బిఎస్ 6 మహీంద్రా ఆల్తూరస్ జి 4 ఎస్‌యువి : ధర & ఇతర వివరాలు
మహీంద్రా తన బిఎస్ -6 ఆల్తూరస్ జి 4 ఎస్‌యువిని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త మహీంద్రా ఆల్తూరస్ జి 4 ఎస్‌యూవీ ధర రూ. 28.69 లక్షలు. ఈ కొత్త మహీంద్రా ఆల్తూరస్ జి 4 ఎస్‌యువిని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మహీంద్రా బిఎస్ -6 కాలుష్య నియమాలకు అనుకూలనగా ఈ ఎస్‌యువీని నవీనీకరించింది. ఈ మహీంద్రా ఆల్తూరస్ లో ఒక్క బిఎస్ 6 అప్గ్రేడ్ తప్ప మరే ఇతర మార్పులు జరగలేదు.

మహీంద్రా ఆల్తూరస్ జి 4 ఎస్‌యువిలో 2.2-లీటర్ ఇ-ఎక్స్‌డి 220 టర్బోచార్జ్డ్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 180-బిహెచ్‌పి శక్తిని మరియు 420 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ కొత్త మహీంద్రా ఆల్తూరస్ ని బిఎస్ -6 కాలుష్య నియమానికి అప్‌గ్రేడ్ చేసినప్పటికీ శక్తి మరియు టార్క్ గణాంకాలు మారలేదు. బిఎస్ -6 మహీంద్రా ఆల్తూరస్ జి 4 ఎస్‌యూవీలో ఇంజిన్ అప్‌గ్రేడ్‌లు కాకుండా కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఉండవచ్చు. మునుపటి మోడళ్లతో పోలిస్తే కొత్త మోడళ్ల ధర రూ. 1 లక్ష అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.

కొత్త మహీంద్రా ఆల్తూరస్ జి 4 ఎస్‌యూవీ మునుపటి మోడల్‌కు సమానమైన లక్షణాలను కలిగి ఉంది. ఇండియన్ బ్రాండ్ యొక్క ఈ పూర్తి స్థాయి ఎస్‌యూవీలో చాలా ప్రీమియం మరియు లగ్జరీ ఫీచర్లు కలిగి ఉన్నాయి.

బిఎస్ -6 మహీంద్రా ఆల్తూరస్ జి 4 ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ముందు సీట్లు, టెయిల్‌గేట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది.

బీఎస్ -6 మహీంద్రా ఆల్తూరస్ జీ 4 ఎస్‌యువీతో భద్రతకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇందులో తొమ్మిది ఎయిర్‌బ్యాగులు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎబిఎస్ విత్ ఇబిడి, క్రూయిస్ కంట్రోల్, హై స్పీడ్ అలర్ట్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఉన్నాయి.

బిఎస్ -6 మహీంద్రా ఆల్తూరస్ జి 4 ఎస్‌యువి భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్, స్కోడా కోడియాక్ మరియు వోక్స్వ్యాగన్ టిగువాన్ ఆల్ స్పేస్ ఎస్‌యువిలకి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








