Just In
- 10 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 12 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 14 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 15 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ దక్కించుకున్న 2020 ల్యాండ్ రోవర్ డిఫెండర్
టాటా మోటార్స్‌కి చెందిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న కొత్త 2020 డిఫెండర్ ఎస్‌యూవీ యూరో ఎన్‌సిఎపి ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కొత్త 2020 ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మోడల్ ఎస్‌యూవీని ఈ పరీక్షల కోసం ఉపయోగించారు. ఈ పరీక్షల్లో ఇది అద్భుతమైన సేఫ్టీ రేటింగ్‌లను పొంది, బ్రాండ్ యొక్క అత్యంత సమర్థవంతమైన మరియు మన్నికైన మోడల్‌గా నిలిచింది.

కొత్త 2020 ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రమాద సమయంలో వయోజనులు మరియు పిల్లల రక్షణలో 85 శాతం, భద్రతా సహాయకులకు 79 శాతం మరియు ప్రమాదకరమైన రహదారి వినియోగదారులకు 71 శాతం సేఫ్టీ స్కోరును దక్కించుకున్నట్లు ఈ టెస్ట్ రిజల్ట్స్ వెల్లడించాయి. ఈ మొత్తం ఫలితాలతో ఇది ఫైవ్-స్టార్ రేటింగ్‌ను సాధించింది.
MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

ల్యాండ్ రోవర్ అందిస్తున్న ఈ కొత్త 2020 డిఫెండర్ మోడల్‌లో అనేక సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇది అత్యాధునిక అల్ట్రా-స్టిఫ్ అల్యూమినియం-ఇంటెన్సివ్ బాడీ నిర్మాణాన్ని కలిగి ఉండి, ఎలాంటి భూభాగాలపైనైనా అద్భుతమైన భద్రతను అందించేలా దీనిని తయారు చేశారు.

డిఫెండర్ ఎస్‌యూవీని 90 మరియు 110 అనే రెండు మోడళ్లలో అందిస్తున్నారు. ఇందులో అనేక స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం కారులోని ప్రయాణీకులకే కాకుండా చుట్టుపక్కల ఉండే వారికి కూడా భద్రతనిస్తుంది.
MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

ఈ కార్లలో అత్యవసర బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ కొలైజన్ మోనిటర్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, డ్రైవర్ కండిషన్ మోనిటర్ మరియు 360-డిగ్రీ కెమెరా మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, మూడు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ పాయింట్స్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.

ఈ విషయంపై జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క ప్రొడక్ట్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిక్ రోజర్స్ మాట్లాడుతూ, కేవలం డిఫెండర్ యజమానుల భద్రతను మాత్రమే కాకుండా, ఇతర రహదారి వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త 2020 డిఫెండర్ ఎస్‌యూవీని సృష్టించామని చెప్పారు.
MOST READ:డ్రీమ్ కార్‌లో కనిపించిన రిషబ్ శెట్టి.. అతని డ్రీమ్ నిజం చేసినది ఎవరో తెలుసా ?

ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ డ్రైవర్ అనుభవాన్ని మెరుగుపరిచే అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో, ఇప్పటివరకు తయారు చేసిన వాటిలో కెల్లా అత్యంత సమర్థవంతమైనది మరియు మన్నికైనదని ఆయన అన్నారు. యూరో ఎన్‌సిఎపిలో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ సేఫ్టీ రేటింగ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
కొత్త 2020 ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో మరియు అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో తయారైంది. ప్రతి ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అధునాతన టెక్ సేఫ్టీ ఫీచర్లతో ఈ కారును తయారు చేసినట్లు కంపెనీ చెబుతోంది. భారత మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర రూ.73.98 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా) నుండి ప్రారంభమవుతుంది. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ మరియు జీప్ వ్రాంగ్లర్ రూబికాన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని ఉరుస్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన తమిళ్ తలైవా రజినీకాంత్