ఇకపై నేరుగా మహీంద్రానే వాహనాలను కస్టమైజ్ చేస్తుంది; డీటేల్స్

కస్టమర్లు తమ వాహనాలు ప్రత్యేకంగా కనిపించడం కోసం వాటిని తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేయించుకుంటుంటారు. ఇందుకోసం కస్టమర్లు థర్డ్ పార్టీ కార్ కస్టమైజేషన్ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో, దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా తమ కస్టమర్ల కోసం అధీకృత కార్ కస్టమైజేషన్ సేవలను ప్రారంభించింది.

ఇకపై నేరుగా మహీంద్రానే వాహనాలను కస్టమైజ్ చేస్తుంది; డీటేల్స్

మహీంద్రా తాజాగా ఓ కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ సాయంతో భారతదేశంలోని మహీంద్రా కస్టమర్లు తమ ఎస్‌యూవీలను మోడిఫై చేసుకోవటం లేదా తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవటం వంటివి చేయవచ్చు. మహీంద్రా అందిస్తున్న థార్, స్కార్పియో మరియు బొలెరో మోడళ్ల కోసం కంపెనీ కస్టమైజేషన్ ఆప్షన్లను అందిస్తోంది.

ఇకపై నేరుగా మహీంద్రానే వాహనాలను కస్టమైజ్ చేస్తుంది; డీటేల్స్

మహీంద్రా కొత్తగా ప్రారంభించిన వెబ్‌సైట్ లో ప్రతి ఎస్‌యూవీ కోసం అనేక కస్టమైజేషన్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. ముందుగా మహీంద్రా థార్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ కోసం ఐదు కస్టమైజేషన్ ప్యాకేజీలను కంపెనీ అందిస్తోంది. అవి: అడ్వెంచర్ (హార్డ్‌టాప్, ఓపెన్‌టాప్ లేదా సాఫ్ట్‌టాప్), థార్ బైసన్, థార్ బగ్గీ, థార్ మిడ్‌నైట్ మరియు డేబ్రేక్ (హార్డ్‌టాప్ లేదా సాఫ్ట్‌టాప్).

MOST READ:లాంగ్ డ్రైవ్ చేయాలనుకునే వారికి 5 ఉత్తమ పర్యాటక ప్రదేశాలు & ఉత్తమ బైక్‌లు ఇవే

ఇకపై నేరుగా మహీంద్రానే వాహనాలను కస్టమైజ్ చేస్తుంది; డీటేల్స్

అదేవిధంగా, మహీంద్రా స్కార్పియో మరియు బొలెరో కూడా వివిధ రకాల మోడిఫికేషన్ ప్యాకేజీలు ఉన్నాయి. స్కార్పియో కోసం నాలుగు ప్యాకేజీలు లభిస్తాయి. అవి: డార్క్‌హార్స్, లైఫ్ స్టైల్, మౌంటైనీర్ మరియు ఎక్స్‌ట్రీమ్. అలాగే, మహీంద్రా బొలెరో కూడా నాలుగు ప్యాకేజీలతో లభిస్తుంది. అవి: యాటిట్యూడ్, స్ట్రింగర్, ఎక్స్‌క్లూజివ్ మరియు లిమిటెడ్-ఎడిషన్‌.

ఇకపై నేరుగా మహీంద్రానే వాహనాలను కస్టమైజ్ చేస్తుంది; డీటేల్స్

మహీంద్రా పేర్కొన్న సమాచారం ప్రకారం, తమ ఎస్‌యూవీలను కస్టమైజ్ లేదా మోడిఫై చేయించుకోవటానికి ఆసక్తి ఉన్న కస్టమర్లు తమ వాహనాలను ముంబైలోని బ్రాండ్ స్టూడియోకు తీసుకురావల్సి ఉంటుంది. తమ వాహనాన్ని ముంబై వరకూ రావణా చేయటానికి లాజిస్టిక్స్ సహాయం కోసం కస్టమైజేషన్ స్టూడియో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌ను సంప్రదించవచ్చు.

MOST READ:2 కి.మీ కార్ బోనెట్ మీద వేలాడుతూ వెళ్లిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ , ఎందుకో మీరే చూడండి

ఇకపై నేరుగా మహీంద్రానే వాహనాలను కస్టమైజ్ చేస్తుంది; డీటేల్స్

కస్టమర్లు తమ నగరాల్లోని మహీంద్రా ఎస్‌యూవీలను కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిని స్టూడియోకి పంపించాల్సి ఉంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేసిన వారికే కాకుండా, ఇప్పటికే మహీంద్రా వాహనాలను కలిగి ఉన్న కస్టమర్ల కోసం కూడా కంపెనీ ఈ కస్టమైజేషన్ సేవలను అందిస్తోంది.

ఇకపై నేరుగా మహీంద్రానే వాహనాలను కస్టమైజ్ చేస్తుంది; డీటేల్స్

అయితే, ఇలాంటి వాహనాలు కస్టమైజేషన్ ప్రక్రియకు ముందు ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ కావల్సి ఉంటుంది. సదరు ఎస్‌యూవీలు మెకానికల్‌గా దృఢంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని కస్టమైజే చేస్తారు.

థార్, స్కార్పియో మరియు బొలెరో మోడళ్లే కాకుండా, మహీంద్రా విక్రయిస్తున్న ఇతర మోడళ్లలో కూడా కస్టమైజేషన్ కిట్‌లను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వీటిలో టియూవీ300, ఎక్స్‌యూవీ500 మరియు కెయూవీ100 మోడళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.

MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్‌టి స్పోర్ట్ ట్రిమ్ వేరియంట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇకపై నేరుగా మహీంద్రానే వాహనాలను కస్టమైజ్ చేస్తుంది; డీటేల్స్

కస్టమైజేషన్ ప్యాకేజీలతో పాటు, ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్లలో కూడా మహీంద్రా విస్తృతమైన పర్సనలైజ్డ్ మోడిఫికేషన్లను అందిస్తోంది. ఎక్స్‌టీరియర్ మార్పులలో విభిన్న ఫ్రంట్ గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, టెయిల్ లైట్స్, అల్లాయ్ వీల్స్, రోల్ బార్స్, రాక్ స్లైడర్స్, బుల్ బార్స్, వించ్, స్నార్కెల్స్ మొదలైనవి ఎన్నో ఉన్నాయి.

అదేవిధంగా, ఈ ఎస్‌యూవీలలోని ఇంటీరియర్స్ కోసం జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్, హెడ్‌రెస్ట్‌ల వెనుక భాగంలో డివిడి డిస్‌ప్లే, ప్రీమియం లెదర్ అప్‌హోలెస్ట్రీ, రీడిజైన్డ్ డోర్ ట్రిమ్స్ అండ్ సెంటర్ కన్సోల్, కస్టమైజ్డ్ ఫ్లోర్ మ్యాట్స్, మూడ్ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.

ఇకపై నేరుగా మహీంద్రానే వాహనాలను కస్టమైజ్ చేస్తుంది; డీటేల్స్

మహీంద్రా కార్ కస్టమైజేషన్ సేవలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా కార్లు, ముఖ్యంగా థార్, స్కార్పియో మరియు బొలెరో వంటి మోడళ్లు ఇప్పటికే కస్టమైజేషన్ మరియు మోడిఫికేషన్ రంగంలో చాలా ప్రసిద్ది చెందినవి. ఈ విషయాన్ని గ్రహించిన మహీంద్రా ఎట్టకేలకు తమ ఎస్‌యూవీలను తామే స్వయంగా మోడిఫై చేయాలని నిర్ణయించుకుంది. తమ మహీంద్రా వాహనాలను ప్రత్యేకంగా, స్టైలిష్‌గా కనిపించేలా తయారు చేయించుకోవాలనుకునే వారికి నిజంగా ఇదొక గొప్ప అవకాశం.

MOST READ:'స్కైడ్రైవ్ ఎస్‌డి-03' ఫ్లయింగ్ కార్ పరీక్షలు విజయవంతం; నెక్స్ట్ ఏంటి?

Most Read Articles

English summary
Mahindra has launched a new website, which offers customers modification & customisation options of their various SUVs in India. The modification and customisation options are currently offered on the Thar, Scorpio and Bolero models. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X