విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫొటోలు లీక్; కొత్త గ్రీన్ కలర్ పెయింట్ స్కీమ్
అమెరికాకు చెందిన ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కంపాస్ ఎస్‌యూవీలో ఓ కొత్త 2021 మోడల్‌ను జనవరి 7వ తేదీన ఆవిష్కరించనున్న సంగతి తెలిసినదే. తాజాగా ఈ మోడల్‌కి సంబంధించిన చిత్రాలు విడుదలకు ముందే లీక్ అయ్యాయి. ఇందులో కొత్త గ్రీన్ కలర్‌లో పెయింట్ చేసిన జీప్ కంపాస్‌ను చూడొచ్చు.

మహారాష్ట్ర వీధులపై తిరుగుతున్న ఓ గ్రీన్ కలర్ 2021 జీప్ కంపాస్ ఎస్‌యూవీని షఫ్టింగ్‌గేర్స్ తమ కెమెరాలో బంధించింది. ఈ ఫొటోల్లో కొత్త జీప్ కంపాస్ ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్ పెయింట్ స్కీమ్ టాటా హారియర్ క్యామో ఎడిషన్‌లో కనిపించినట్లుగానే ఉంటుంది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2021 జీప్ కంపాస్ సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది.

కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్లలో చేసిన మార్పులలో, ఫ్రంట్ డిజైన్‌లో ఇరువైపులా ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన సన్నటి ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ మరియు ఎల్‌ఇడి టెయిల్ లైట్స్ ఉన్నాయి. కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్‌లోని ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లను కూడా రీడిజైన్ చేశారు.
MOST READ:గుడ్ న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ చూడండి

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటుగా బ్రాండ్ యొక్క కనెక్టింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసే పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై పెద్ద ఎమ్ఐడి, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన పెద్ద స్టీరింగ్ వీల్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు.

ఇంకా ఇందులో సన్నని ఏసి వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెథర్‌తో చుట్టబడిన స్టీరింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పానరోమిక్ సన్‌రూఫ్, చుట్టూరా బ్రష్డ్ అల్యూమినియం యాక్సెంట్స్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటి మార్పులు ఉన్నాయి.
MOST READ:వెహికల్‌పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!

ఇంజన్ పరంగా కొత్త జీప్ కంపాస్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఆఫర్ చేస్తున్న ఇంజన్ ఆప్షన్లనే కంపెనీ కొత్త 2021 కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలోను కొనసాగించనుంది మరియు వాటి పవర్ మరియు టార్క్ గణాంకాల్లో కూడా ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది.

ప్రస్తుతం జీప్ కంపాస్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 163 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, 2.0-లీటర్ డీజిల్ యూనిట్ కూడా 173 బిహెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి

ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కాకపోతే, పెట్రోల్ వేరియంట్లు మాత్రం ఆప్షనల్ సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. కాగా, డీజిల్ ఇంజన్ కోసం ఆప్షనల్ నైన్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా అందుబాటులో ఉంటుంది.

జీప్ ఇండియా తమ కంపాస్ ఎస్‌యూవీని 2017 నుండి భారత మార్కెట్లో విక్రయిస్తోంది. ఇది ఈ విభాగంలో స్కోడా నుండి రాబోయే విజన్ ఇన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ వంటి ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది. మార్కెట్ అంచనా ప్రకారం, కొత్త జీప్ కంపాస్ ధర రూ.17 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా.
MOST READ:మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; వివరాలు


Click it and Unblock the Notifications








