కరోనా వైరస్ నివారణకు టాక్సీ డ్రైవర్ల కొత్త ఐడియా

కరోనా మహమ్మారి వాళ్ళ భారతదేశం మొత్తం 2020 మార్చి 24 న నుంచి లాక్ డౌన్ లో ఉంది. మొదట మార్చి 24 నుంచి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించబడింది. కరోనా మరింత ఎక్కువగా వ్యాప్తి చెందటం వల్ల లాక్ డౌన్ మళ్ళీ పొడిగిస్తూ మే 03 వరకు పెంచడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో మళ్ళీ దీనిని పొడిగిస్తూ 2020 మే 17 వరకు పొడిగిస్తూ భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ మూడవ దశ లాక్ డౌన్ లో మాత్రం అన్ని రాష్ట్రాలను గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లగా విభజించారు. అంతే కాకుండా ఈ జోన్లకు కొన్ని మినహాయింపులు కూడా కల్పించడం జరిగింది.

కరోనా వైరస్ నివారణకు టాక్సీ డ్రైవర్ల కొత్త ఐడియా

రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో, క్యాబ్‌లు మరియు టాక్సీ సేవలు భారతదేశం అంతటా గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో తిరిగి ప్రారంభించడం జరిగింది. అయినప్పటికీ కరోనా ఇప్పటికి కొంత ముప్పును కలిగిస్తుందనే కారణంతో సామాజిక దూరం మరియు భద్రతా చర్యలను కొనసాగించాలని అధికారులు ప్రతి ఒక్కరినీ కోరారు.

కరోనా వైరస్ నివారణకు టాక్సీ డ్రైవర్ల కొత్త ఐడియా

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కేరళలోని టాక్సీ డ్రైవర్లు తమను మరియు వారి కస్టమర్లను రక్షించుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఐడియాతో ముందుకు వచ్చారు. ఆసియానెట్ న్యూస్ నివేదికల ప్రకారం కేరళలోని కొచ్చిలోని అధికారులు టాక్సీ డ్రైవర్లను ముందు మరియు వెనుక సీట్ల మధ్య స్పష్టమైన ఫైబర్ గ్లాస్ తో విభజనను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ఫైబర్ గ్లాస్ విభజనలను వ్యవస్థాపించడం సులభం మరియు డ్రైవర్ మరియు ప్రయాణీకులకు ఎక్కువ భద్రత కల్పిస్తుంది.

MOST READ:బిఎస్ 6 వెర్షన్ లో విడుదల కానున్న బజాజ్ డిస్కవరీ మరియు వి మోడల్స్

కరోనా వైరస్ నివారణకు టాక్సీ డ్రైవర్ల కొత్త ఐడియా

ఫైబర్‌ గ్లాస్ విభజనను ఏర్పాటు చేయడమే కాకుండా, అన్ని భద్రతా చర్యలు మరియు జాగ్రత్తలు పాటించేలా చూడాలని అధికారులు టాక్సీ డ్రైవర్లను కోరారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం, టాక్సీ డ్రైవర్లు ఇప్పుడు ప్రయాణీకులను అనుమతించడానికి కార్ల డోర్లు ఓపెన్ చేయవలసి ఉంటుంది.

అంతే కాకుండా వాహనంలోకి ప్రవేశించే ముందు వారికి హ్యాండ్ శానిటైజర్ కూడా ఇవ్వబడుతుంది. కొత్త మార్గదర్శకాలు ప్రతి రైడ్‌కు ఇద్దరు కస్టమర్లు మాత్రమే అనుమతించబడుతుంది. ప్రయాణికులను ఎవరినీ ముందు ప్రయాణీకుల సీట్లో కూర్చోవడానికి డ్రైవర్లు అనుమతించరు.

కరోనా వైరస్ నివారణకు టాక్సీ డ్రైవర్ల కొత్త ఐడియా

వినియోగదారులు తప్పనిసరిగా మాస్కు ధరించాల్సి ఉంటుంది, డ్రైవర్లు అన్ని సమయాల్లో మాస్కులు మరియు చేతి గ్లౌజులు ధరిస్తారు. వినియోగదారులు తమ సొంత సామానులను నిర్వహించమని కూడా అడుగుతున్నారు. అంతే కాకుండా ఇప్పుడు లోడింగ్ మరియు అన్లోడ్ స్వయంగా డ్రైవర్లే చేస్తారు.

MOST READ:కూతురి కోసం సామజిక దూరంతో బైక్ తయారుచేసిన తండ్రి

కరోనా వైరస్ నివారణకు టాక్సీ డ్రైవర్ల కొత్త ఐడియా

నగదు రహిత (ఆన్‌లైన్) చెల్లింపులు ఉండేలా టాక్సీ డ్రైవర్లను కూడా అధికారులు కోరారు. ఇది డ్రైవర్ మరియు కస్టమర్ మధ్య శారీరక సంబంధం లేదని నిర్ధారిస్తుంది. టాక్సీలు ఇప్పుడు అన్ని విండోలను తెరుస్తాయి, ఎయిర్ కండిషనింగ్ వాడకం నివారించబడింది. టాక్సీ డ్రైవర్లు ప్రతి రైడ్ తర్వాత కారును శుభ్రపరిచేలా చూస్తున్నారు. ఎందుకంటే వారు ప్రజల రక్షణ ద్యేయంగా పనిచేస్తున్నారు.

కరోనా వైరస్ నివారణకు టాక్సీ డ్రైవర్ల కొత్త ఐడియా

కరోనా వైరస్ టాక్సీ డ్రైవర్లకు ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఎక్కువ మంది వ్యక్తులతో సంభాషిస్తారు. అందువల్ల వారి భద్రతతో పాటు వారి వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి, క్యాబ్ డ్రైవర్లు మరియు అధికారులు వారి శ్రేయస్సును కొనసాగించడానికి కొత్త మార్గాలతో ముందుకు ఈ వస్తున్నారు.

Source: Twitter

MOST READ:ఎలక్ట్రిక్ మాస్ట్రో స్కూటర్ విడుదల చేయనున్న హీరో మోటోకార్ప్

Most Read Articles

English summary
Coronavirus Pandemic: Kerala Taxi Drivers Install Fibreglass Partition As Part Of Safety Measures. Read in Telugu.
Story first published: Thursday, May 7, 2020, 12:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X