బిగ్ బ్రేకింగ్: సంచలన ధరతో విడుదలైన కియా కార్నివాల్
ఇండియన్ మార్కెట్లో ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రజాదరణను పొందిన సంస్థ కియా. ఇప్పుడు కియా బ్రాండ్ నుంచి కార్నివాల్ ఎమ్‌పివి ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం

కియా సంస్థ తన కార్నివాల్ ఎమ్‌పివి ని 2020 ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది. కియా కార్నివాల్ ధరలు ఇప్పుడు 24.95 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభించనుంది. ఇది డీజిల్ ఆటోమేటిక్ పవర్‌ట్రెయిన్‌తో లభిస్తుంది. ఈ కియా కార్నివాల్ ఎమ్‌పివి మూడు సీటింగ్ కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉండటంతో పాటు మూడు ట్రిమ్‌లను కూడా కలిగి ఉంటుంది.

కియా కార్నివాల్ ఎంట్రీ లెవెల్ ప్రీమియం 7 మరియు 8 సీట్ల వేరియంట్లో కూడా లభిస్తుంది. ఈ కియా కార్నివాల్ లో వేరియంట్ వారీగా ధరలు కూడా ఉంటాయి.

కియా కార్నివాల్ వేరియంట్ వారీగా ధరలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) క్రింది విధంగా ఉంటాయి.
ప్రీమియం (7 సీట్లు): రూ .24 .95 లక్షలు
ప్రీమియం (8 సీట్లు): రూ .25.15 లక్షలు
ప్రెస్టీజ్ (7 సీట్లు): రూ .28.95 లక్షలు
ప్రెస్టీజ్ (9 సీట్లు): రూ .29 .95 లక్షలు
లిమోసిన్ (7 సీట్లు): రూ .33.95 లక్షలు

కియా కార్నివాల్ లో భద్రతా లక్షణాలను గమనించినట్లయితే ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఇబిడి, ఐసోఫిక్స్ చైల్డ్-సీట్ మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు వెనుక కెమెరా ఉన్నాయి. ఇంకా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్-స్లైడింగ్ డోర్స్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటోతో 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ మరియు ఆపిల్ కార్ప్లే , క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ / గో, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ మరియు పవర్ అడ్జస్టబుల్ వింగ్ మిర్రర్స్ వంటివి ఉంటాయి.

మిడ్ రేంజ్ ప్రెస్టీజ్ వేరియంట్ లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగులు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఎల్‌ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఐస్-క్యూబ్ ఎల్‌ఇడి ఫాగ్ లాంప్స్, పవర్డ్ టెయిల్‌గేట్, డ్యూయల్ పేన్ సన్‌రూఫ్ మరియు పవర్-ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్ ఉంటాయి. ఇంక 9 సీట్ల వేరియంట్లో ప్రత్యేకమైన లెథరెట్ అప్హోల్స్టరీ కూడా ఉంటుంది.

కియా కార్నివాల్ మూడు సీటింగ్ వేరియంట్లలో లభిస్తుంది. 7 సీట్ వేరియంట్లో 2+2+3 అమరిక కలిగి ఉంటుంది. 8 సీట్ల వేరియంట్లో 2+3+3 డిజైన్ లో, మరియు 9 సీట్ల వేరియంట్లో 2+2+2+3 వరుసలో ఉంటాయి.

కియా కార్నివాల్ లో బిఎస్-6 కంప్లైంట్ 2.2 లీటర్ నాలుగు సిలిండర్లను కలిగి ఉంటుంది. ఇది 200 హెచ్‌పి మరియు 440 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడి ఉంటుంది.

కియా కార్నివాల్ యొక్క బుకింగ్స్ జనవరి 21 నుంచి అధికారికంగా జరుగుతున్నాయి. బుకింగ్స్ ప్రారంభించినప్పటినుంచి ఇప్పటిదాకా 3500 అర్దర్లను పొందినట్లు సంస్థ తెలిపింది. ఇది కియా యొక్క రెండవ హిట్ గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








