కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.25,000

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. ఈ మోడల్‌ను అందరి కన్నా ముందు సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ.25,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.25,000

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చే నెల ఆరంభంలో భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలోనే ఈ మోడల్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. కియా మోటార్స్‌కు సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క మూడవ ఉత్పత్తిగా విడుదల కానుంది.

కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.25,000

కియా సోనెట్ బ్రాండ్ యొక్క కొత్త ఎంట్రీ లెవల్ మోడల్. కియా సెల్టోస్ తరువాత ఇది రెండవ ‘మేడ్-ఇన్-ఇండియా' ఉత్పత్తి అవుతుంది. గత రెండు వారాలుగా కియా సోనెట్‌కి సంబంధించిన అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ మోడల్ బ్రోచర్, వేరియంట్లు, ఇంజన్ వివరాలు, ఫీచర్లు కూడా ఇప్పటికే లీక్ అయ్యాయి.

MOST READ:సెక్యూరిటీ లేకుండా రోడ్ మీద బెంజ్ కారు డ్రైవ్ చేస్తున్న రతన్ టాటా [వీడియో]

కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.25,000

మునుపటి నివేదికల ప్రకారం, కియా సోనెట్ టెక్-లైన్ మరియు జిటి-లైన్ అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ రెండూ వేరియంట్లలో ఫీచర్లు మరియు ఇంజన్ ఆప్షన్లను బట్టి అనేక విభిన్న వేరియంట్లలో లభ్యం కానున్నాయి.

కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.25,000

ముందుగా కియా సోనెట్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది మూడు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. అవి: 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.0-లీటర్ టి-జిడిఐ పెట్రోల్ ఇంజన్. వీటిలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.2-లీటర్ ఎన్‌ఏ పెట్రోల్ ఇంజన్‌లను హ్యుందాయ్ వెన్యూ నుండి గ్రహించనున్నారు.

MOST READ:మీకు తెలుసా.. సచిన్ టెండూల్కర్ మొదటి కార్, ఇదే

కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.25,000

ఇకపోతే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కియా సెల్టోస్ నుండి గ్రహించనున్నారు. సోనెట్‌లోని డీజిల్ ఇంజన్ రెండు విభిన్న ట్యూన్‌లలో లభ్యం కానుంది. అన్ని ఇంజన్‌లు విభిన్న గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభ్యం కానున్నాయి. వీటిలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్, 7-స్పీడ్ డిసిటి మరియు 7-స్పీడ్ ఐఎమ్‌టి గేర్‌బాక్స్‌లు ఉన్నాయి.

కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.25,000

కియా సోనెట్‌లో అనేక ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉపయోగించనున్న కొత్త కార్స్ : ఫోర్స్ ట్రాక్స్ టైఫూన్

కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.25,000

సోనెట్ బుకింగ్స్ ప్రారంభం గురించి కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూఖ్యూన్ షిమ్ మాట్లాడుతూ, "కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కస్టమర్లు కోరుకునే స్టైల్, క్వాలిటీ, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ, కంఫర్ట్ మరియు సేఫ్టీల కలయికతో సంయుక్తంగా కలిపి ఓ ప్యాకేజ్‌లా తయారు చేయబడిన మోడల్ మా కియా సోనెట్."

కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.25,000

"ఇండియన్ ఇన్‌పుట్స్‌ను ఆధారంగా చేసుకొని కియా సోనెట్‌ను ఇంజనీరింగ్ చేయటం జరిగింది మరియు ఇది భారతదేశం నుండి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి అయ్యే ఓ గ్లోబల్ మోడల్. సోనెట్ అమ్మకాలకు ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం భారతదేశం మరియు ఈ మోడల్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభంతో, మా స్మార్ట్ అర్బన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని దేశంలో హృదయపూర్వకంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.

MOST READ:భారత మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త టైర్ తయారీ సంస్థ... గందరగోళంలో ఉన్న ఇతర సంస్థలు

కియా సోనెట్ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ అడ్వాన్స్ రూ.25,000

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా సోనెట్ భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌యూవీలలో ఒకటి. ఈ మోడల్ భారత మార్కెట్లో విడుదలైతే దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8 - 12 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు నిస్సాన్ మాగ్నైట్ మరియు టొయోటా అర్బన్ క్రూయిజర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Kia Motors has announced the start of pre-launch bookings for their upcoming Sonet compact-SUV. The Kia Sonet SUV can be booked for an amount of Rs 25,000, starting from 20th August 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X