ఫిబ్రవరి నెలలో కియా కార్నివాల్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా.. !

2020 ఫిబ్రవరి 7 నుండి 12 మధ్య జరిగిన ఆటో ఎక్స్‌పోలో కియా మోటార్స్ తన కియా కార్నివాల్ ఎమ్‌పివిని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ కార్నివాల్ ఎమ్‌పివి ధర రూ. 24.95 లక్షలు (ఎక్స్-షోరూమ్-ఇండియా). కియా మోటార్స్ కియా కార్నివాల్ ఎమ్‌పివిని ప్రవేశపెట్టినప్పటినుండి ఎంత అమ్మకాలను సాధించింది అనే దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. !

ఫిబ్రవరి నెలలో కియా కార్నివాల్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా.. !

కార్నివాల్ ఎమ్‌పివి 2020 ఫిబ్రవరి నెలలో 1620 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. కియా కార్నివాల్ యొక్క అమ్మకాలు మహీంద్రా మొరాజో కంటే ఎక్కువగా సంఖ్యలో ఉన్నాయి. మహీంద్రా మొరాజో 1236 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఫిబ్రవరి నెలలో కియా కార్నివాల్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా.. !

కియా కార్నివాల్ అనేది ఎమ్‌పివి విభాగంలో కియా బ్రాండ్ యొక్క ప్రీమియం సమర్పణ. ఇది మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. మంచి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. కియా కార్నివాల్ ఎమ్‌పివిలో మూడు వరుసల సీట్లను కలిగి ఉండటమే కాకుండా, విలాసవంతమైన క్యాబిన్‌ని కూడా కలిగి ఉంటుంది.

ఫిబ్రవరి నెలలో కియా కార్నివాల్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా.. !

కార్నివాల్ పొడవు దాదాపు 5 మీటర్లు, దాని సమీప ప్రత్యర్థి అయిన టయోటా ఇన్నోవా క్రిస్టా కంటే 100 మిమీ కంటే ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది.

ఫిబ్రవరి నెలలో కియా కార్నివాల్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా.. !

కియా కార్నివాల్ అనేది భారతదేశంలో కియా మోటార్స్ యొక్క రెండవ ఉత్పత్తి. కియా సెల్టోస్ తరువాత కార్నివాల్ మార్కెట్లో మంచి పనితీరుని కలిగి ఉంది. కియా సెల్టోస్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యువి. ఇది మునుపటి నెలలో దాదాపు 14,000 యూనిట్లకు పైగా అమ్మకాలను సాగించింది. అంతే కాకుండా 2020 లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.

ఫిబ్రవరి నెలలో కియా కార్నివాల్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా.. !

కియా మోటార్స్ ప్రస్తుతం భారతీయ మార్కెట్ కోసం తదుపరి ఉత్పత్తిగా సొనెట్ ని తయారుచేస్తుంది. ఇది 2020 ఆటో ఎక్స్‌పోలో కార్నివాల్‌తో పాటు కియా సోనెట్ దాని కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించబడింది. కియా ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ ఎస్‌యువిని పరీక్షిస్తోంది.

ఫిబ్రవరి నెలలో కియా కార్నివాల్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా.. !

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యువి విభాగంలో ఉంచిన హ్యుందాయ్ వెన్యూపై ఆధారపడి ఉంటుంది. భారతీయ మార్కెట్లో ఒకసారి లాంచ్ చేసిన తరువాత మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి వాటికి ఇది ప్రత్యర్థి అవుతుంది.

ఫిబ్రవరి నెలలో కియా కార్నివాల్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా.. !

కియా కార్నివాల్‌ ప్రీమియం ఎమ్‌పివిని 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో సరికొత్త బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అందిస్తున్నారు. ఇది 197 బిహెచ్‌పి మరియు 44 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి జతచేయబడుతుంది.

ఫిబ్రవరి నెలలో కియా కార్నివాల్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా.. !

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో కియా మోటార్స్ యొక్క కియా కార్నివాల్ మంచి పనితీరుని కనపరచడమే కాకుండా, చాలా మంది వినియోగదారులను ఆకర్షించింది. ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించడం వల్ల ఎక్కువ అమ్మకాలను కూడా కొనసాగిస్తోంది. రాబోయే నెలల్లో కూడా కియా అమ్మకాలను స్థిరంగా ఉంచాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో కియా కార్నివాల్, మహీంద్రా మొరాజో కంటే ఎక్కువ అమ్మకాలను సాగించింది.

Most Read Articles

English summary
Kia Carnival Sales In India For February: Overtakes Sales Of The Mahindra Marazzo In The First Month. Read in Telugu.
Story first published: Wednesday, March 11, 2020, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X