కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాస్ట్లీ ఫీచర్స్, త్వరలో విడుదల!

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ దేశీయ విపణిలో మరో సరికొత్త కారును ప్రవేశపెట్టేందుకు సహన్నాలు చేస్తోంది. కియా మోటార్స్‌కు భారత్‌లో మూడవ మోడల్ కానున్న కియా సోనెట్ (Kia Sonet) కారును సెల్టోస్ మోడల్‌కు దిగువన కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ప్రవేశపెట్టున్నారు. ఈ మోడల్‌కు సంబంధించిన కొన్న వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాస్ట్లీ ఫీచర్స్, త్వరలో విడుదల!

భారత మార్కెట్లో ప్రస్తుతం రెండు మోడళ్లను (సెల్టోస్, కార్నివాల్) మాత్రమే విక్రయిస్తోంది. కియా ఇప్పటికే కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఓ కారును ప్రవేశపెడతామని గతంలో ప్రకటించింది. గడచిన 2020 ఆటో ఎక్స్‌పోలో కూడా 'కియా సోనెట్' అనే సరికొత్త కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని కంపెనీ ప్రదర్శనకు ఉంచిన సంగతి మనందరికీ తెలిసినదే. మరో రెండు మూడు నెలల్లోగా ఈ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు కియా ప్లాన్ చేస్తోంది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాస్ట్లీ ఫీచర్స్, త్వరలో విడుదల!

వాస్తవానికి ఇప్పటికే ఈ మోడల్ మార్కెట్లో విడుదల కావలసి ఉండగా, కోవిడ్-19 కారణంగా ఆలస్యమైంది. లాక్‌డౌన్ 4.0లో కేంద్రం ప్రకటించిన సడలింపుల నేపథ్యంలో, కంపెనీ ఇప్పుడు తమ ఆంధ్రప్రదేశ్ ప్లాంట్‌లో పనులను వేగవంతం చేసింది. ఇదే ప్లాంట్‌లోనే కియా సోనెట్ కూడా ఉత్పత్తి కానుంది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాస్ట్లీ ఫీచర్స్, త్వరలో విడుదల!

కియా సోనెట్ భారత మార్కెట్లో విడుదలైతే ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి విటారా బ్రీజా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడళ్లకు పోటీగా నిలువనుంది. భారత మార్కెట్లో కియా సెల్టోస్ ఎస్‌యూవీ ఇప్పటికే మంచి సక్సెస్‌ను సాధించింది. సెల్టోస్ బాటలోనే తమ సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా మంచి సక్సెస్‌ను సాధిస్తుందని కంపెనీ ధీమాగా ఉంది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాస్ట్లీ ఫీచర్స్, త్వరలో విడుదల!

కియా సోనెట్ కారు పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ, ఫీచర్ల పరంగా మాత్రం సెల్టోస్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. సరికొత్త డిజైన్, విస్తృతమైన ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్స్, సరికొత్త ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, స్టయిలిష్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వంటి ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయని సమాచారం. అంతేకాకుండా.. ఇందులో అతిపెద్ద (10.25 ఇంచ్) టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కూడా ఉన్నాయనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాస్ట్లీ ఫీచర్స్, త్వరలో విడుదల!

ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకూ మరే ఇతర బ్రాండ్ కూడా ఇంత పెద్ద పరిమాణం కలిగిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేసి ఉండదు. కియా బ్రాండ్ స్వంత కనెక్టింగ్ సాఫ్ట్‌వేర్ అయిన 'యూవీఓ కనెక్ట్' టెక్నాలజీతో పాటుగా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి టెక్నాలజీలను సపోర్ట్ చేసే విధంగా ఈ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఉండనుంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ చార్జింగ్, ఆంబియెంట్ లైటింగ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లను కూడా తమ డెమో వెర్షన్ సోనెట్‌లో కియా ప్రదర్శించింది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాస్ట్లీ ఫీచర్స్, త్వరలో విడుదల!

ఈ ప్రీమయం ఫీచర్లను అటుంచితే. కియో సోనెట్‌లో కంపెనీ మూడు రకాల ఇంజన్ ఆప్షన్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. కియా అనుబంధ సంస్థ అయిన హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించిన 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లనే కొత్త కియా సోనెట్‌లో కూడా ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే హ్యుందాయ వెన్యూ, కియా సోనెట్‌లు పెర్ఫార్మెన్స్ పరంగా ఒకే రీతిలో ఉండే అవకాశం ఉంది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాస్ట్లీ ఫీచర్స్, త్వరలో విడుదల!

కియా సోనెట్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ప్రస్తుతం భారత్‌లో కార్ల వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. ప్రత్యేకించి కస్టమర్లు కాంపాక్ట్ ఎస్‌యూవీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే సెల్టోస్, కార్నివాల్ మోడళ్లతో మంచి బ్రాండింగ్ ఇమేజ్‌ను తెచ్చుకున్న కియా, తమ సోనెట్‌ను విశిష్టమైన ఫీచర్లతో సరసమైన ధరకే మార్కెట్లో లాంచ్ చేస్తే తప్పకుండా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, June 12, 2020, 15:54 [IST]
English summary
Kia Motor India is all set to introduce its third model in the Indian market, the Sonet. The new Kia Sonet is a compact-SUV and will be positioned below the popular Seltos offering in the brand's lineup. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+