కేరళలో ఇంటర్ డిస్ట్రిక్ట్ బస్ సర్వీసులకు మళ్ళీ బ్రేక్ : ఎందుకో తెలుసా ?

కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యొక్క లాంగ్ బస్ సర్వీస్ ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలన్న ముందస్తు నిర్ణయాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కేరళలో ఇంటర్ స్టేట్ బస్ సర్వీసులకు మళ్ళీ బ్రేక్ : ఎందుకో తెలుసా ?

భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో భాగంగా నాలుగు నెలల పాటు దాదాపు అన్ని కార్యకలాపాలు నిలిపివేయబడిన తరువాత ఆగస్టు 1 నుండి 206 లాంగ్ జర్నీ చేసే బస్సులు నడవనున్నట్లు మంత్రిత్వ శాఖ ముందే ప్రకటించింది.

కేరళలో ఇంటర్ స్టేట్ బస్ సర్వీసులకు మళ్ళీ బ్రేక్ : ఎందుకో తెలుసా ?

రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు ప్రారంభంలోనే ఇంటర్ స్టేట్ రవాణా సర్వీస్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎ. కె. ససీంద్రన్ గతంలో ప్రకటించారు.

MOST READ:కొడుకు ఇచ్చిన ఐడియాతో తండ్రి సృష్టించిన ఎలక్ట్రిక్ సైకిల్ ; చూసారా..!

కేరళలో ఇంటర్ స్టేట్ బస్ సర్వీసులకు మళ్ళీ బ్రేక్ : ఎందుకో తెలుసా ?

రవాణా మంత్రి మాట్లాడుతూ మేము ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్వీసుల కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని ఆశిస్తున్నాము. కాని కంటైనేషన్ జోన్ల సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రదేశాలు కంటైనర్ జోన్ల పరిధిలోకి రావడంతో మా నిర్ణయాన్ని మార్చికువాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేరళలో ఇంటర్ స్టేట్ బస్ సర్వీసులకు మళ్ళీ బ్రేక్ : ఎందుకో తెలుసా ?

దీనికి సంబంధించిన మరిన్ని వార్తల ప్రకారం కేరళ ప్రభుత్వం ప్రభుత్వ యాజమాన్యంలో కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులకు 25 శాతం ఛార్జీల పెంపును ప్రకటించింది. ఛార్జీల పెంపు ప్రైవేటు బస్సులకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది.

MOST READ:కొత్త అవతారం దాల్చిన మోడిఫైడ్ ప్రీమియర్ పద్మిని కార్

కేరళలో ఇంటర్ స్టేట్ బస్ సర్వీసులకు మళ్ళీ బ్రేక్ : ఎందుకో తెలుసా ?

కరోనా లాక్ డౌన్ వ్యవధిలో జరిగిన కొన్ని నష్టాల నుండి ప్రజా రవాణా నెట్‌వర్క్ కోలుకోవడానికి వీలుగా ఛార్జీలు పెంచే నిర్ణయం తీసుకున్నారు. కనీస ఛార్జీలు మునుపటికంటే కొంత ఎక్కువగా ఉంటాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే సాధారణ 5 కిలోమీటర్లకు బదులుగా మొదటి 2.5 కిలోమీటర్లకు ఛార్జీలు లెక్కించబడతాయి.

కేరళలో ఇంటర్ స్టేట్ బస్ సర్వీసులకు మళ్ళీ బ్రేక్ : ఎందుకో తెలుసా ?

ఛార్జీల పునర్విమర్శ కమిటీకి జస్టిస్ ఎం రామచంద్ర నాయకత్వం వహించారు. ఇందులో విద్యార్థులకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని అభ్యర్థించారు. లాక్ డౌన్ వ్యవధిలో అన్ని పాఠశాలలు మరియు విద్యాసంస్థలు మూసివేయబడిందని పరిగణనలోకి తీసుకుని విద్యార్థుల కోసం ఛార్జీలను రెగ్యులర్ రేట్లకు ఉంచాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

MOST READ:గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన డీజిల్ ధర, ఇప్పుడు లీటర్ డీజిల్ ధర ఎంతో తెలుసా ?

కేరళలో ఇంటర్ స్టేట్ బస్ సర్వీసులకు మళ్ళీ బ్రేక్ : ఎందుకో తెలుసా ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఇది. కోవిడ్-19 పరిస్థితి ఇంకా పూర్తిగా పరిష్కరించబడలేదు, అంతే కాకుండా పాజిటీవ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో సుదూర ప్రాంతాలకు లేదా ఇతర ప్రాంతాలకు బస్ సర్వీసులు ప్రారంభిస్తే మరిన్ని ఎక్కువ పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Kerala State Road Transport Corporation’s Long Distance Bus Services Put On Hold: Details. Read in Telugu.
Story first published: Monday, August 3, 2020, 12:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X