కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ భారత మార్కెట్లో విడుదల కావటానికి ముందే ఇందులోని వేరియంట్లు, కొలతలు, ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్ వివరాలు లీక్ అయ్యాయి. కియా మోటార్స్‌కు సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క మూడవ ఉత్పత్తిగా విడుదల కానుంది. ఇది ఇక్కడి నుండి ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి కానుంది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

రష్‌లేన్ లీక్ చేసిన సమాచారం ప్రకారం, కియా సోనెట్ కారును రెండు పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయనుంది. క్యూబిక్ కెపాసిటీ పరంగా, పెట్రోల్ ఇంజన్లు వేరువేరుగా ఉంటాయి. అయితే, డీజిల్ ఇంజన్లు క్యూబిక్ కెపాసిటీలో ఒకే విధంగా ఉంటాయి, కాకపోతే ఇవి విభిన్న టర్బో టెక్నాలజీని కలిగి ఉంటాయి.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్లలో (డబ్ల్యుజిటి) వేస్ట్-గేట్ టర్బో మరియు (విజిటి) వేరియబుల్ జియోమెట్రీ టర్బో టెక్నాలజీలు ఉంటాయి. ఇందులో రెండవది (విజిటి) ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండి, అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సోనెట్‌లోని 1.5-లీటర్ డబ్ల్యుజిటి మరియు విజిటి డీజిల్ ఇంజన్లు వరుసగా 99 బిహెచ్‌పి పవర్/ 240 ఎన్ఎమ్ టార్క్‌ని మరియు 114 బిహెచ్‌పి పవర్ / 250 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి.

MOST READ:ముంబై నుండి చెన్నైకి 1,350 కి.మీ నడిచిన వృద్ధుడు, ఇతని కథ వింటే మీకు కన్నీళ్లు వస్తాయి

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

డబ్ల్యుజిటి ఇంజన్‌తో కూడిన డీజిల్‌ను స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందించనుండగా, టాప్-స్పెక్ విజిటి అమర్చిన డీజిల్ ఇంజన్‌ను సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బ్యాక్స్‌తో ఆఫర్ చేయనున్నారు.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

ఇక పెట్రోల్ ఇంజన్‌ల విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ నాన్ టర్బోచార్జ్డ్ ఇంజన్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో 1.2-లీటర్ యూనిట్ 84 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుందో చూడండి

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

టాప్-ఎండ్ వేరియంట్‌లోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 119 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సెవన్-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ లేదా సిక్స్-స్పీడ్ (ఐఎమ్‌టి) ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది (హ్యుందాయ్ వెన్యూలో ఉపయోగించిన ఐఎమ్‌టి గేర్‌బాక్స్).

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కొలతల విషయానికి వస్తే, ఇది 3995 మిమీ పొడవు, 1790 మిమీ వెడల్పు, 1647 మిమీ పొడవు మరియు 2500 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది నేలపై నుంచి 211 మిమీ ఎత్తులో ఉండి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తుంది. దీని బూట్ సామర్థ్యం 392 లీటర్లుగా ఉంటుంది.

MOST READ:ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్న 7 ఏళ్ల బుడతడు.. ఇంతకీ ఏంటో అతని ప్రత్యేకత తెలుసా ?

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

కియా మోటార్స్ తమ సోనెట్ మోడల్‌ను మొత్తం 8 రంగులలో అందిస్తుంది. ఇందులో బీజ్ గోల్డ్, ఇంటెలిజెన్సీ బ్లూ, అరోరా బ్లాక్ పెరల్, గ్లాసీయర్ వైట్ పెరల్, గ్రావిటీ గ్రే, ఇంటెన్స్ రెడ్, స్టీల్ సిల్వర్ మరియు క్లియర్ వైట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

ఇందులో కొత్తగా ఆరెంజ్ పెయింట్ స్కీమ్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. అయితే, ఇది టాప్-ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభ్యం కానుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సోనెట్ కూడా సెల్టోస్ మాదిరిగానే డ్యూయెల్-టోన్ పెయింట్ ఆప్షన్లలో లభ్యం కానుంది. ఇది మిడ్-స్పెక్స్ వేరియంట్లలో కూడా లభిస్తుంది.

MOST READ:దేశంలో ఎక్కువ కాలం నడుస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఇదే

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

కియా సోనెట్ వేరియంట్స్ విషయానికి వస్తే, ఇది జిటి లైన్ మరియు టెక్ లైన్ వేరియంట్లలో అందించబడుతుంది. ఏదేమైనప్పటికీ, రెండు వేరియంట్లు కూడా సబ్-వేరియంట్లను కలిగి ఉంటాయి. హెచ్‌టిఎక్స్+ మరియు జిటిఎక్స్+ టాప్ సబ్-వేరియంట్లుగా ఉంటాయి మరియు ఇవి రెండూ టాప్-ఎండ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో అందించబడుతాయి.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

సోనెట్ కారులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రపంచంలో మొట్టమొదటి వైరస్ ప్రొటెక్షన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లతో సహా అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లను ఇందులో ఆఫర్ చేయనున్నారు.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంజన్స్, వేరియంట్స్ వివరాలు లీక్!

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వేరియంట్స్, డిటేల్స్ లీక్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా మోటార్స్ అందిస్తున్న సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మాదిరిగానే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా భారతీయ మార్కెట్లో విడుదలైన తర్వాత అనేక ఇంజన్, ట్రాన్స్‌మిషన్ మరియు కలర్ ఆప్షన్స్‌లతో లభ్యం కానుంది. ఈ ఆప్షన్లు కంపెనీ అందించే అనేక రకాల వేరియంట్లలో ధరకు తగినట్లుగా ఫీచర్స్ ప్యాక్ చేయబడి ఉంటాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎంచుకునేందుకు ఇందులో బహుళ వేరియంట్స్ అందుబాటులో ఉండనున్నాయి.

Most Read Articles

English summary
The Kia Sonet variants, dimensions, engine and transmission option details have been leaked ahead of its launch in the Indian market. The Sonet will be the brand's third product in the country and will be made in India for other international markets as well. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X