2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

అమెరికన్ కార్ బ్రాండ్ జీప్ ఎట్టకేలకు తమ సరికొత్త 2021 కంపాస్ ఫేస్‌లిఫ్ట్ (Jeep Compass Facelift) మోడల్‌ను ఆవిష్కరించింది. ముందుగా అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానున్న 2021 జీప్ కంపాస్ ఎస్‌యూవీలో డిజైన్, ఇంటీరియర్స్, ఫీచర్స్ పరంగా కంపెనీ ఈ మోడల్‌లో అనేక మార్పులు చేర్పులు చేసింది. అంతేకాదు, ఇంజన్లలో కూడా జీప్ మార్పులు చేసింది.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

ముందుగా డిజైన్ విషయానికి వస్తే.. కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో హుడ్ క్రింద్ భాగంలో జీప్ తమ సిగ్నేచర్ 7-స్లాట్ గ్రిల్‌ను క్యారీ చేస్తూనే క్రింది భాగంలో అదనంగా మరింత స్టయిలిష్‌గా ఉండే హనీకోంబ్ గ్రిల్‌ను మరియు ఈ రెండింటీకి మధ్యలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ వెంట్లను జోడించింది.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సరికొత్త హెడ్ ల్యాంప్స్ డిజైన్, స్టయిలిష్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, స్మోక్ ఫినిష్‌లో ఉండే రియర్ బ్రేక్ లైట్స్, ప్రకాశవంతమైన రిఫ్లెక్టర్లతో రీడిజైన్ చేసిన వెనుక బంపర్, రూఫ్‌ని అంటిపెట్టుకుని ఉండే రూఫ్ రెయిల్స్ వంటి మార్పులను మనం ఇందులో గమనించవచ్చు.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

ఇక కొత్త 2021 జీప్ కంపాస్ లోపలకి చూస్తే, ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఈ కొత్త మోడల్‌లోని ఓవరాల్ క్యాబిన్ మరింత ప్రీమియంగా అనిపిస్తుంది. ప్రత్యేకించి ఇందులోని సీట్లు మరియు డోర్ ట్రిమ్‌ల కోసం ఉపయోగించిన అప్‌హోలెస్ట్రీ మరింత ప్రీయం టచ్‌ని ఫీల్ అయ్యేలా చేస్తుంది.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

కొత్త జీప్ కంపాస్‌లో విశాలమైన ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఉంది. ఇందులో ఉపయోగించిన 8.4 ఇంచన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ జీప్ అందిస్తున్న యూకనెక్ట్ 5 (UConnect 5) టెక్నాలజీని సపోర్ట్ చేస్తూనే ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి మొబైల్ టెక్నాలజీలను కూడా సపోర్ట్ చేస్తుంది.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులు ఏంటంటే ఇంజన్స్. ఇదివరకు ఉపయోగిస్తున్న 1.4 లీటర్ ఇంజన్‌ను రీప్లేస్ చేస్తూ ఈ కొత్త వెర్షన్ జీప్ కంపాస్‌లో సరికొత్త 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ కూడా రెండు రకాల ట్యూనింగ్ ఆప్షన్లతో లభ్యం కానుంది. అందులో ఒకటి 128 బిహెచ్‌పిల శక్తిని, మరొకటి 148 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టార్క్ మాత్రం రెండూ ఒకేలా గరిష్టంగా 270 ఎన్ఎమ్‌లను ఉత్పత్తి చేస్తుంది.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

వీటిల్లో 128 బిహెచ్‌పిల పవర్‌ని జనరేట్ చేసే ఇంజన్ మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభ్యం కానుండగా 148 బిహెచ్‌పిల పవర్‌ని జనరేట్ చేసే ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌లో రానుంది.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

ఇకపోతే డీజిల్ వేరియంట్లకు అనుకూలంగా ఉండే భారత్ వంటి అంతర్జాతీయ మార్కెట్ల కోసం కంపెనీ ఇందులో ఓ డీజిల్ ఇంజన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని 1.6 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కాకపోతే భారత్‌లో మాత్రం ఈ తక్కువ కెపాసిటీ కలిగిన డీజిల్ ఇంజన్ అందుబాటులోకి రాకపోవచ్చని సమాచారం.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

ప్రస్తుతం జీప్ ఇండియా అందిస్తున్న 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఈ కొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే జీప్ ఇండియా తమ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను భారత కాలుష్య నిబంధనలకు అనుగుణంగా బిఎస్6 కు అప్‌గ్రేడ్ చేసిన విషయం మనకు తెలిసినదే. ఈ ఇంజన్ గరిష్టంగా 173 బిహెచ్‌పిల శక్తిని, 350 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

సరికొత్త 2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కాస్మోటిక్ ఛేంజెస్ పరంగా చూసుకుంటే, ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో మార్పులు స్వల్పంగానే ఉన్నాయి. కానీ మెకానికల్‌గా మాత్రం ఇంజన్ ఆప్షన్లలో కొత్త వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. టర్బో పెట్రోల్ ఇంజన్, మల్టీజెట్ డీజిల్ ఇంజన్లు పరిమాణంలో చిన్నవిగా ఉండి, పెర్ఫార్మెన్స్‌లో పెద్దవాటితో సమానంగా ఉంటాయి మరియు మంచి మైలేజీని ఇస్తాయి. జీప్ కంపాస్ ఈ సెగ్మెంట్లోని ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్, స్కొడా కరాక్, నిస్సాన్ కిక్స్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, June 5, 2020, 12:59 [IST]
English summary
Jeep has finally taken the wraps off the 2021 Compass facelift SUV in the international markets. The new (2021) Jeep Compass facelift features a number of updates, both in terms of cosmetic, as well as mechanical. Read in Telugu.
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+