ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!

ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లలో లంబోర్గిని ఒకటి. ఇటువంటి విలాసవంతమైన కార్లను చాల మంది వాహనప్రియులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లంబోర్ఘిని హురాకాన్ కారు ఇండియన్ మార్కెట్లో విడుదలైనది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!

లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. కొత్త లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి యొక్క ప్రారంభ ధర రూ. 3.22 కోట్ల రూపాయలతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) అందించబడుతుంది.

ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!

లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి భారతీయ మార్కెట్లో బ్రాండ్ యొక్క తాజా సూపర్ కార్. స్టాండర్డ్ ఆల్-వీల్-డ్రైవ్ మోడల్‌తో పోలిస్తే దాని ఏరోడైనమిక్స్‌లో చిన్న చిన్న మార్పులను కలిగి ఉంది.

ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!

హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడిలో చేసిన కొన్ని చిన్న మార్పులను గమనించినట్లయితే ఇందులో కొత్త ఫ్రంట్ స్ప్లిటర్, ఫ్రంట్ ఎయిర్ ఇంటేక్ వంటివి ఉన్నాయి. ఈ సూక్ష్మ మార్పులన్నీ హురాకాన్ ఇవో యొక్క ఆర్‌డబ్ల్యుడి వెర్షన్‌కు మెరుగైన ఏరోడైనమిక్స్ మరియు స్థిరత్వాన్ని అందిస్తాయి.

ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!

లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడిలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఇతర కనెక్టివిటీ ఫీచర్స్ తో కూడిన 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. ఇది పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పిరెల్లి పి-జీరో రబ్బరుతో చుట్టబడిన ప్రామాణిక 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!

హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి క్యాబిన్ చుట్టూ అల్కాంటారా మరియు లెదర్ అప్హోల్స్టరీ ఉంటుంది. లంబోర్ఘిని తన వినియోగదారులకు సూపర్ కార్లను కొనుగోలు చేసే ప్రతి వ్యక్తికి కార్బన్-ఫైబర్ ప్యాక్‌లతో పాటు అనుకూలీకరించదగిన ఎంపికలను కూడా అందిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!

హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి లోని భద్రతా లక్షణాలలో ఎయిర్‌బ్యాగులు, ESP, పెర్ఫార్మెన్స్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఎబిఎన్ విత్ ఇబిడి ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!

ఇప్పటి వరకు అన్ని హురాకాన్ మోడళ్లలో ఉపయోగించే 5.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 ఇంజిన్ ఇందులో ఉంది. ఇది 610 బిహెచ్‌పి మరియు 560 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది లంబోర్ఘిని స్టాండర్డ్ ఇవో మోడల్ కంటే 30 బిహెచ్‌పి మరియు 40 ఎన్ఎమ్ టార్క్ తక్కువగా ఉంటుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!

లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి గంటకు 325 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది పేర్కొంది. 0 నుంచి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కేవలం 3.3 సెకండ్లు మాత్రమే పడుతుంది. అదే విధంగా 0 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణించడానికి 9.3 సెకన్ల కాలం పడుతుంది.

ఇండియన్ మార్కెట్లో లంబోర్ఘిని ఇవో ఆర్‌డబ్ల్యుడి రేటెంతో తెలుసా!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

ఇటాలియన్ సూపర్ కార్ తయారీదారు లంబోర్ఘిని హురాకాన్ ఇవో పరిధిని ఇండియన్ మార్కెట్లో విస్తరించారు. కొత్త హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి ను హురాకాన్ ఇవో ఎడబ్ల్యుడి మరియు ఇవో స్పైడర్‌తో పాటు విక్రయిస్తారు. ఇప్పటికే ఈ కారు భారత మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇతర మోడళ్ల మాదిరిగానే, లంబోర్ఘిని హురాకాన్ ఇవో ఆర్‌డబ్ల్యుడి, మెర్సిడెస్-ఎఎమ్‌జి జిటి-ఆర్ మరియు రాబోయే ఫెరారీ ఎఫ్ 8 ట్రిబ్యూటో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 29, 2020, 15:54 [IST]
English summary
Lamborghini Huracan EVO RWD Launched In India: Prices Start At Rs 3.22 Crore. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+