియా ఇటీవలే తమ కంపాస్ బ్రాండ్ ఎస్‌యూవీలను బిఎస్6 కంపాటబల్ ఇంజన్‌లతో అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం జీప్ కంపాస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది.

టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

ఇక జీప్ బ్రాండ్‌కి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే దేశంలో విక్రయించిన తమ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ మోడళ్లను రీకాల్ చేసింది. ఇందులోని కొన్ని భద్రతాపరమైన సమస్యల కారణంగా ఇంజన్ స్టార్ట్ కాకపోవటం లేదా ఉన్నట్టుండి ఇంజన్ ఆగిపోవటం వంటి సమస్యలు తలెత్తే కారణం ఉన్నందున వీటిని రీకాల్ చేసింది.

మార్చి 2019 నుండి జనవరి 2020 మధ్య కాలంలో తయారైన జీప్ వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ మోడళ్లలో మొత్తం 53 యూనిట్లలో ఈ సమస్యను గుర్తించి, రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

టెస్టింగ్ దశలో జీప్ కంపాస్‌లో 7 సీటర్ వెర్షన్!

జీప్ కంపాస్ సెవన్ సీటర్ వెర్షన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌తో పాటుగా కంపెనీ ఇందులో సెవన్ సీటర్‌ను కూడా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేయటం మంచి విషయం. ప్రత్యేకించి భారత వంటి మార్కెట్లలో ఎక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన వాహనాలకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జీప్ ఇండియా సబ్-4 మీటర్ విభాగంలోకి ప్రవేశించాలని యోచించడం. అత్యంత పోటీతో కూడిన ఈ విభాగంలో జీప్ ఎలాంటి వాహనాన్ని అందిస్తుందో చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, July 20, 2020, 9:51 [IST]
English summary
Spy pics of the upcoming Jeep Compass facelift have been doing their rounds and have created quite a buzz in the market. The brand is expected to launch the vehicle at some point next year. Read in Telugu.
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+