రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

ఖరీదైన లగ్జరీ కార్ కలిగిన వాహనదారులు ఆ వాహనాలకు ఒక స్పెషల్ నెంబర్ ఉండాలనుకుంటారు. ఈ తరుణంలో ఆ నెంబర్ కోసం ఈత డబ్బు ఖర్చుపెట్టటడానికైనా వెనుకాడరు. ఇదే నేపథ్యంలో కేరళకు చెందిన ఒక యువకుడు ప్రత్యేక నంబర్‌ కోసం ఏకంగా 9 లక్షల రూపాయలు వెచ్చించాడు. మలప్పురం లైఫ్ స్టైల్ దీనిపై సమాచారాన్ని ప్రచురించింది.

రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

ఫ్యాన్సీ నెంబర్ కోసం, వారు కారుతో సమానంగా ఖర్చు చేస్తారు. కొన్నిసార్లు ఈ మొత్తం కారు ధర కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇటీవలే మలప్పురంలో కొండోట్టి అనే కొత్త ఆర్టీఓ కార్యాలయం ప్రారంభించబడింది.

రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

ఈ ఆర్టీఓ అధికారులు తమ కార్యాలయం యొక్క మొదటి రిజిస్ట్రేషన్ నంబర్ కెఎల్ 840001 ను వేలం వేయాలనుకున్నారు. వేలానికి హాజరైన మహ్మద్ రఫీక్ అనే యువకుడు ఆ నెంబర్‌ను సొంతం చేసుకున్నాడు. మహ్మద్ రఫీక్ తన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే కోసం ఈ నంబర్‌ను 9,01,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. కెఎల్ 840001 ఫ్యాన్సీ నంబర్ కోసం వేలానికి ఇద్దరు మాత్రమే హాజరయ్యారు.

MOST READ:వాహనాలకు HSRP నెంబర్ ప్లేట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా ?

రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

రఫీక్ తన కారుకు రోడ్ టాక్స్ గా రూ. 25 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఈ అంశాలన్నీ మలప్పురం లైఫ్ స్టైల్ ప్రచురించిన సమాచారంలో వెల్లడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపేని ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ. 1.20 కోట్లు.

రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

కొత్త ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే మునుపటి మోడల్ కంటే శక్తివంతమైనది. మెర్సిడెస్ బెంజ్ ఈ కారులో తేలికపాటి హైబ్రిడ్ సిస్టం ను అందిస్తుంది. ఈ సిస్టం ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని మరియు పనితీరును పెంచడానికి సహాయపడుతుంది.

MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్‌లోనే వెళ్తారు

రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

ఈ కారుకు 3.0 లీటర్ ట్విన్-టర్బో 6 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ హైబ్రిడ్ ఇంజన్ 435 బిహెచ్‌పి పవర్ మరియు 530 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మిషన్ యూనిట్‌తో జత చేయబడింది.

రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

కొత్త ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 కూపే కారు గంటకు 250 కిమీ వేగంతో ఉంటుంది. 5.3 సెకన్లలో కారు గంటకు 0 - 100 కిమీ నుండి వేగవంతం అవుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

MOST READ:ఒకే కారుని 14 సార్లు అమ్మిన ఘరానా మోసగాడు.. ఇంతకీ ఇది ఎలా జరిగిందో తెలుసా

Most Read Articles

English summary
Kondotty RTO Office Gets Huge Amount In First Registration Number Auction. Read in Telugu.
Story first published: Thursday, November 5, 2020, 9:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X