డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

కియా మోటార్స్ నుండి త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించింది. కస్టమర్లు రూ.25,000 టోకెన్ అమౌంట్‌ని చెల్లించి ఈ కొత్త కాంపాక్ట్-ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో, కియా సోనెట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్ కేంద్రాలను చేరుకుంటోంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

తాజాగా, టీమ్‌బిహెచ్‌పి నుండి వచ్చిన తాజా చిత్రాల ప్రకారం, ఓ డీలర్ యార్డ్‌లో గుర్తించిన సోనెట్ ఎస్‌యూవీలో జిటి-లైన్ వేరియంట్ వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇది ఈ ఎస్‌యూవీ లైనప్‌లో లభ్యం కానున్న అత్యంత శక్తివంతమైన ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 1.0-లీటర్ టి-జిడిఐ టర్బో ఇంజన్‌తో పాటుగా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

కియా సోనెట్ కోసం దేశంలో ప్రీ-లాంచ్ బుకింగ్‌లను ప్రారంభించిన మొదటి రోజే రికార్డు స్థాయిలో 6,523 యూనిట్లను నమోదు చేసింది. సోనెట్ మార్కెట్లోకి ప్రవేశించక ముందే కియా బ్రాండ్ కోసం ఓ కొత్త మైలురాయిని సాధించి పెట్టింది.

MOST READ: నిస్సాన్ మాగ్నైట్ వీడియో విడుదల; ఇందులో హైలైట్స్ ఏంటో మీరే చూడండి!

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

కియా సోనెట్ దేశంలో కియా మోటార్స్‌కు మూడవ ఉత్పత్తి అవుతుంది మరియు దీనిని భారతదేశంలోనే తయారు చేసి ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయనున్నారు. తాజా నివేదిక ప్రకారం, కియా మోటార్స్ తమ సోనెట్‌ను రెండు పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందించనుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

ఇందులో పెట్రోల్ ఇంజన్లు డిస్‌ప్లేస్‌మెంట్స్‌లో (ఇంజన్ సీసీ) మారుతాయి. వీటిలో ఒకటి 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇంజన్ మరొకటి 1.0-లీటర్ టర్బో-ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

MOST READ: టొయోటా అర్బన్ క్రూయిజర్ ఇంటీరియర్స్ వెల్లడి; ఈ అద్భుతాన్ని మీరు చూసేయండి!

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

ముందుగా 1.2-లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 84 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇకపోతే టాప్-ఎండ్ వేరియంట్లలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది 119 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ (ఐఎమ్‌టి) ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యం కానుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

అయితే, డీజిల్ ఇంజన్ క్యూబిక్ సామర్థ్యాలలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. కానీ, ఇవి వేర్వేరు పవర్, టార్క్ గణాంకాలను ఉత్పత్తి చేసేలా కంపెనీ వీటిని ట్యూన్ చేసింది. ముందుగా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ వేస్ట్-గేట్ టర్బో (డబ్ల్యుజిటి) ఇది 99 బిహెచ్‍‌పి శక్తిని, 240 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

MOST READ: బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్, జి 310 జిఎస్‌ల కోసం సెప్టెంబర్ 1 నుండి బుకింగ్స్ ఓపెన్

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

ఇకపోతే, రెండవ డీజిల్ ఇంజన్ ఆప్షన్ అయిన 1.5 లీటర్ వేరియబుల్ జియోమెట్రీ టర్బో (విజిటి) ఇంజన్ గరిష్టంగా 114 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

కియా సోనెట్ కొలతలను గమనిస్తే, ఇది 3995 మిమీ పొడవు, 1790 మిమీ వెడల్పు, 1647 మిమీ ఎత్తు మరియు 2500 మిమీ వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది నేలపై నుంచి 211 మిమీ ఎత్తులో ఉండి మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. దీని బూట్ స్పేస్ 392 లీటర్లుగా ఉంటుంది.

MOST READ: వెస్పా నుంచి రానున్న కొత్త 'రేసింగ్ సిక్స్టీస్' స్కూటర్; సెప్టెంబర్ 1న విడుదల

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

కియా సోనెట్‌లో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రపంచంలోనే మొట్టమొదటి వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో సహా అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లను కంపెనీ అందిస్తోంది.

డీలర్ల వద్దకు చేరుకుంటున్న కియా సోనెట్; త్వరలో విడుదల

కియా సోనెట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా సోనెట్ మార్కెట్లో విడుదల కావటానికి ముందే డీలర్‌షిప్‌ల వద్దకు రావడాన్ని చూస్తుంటే, కియా మోటార్స్ ఈ మోడల్‌ను వీలైనంత త్వరగా కస్టమర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. మార్కెట్ ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యువి 300 మరియు మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న టొయోటా అర్బన్ క్రూయిజర్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

Source: TeamBHP

Most Read Articles

English summary
The Kia Sonet is expected to launch soon in the Indian market. Ahead of the launch, the Sonet has started to arrive at dealerships across the country. Read in Telugu.
Story first published: Sunday, August 30, 2020, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X