Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
394 మంది పోలీసులకు గాయాలు.. కొందరు ఐసీయూలో.. 19 మంది అరెస్ట్: ఢిల్లీ సీపీ
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో లక్షకు పైగా కనెక్టెడ్ కార్లను విక్రయించిన కియా మోటార్స్
అనంతపూర్ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ భారతదేశంలో లక్ష యూనిట్ల కనెక్టెడ్ కార్ల అమ్మకాలను సాధించిన మొట్టమొదటి కార్ల తయారీ సంస్థగా నిలిచినట్లు కంపెనీ పేర్కొంది.

యూవీఓ కనెక్ట్ ఇన్-కార్ టెక్నాలజీతో కూడిన కియా వాహనాలు భారతదేశంలో బ్రాండ్ మొత్తం అమ్మకాలలో 55 శాతం కంటే అధికంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

కియా వాహనాల్లో అత్యధికంగా అమ్ముడైన కనెక్టెడ్ కార్ వేరియంట్‌లో కియా సెల్టోస్ జిటిఎక్స్ ప్లస్ డిసిటి 1.4టి పెట్రోల్ వేరియంట్ అమ్మకాలు ఎక్కువగా నమోదైనట్లు కంపెనీ తెలిపింది. ఈ వేరియంట్ మొత్తం కనెక్టెడ్ కార్ల అమ్మకాల్లో దాదాపు 15 శాతం వాటాను కలిగి ఉంటుందని కియా వివరించింది.
MOST READ:నగరంలో వేలం వేయనున్న వాహనాల జాబితా విడుదల చేసిన హైదరాబాద్ పోలీసులు

కియా మోటార్స్ తమ కనెక్టెడ్ కార్లలో ఆఫర్ చేస్తున్న యూవీఓ కనెక్ట్ టెక్నాలజీ సాయంతో కస్టమర్ తమ స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ సాయంతో తమ కియా కారుకి రిమోట్‌గా కనెక్ట్ అయ్యి, కారులోని వివిధ ఫంక్షన్లను వైర్‌లెస్‌గా కంట్రోల్ చేయవచ్చు.

ప్రధానంగా కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కంట్రోల్ చేయటానికి ఈ స్మార్ట్ ఫీచర్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో 57 స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి, కియా మోటార్స్ తమ కస్టమర్ల కోసం ఈ ఫీచర్‌ను 3 సంవత్సరాల ఉచిత చందాతో అందిస్తోంది.
MOST READ:2020 లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన టాప్ 10 కార్లు, వాటి వివరాలు

ఈ టెక్నాలజీలోని స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ మరియు టిజెన్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను సపోర్ట్ చేస్తుంది, ఇది ఇబ్బంది లేని మరియు సౌకర్యవంతమైన కనెక్టింగ్ టెక్నాలజీ అనుభూతిని అందిస్తుంది.
అంతేకాకుండా, యూవీఓ కనెక్ట్ ఇన్-కార్ టెక్నాలజీలో తొమ్మిది వర్గాల క్రింద అనేక వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి. కస్టమర్ కేవలం తమ గొంతుతో కొన్ని రకాల ఆదేశాలను జారీ చేయటం ద్వారా కారు మరియు కనెక్టెడ్ ఫోన్‌లోని కొన్ని ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.

ఈ వాయిస్ కమాండ్స్‌లో కాలింగ్, వాతావరణ సమాచారం, సమయం మరియు తేదీ, ఇండియన్ హాలిడే ఇన్ఫర్మేషన్, క్రికెట్ స్కోర్, మీడియా కంట్రోల్, నావిగేషన్ కంట్రోల్ మరియు క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.
దీనితో పాటుగా లైవ్ కార్ ట్రాకింగ్, ఆటో కొల్లైజన్ నోటిఫికేషన్, ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్, రిమోట్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, రిమోట్ ఆపరేటెడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఎయిర్ క్వాలిటీ మోనిటర్, జియో ఫెన్సింగ్, టైమ్ ఫెన్స్, స్పీడ్ అలర్ట్, వాలెట్ మరియు ఐడిల్ అలర్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఈ టెక్నాలజీలో ఉన్నాయి.
MOST READ:భారత్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ హైబ్రిడ్ బుకింగ్స్ స్టార్ట్

వీటికి అదనంగా, మన స్మార్ట్ ఫోన్లలో ఉండే ఓకే గూగుల్, హాయ్ బిక్స్‌బి, హే సిరి మరియు అలెక్సా వంటి వాయిస్ అసిస్ట్ వేకప్ కమాండ్స్ మాదిరిగానే.. యూవీఓ కనెక్టెడ్ కార్ టెక్నాలజీలో కూడా "హలో కియా" అనే వాయిస్ కమాండ్ కూడా ఉంటుంది. యూజర్ హలో కియా అని చెప్పడం యూవీఓ స్మార్ట్ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు.

యువో స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ సాయంతో యూజర్లు తమ స్మార్ట్ వాచ్ నుండే అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. ఇది ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటికీ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త అమ్మకాల రికార్డుపై కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది మరియు ఇది మునుపటి కంటే మెరుగైనదని అభివర్ణించింది.

కియా సెల్టోస్ కారులో ఇటీవల చేసిన కొన్ని టెక్ అప్‌డేట్స్‌లో కంపెనీ ఇందులో కొత్త వాయిస్ అసిస్ట్ కమాండ్స్‌ను చేర్చడంతో పాటుగా 10 కొత్త ఫీచర్లను కూడా జోడించింది. కొత్త సెల్టోస్‌లో లో-ఎండ్ వేరియంట్‌లలో కూడా ఇప్పుడు 8 కొత్త ఫీచర్లు జోడించబడ్డాయి. కియా సొనెట్, సెల్టోస్ మరియు కార్నివాల్ మోడళ్లలో కంపెనీ ఈ కనెక్టెడ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తోంది.