6- 7- 8- 9- సీటింగ్ కెపాసిటీతో వస్తోన్న కియా కార్నివాల్: లాంచ్ ఎప్పుడంటే?

కియా మోటార్స్ తమ నెక్ట్స్ మోడల్‌ "కియా కార్నివాల్"ను ఇండియన్ మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు సిద్దమయ్యింది. కియా కార్నివాల్ 6-సీటర్, 7-సీటర్, 8-సీటర్ మరియు 9-సీటింగ్ ఆప్షన్‌లో లభించనుంది. ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కార్నివాల్ ఎంపీవీ కారును ఆవిష్కరించనున్నారు.

6- 7- 8- 9- సీటింగ్ కెపాసిటీతో వస్తోన్న కియా కార్నివాల్: లాంచ్ ఎప్పుడంటే?

కియా కార్నివాల్ ఎంపీవీ 7-సీటర్, 8-సీటర్ మరియు 11-సీటర్ వేరియంట్లు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. దేశీయంగా ఎంపీవీ సెగ్మెంట్లో పట్టు సాధించేందుకు కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా విభిన్న సీటింగ్ ఆప్షన్లలో కార్నివాల్ ఎంపీవీ కారును లాంచ్ చేసేందుకు కియా మోటార్స్ ఏర్పాట్లు ప్రారంభించింది.

6- 7- 8- 9- సీటింగ్ కెపాసిటీతో వస్తోన్న కియా కార్నివాల్: లాంచ్ ఎప్పుడంటే?

ప్రస్తుతానికైతే, కార్నివాల్ ఎంపీవీ సీటింగ్ ఆప్షన్ల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు, అయితే కస్టమర్లు దీనిని తమ అసరావల అనుగుణంగా సీటింగ్ ఆప్షన్స్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం కల్పించే అవకాశం ఉంది.

6- 7- 8- 9- సీటింగ్ కెపాసిటీతో వస్తోన్న కియా కార్నివాల్: లాంచ్ ఎప్పుడంటే?

కియా సెల్టోస్ మిడ్-సైజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీలో తీసుకొచ్చిన అన్ని లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ మరియు ఫీచర్లను కార్నివాల్ ఎంపీవీలో కూడా ప్రవేశపెట్టనుంది. పెద్ద పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.1-ఇంచుల పరిమాణంలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లను రియర్ ప్యాసింజర్ల కోసం ఫ్రంట్ సీట్లకు వెనుక వైపున అందించే అవకాశం ఉంది, వీటికి కియా కంపెనీకి చెందిన UVO కనెక్ట్ ఫీచర్లు కూడా అదనంగా రానున్నాయి.

6- 7- 8- 9- సీటింగ్ కెపాసిటీతో వస్తోన్న కియా కార్నివాల్: లాంచ్ ఎప్పుడంటే?

కియా కార్నివాల్ ఎంపీవీ కారులో రెండు సన్‌రూఫ్‌లు, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం ఉన్న డ్రైవర్ సీటు, మరియు ఎలక్ట్రానిక్ స్లైడింగ్ డోర్లు ప్రధాన హైలెట్‌గా నిలవనున్నాయి.

6- 7- 8- 9- సీటింగ్ కెపాసిటీతో వస్తోన్న కియా కార్నివాల్: లాంచ్ ఎప్పుడంటే?

సేఫ్టీ విషయానికి వస్తే, కియా కార్నివాల్ ఎంపీవీలో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ వార్నింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఐఎఎస్ఒచైల్డ్ సీట్ యాంకర్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్-హోల్డ్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా మరియు బ్లైండ్ స్పాట్ కెమెరాలు వంటి ఎన్నో అధునాతన సేప్టీ ఫీచర్లు రానున్నాయి.

6- 7- 8- 9- సీటింగ్ కెపాసిటీతో వస్తోన్న కియా కార్నివాల్: లాంచ్ ఎప్పుడంటే?

ఇండియన్ వెర్షన్ కియా కార్నివాల్ ఎంపీవీలో సాంకేతికంగా బిఎస్6 ప్రమాణాలను పాటించే 2.2-లీటర్ నాలుగు సిలిండర్ల టుర్భో-డీజల్ ఇంజన్ వస్తోంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఈ ఇంజన్ గరి,్టంగా 200బిహెచ్‌పి పవర్ మరియు 441ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వచ్చే ఛాన్స్ లేదు.

6- 7- 8- 9- సీటింగ్ కెపాసిటీతో వస్తోన్న కియా కార్నివాల్: లాంచ్ ఎప్పుడంటే?

కియా మోటార్స్ కార్నివాల్ ఎంపీని అనంతపురంలోని పెనుకొండ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. 9-సీటర్ వెర్షన్ కియా కార్నివాల్ టయోటా ఇన్నోవా క్రిస్టా ఎంపీవీకి క్రింది స్థానంలో, 7 మరియు 8-సీటర్ వెర్షన్ కార్నివాల్ ఇన్నోవా క్రిస్టాకు పై స్థానంలో నిలనుంది.

6- 7- 8- 9- సీటింగ్ కెపాసిటీతో వస్తోన్న కియా కార్నివాల్: లాంచ్ ఎప్పుడంటే?

6-సీటర్ కియా కార్నివాల్ ఎంపీవీలో రెండో మరియు మూడో వరుసల్లో కెప్టెన్ సీట్లు (పొడవాటి సీట్లు కాకుండా, వ్యక్తిగతంగా సింగల్ సీట్లు) రానున్నాయి. ఇది టయోటా వెల్‌ఫైర్ మరియు మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ ఎంపీవీలకు గట్టి పోటీనివ్వనుంది. దీని ప్రారంభ ధరే సుమారు 30 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉండవచ్చు.

6- 7- 8- 9- సీటింగ్ కెపాసిటీతో వస్తోన్న కియా కార్నివాల్: లాంచ్ ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ ప్లాన్ అదుర్స్ అని చెప్పాలి. ఇప్పటికే కియా సెల్టోస్‌తో మార్కెట్లో గుర్తింపు తెచ్చుకున్న కియా మోటార్స్.. కార్నివాల్ ఎంపీవీలను విభిన్న సీటింగ్ ఆప్షన్లలో బడ్జెట్ ధరల నుండి లగ్జరీ కార్లకు ధీటుగా ఖరీదైన వెర్షన్ వరకు రకరకాల వేరియంట్లలో లాంచ్ చేసేందుకు సన్నద్దమవుతోంది. ఇదే కనుక జరిగితే కియా మోటార్స్‌కు ఇండియన్ మార్కెట్లో తిరుగుడుందని చెప్పాలి. కియా కార్నివాల్ కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే లేటెస్టే అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి!

Most Read Articles

English summary
Kia Carnival To Be Launched In India With Six, Seven, Eight, And Nine Seat Configurations. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X