కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

కియా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడవ మోడల్ కియా సోనెట్‌కి సంబంధించి రోజుకో సమాచారం బయటకు వస్తోంది. తాజాగా, కియా సోనెట్ ఇంటీరియర్స్‌ను వెల్లడించే చిత్రం ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది. కియా సోనెట్ కాంపాక్ట్-ఎస్‌యూవీని ఆగస్టు 7, 2020వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్నారు.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

కియా అందిస్తున్న ఇతర రెండు ప్రీమియం మోడళ్ల మాదిరిగానే కియా సోనెట్ కూడా అనేక వేరియంట్లలో, వివిధ రకాల ఫీచర్లు, ఆప్షన్లతో లభ్యం కానున్నట్లు. ఇండియన్ ఆటో నుండి వచ్చిన స్పై చిత్రాలు కియా సోనెట్ క్యాబిన్‌లోని కొన్ని ఫీచర్లను వెల్లడి చేసేలా ఉన్నాయి. ఇందులో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, దానిపై అమర్చిన ఆడియో మరియు క్రూయిజ్ కంట్రోల్స్ స్విచెస్‌ను చూడొచ్చు.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

ఇంకా ఇందులో డాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన క్లాస్-లీడింగ్ 10.25 ఇంచ్ ఫ్లోటింగ్-టైప్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నిలువుగా ఉండే ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, టిఎఫ్‌టి ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను కూడా చూడొచ్చు. ఇందులోని గేర్‌బాక్స్‌ను గమనిస్తే, ఇది ఆటోమేటిక్ వేరియంట్‌గా తెలుస్తోంది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

కియా సెల్టోస్‌లో 7 ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది, కానీ సోనెట్‌లో డిజిటల్ స్పీడో రీడౌట్‌ను కలిగిన చిన్న మల్టీ-కలర్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. డోర్ ట్రిమ్‌పై రెడ్ కలర్ స్టిచింగ్, స్టీరింగ్ వీల్ దిగువన రెడ్ కలర్ బ్యాడ్జ్‌ని చూస్తుంటే, ఈ టెస్టింగ్ వాహన జిటి-లైన్ వేరియంట్ అయి ఉండొచ్చని తెలుస్తోంది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

ఈ ఎస్‌యూవీలో బ్లాక్-అవుట్ ఇంటీరియర్స్ మరియు సీట్ అప్‌హెలెస్ట్రీ ఎరుపు కాంట్రాస్టింగ్ స్టిచింగ్‌లో ఉన్నాయి. డ్యాష్‌బోర్డులో ఉపయోగించిన బటన్లు చాలా వరకూ కియా సెల్టోస్ కారులో కూడా కనిపిస్తాయి. స్టీరింగ్‌కు కుడివైపున ఉంచిన హెడ్‌లైట్ కంట్రోల్ స్విచ్, ఇతర స్విచ్‌లు సెల్టోస్ నుండి గ్రహించినట్లుగా అనిపిస్తాయి.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

కియా సోనెట్‌లో వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్స్, వివిధ రోడ్లకు అనుగుణంగా డ్రైవ్ చేయటానికి మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, ఉత్తమమైన ఆడియో కోసం ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, వన్-టచ్ ఆపరేటింగ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

ఎంబెడెడ్ సిమ్ కలిగిన కియా బ్రాండ్ స్వంత యూవీఓ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ ఇందులో మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో బ్లైండ్ స్పాట్ మోనిటరింగ్ సిస్టమ్, పలు ఎయిర్‌బ్యాగులు, టిపిఎమ్ఎస్, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్లతో కూడిన రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కియా సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్ కారుకి బోల్డ్ అండ్ అగ్రెసివ్ లుక్‌నిస్తుంది. వీటితో పాటు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, బూట్ లిడ్‌పై ఎల్ఈడి లైట్ బార్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ మరియు ఎల్ఈడి స్టాప్ లైట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంకా ఇందులో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, చంకీ బాడీ క్లాడింగ్, రూఫ్ రైల్స్ ఉంటాయి.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, కియా భాగస్వామి హ్యుందాయ్ తమ వెన్యూ మోడల్‌లో ఉపయోగిస్తున్న వాటిని ఈ కొత్త కియా సోనెట్‌లోనూ ఉపయోగించే అవకాశం ఉంది. ఇది మూడు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కావచ్చని సమాచారం. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 డీజిల్ ఇంజన్ మరియు 1.0 టర్బో-పెట్రోల్ ఇంజన్‌లు ఉండొచ్చని అంచనా.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

ఈ మూడు ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఐవిటి ఆటోమేటిక్‌తో జతచేయబడి ఉంటుంది. ఇకపోతే, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షనల్ టార్క్ కన్వర్టర్‌తో 6-స్పీడ్ మాన్యువల్‌కు జతచేయబడి ఉంటుంది. టాప్-స్పెక్ వేరియంట్‌లో 1.0-లీటర్ టర్బో ఇంజన్‌ను ఐఎమ్‌టి లేదా 7-స్పీడ్ డిసిటితో ఆఫర్ చేసే అవకాశం ఉంది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ ఫొటో లీక్

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్స్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుతం కియా అందిస్తున్న సెల్టోస్ వాహనం మాదిరిగానే ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. సరికొత్త టెక్నాలజీతో నిండిన ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. కియా సోనెట్ ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యువీ300 వంటి మోడళ్లతో పాటుగా త్వరలో నిస్సాన్ నుంచి వచ్చే మాగ్నైట్ వంటి మోడళ్లకు కూడా పోటీగా నిలుస్తుంది.

Source: Indianauto

Article Published On: Tuesday, July 28, 2020, 16:46 [IST]
English summary
Spy images from Indian Auto reveal some of the features that were expected on the Kia Sonet. The images reveal a flat-bottom steering wheel with mounted controls for audio along and cruise controls, placed on either side. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+