కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన మహీంద్రా

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆటో దిగ్గజం మహీంద్రా & మహీంద్రా దేశంలో COVID-19 కి వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు ఇస్తున్న కామపెనీలలో ముందున్న వారిలో ఒకరు. కరోనా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడటానికి మహీంద్రా కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది.

కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వానికి మద్దతుగా మహీంద్రా

దేశవ్యాప్తంగా వెంటిలేటర్లు మరియు ఇతర పిపిఇ పరికరాల ఉత్పత్తి మరియు పంపిణీని పెంచడానికి సంస్థ వివిధ ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోంది. మహీంద్రా కంపెనీ ఫేస్ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్స్ మరియు ఏరోసోల్ బాక్స్‌ల వంటి వాటిని వైద్య నిపుణులు మరియు ఆరోగ్య సంరక్షణ అధికారులకు పంపిణీ చేస్తోంది. మహీంద్రా కూడా పేదవారికి వివిధ ప్రదేశాలలో నిరాశ్రయులకు మరియు వలస కూలీలకు ఫుడ్ ప్యాకెట్లను కూడా విరాళంగా ఇచ్చారు.

కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వానికి మద్దతుగా మహీంద్రా

మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా ఇటీవల తన సహచరుల కృషికి ఫలితంగా వారిని మహీంద్రా యొక్క COVID-19 యోధులు అని పిలిచారు. గత మూడు నెలల్లో 4 లక్షల ఫేస్ షీల్డ్స్, 12 లక్షల ఫేస్ మాస్క్‌లు మరియు 600 కి పైగా ఏరోసోల్ బాక్సులతో పాటు, అవసరమైన వారికి 2.5 లక్షల భోజనం పంపిణీ చేయగలిగింది.

MOST READ:డామినార్ 250 బైక్ టివిసి విడుదల చేసిన బజాజ్ ఆటో

కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వానికి మద్దతుగా మహీంద్రా

ఇటీవల మహీంద్రా 12 మొబైల్ అంబులెన్స్‌లను మహారాష్ట్రలోని ముంబై నగరంలో కరోనా బాధితుల సేవలకు అందించింది. COVID-19 రోగులు చికిత్స మరియు వైద్య సదుపాయాలను వేగంగా పొందగలిగేలా కొత్త మహీంద్రా సుప్రో అంబులెన్స్‌లను రాష్ట్రంలో పంపిణీ చేసింది. ఈ ఆంబులెన్సుల ద్వారా వేగవంతమైన వైద్య సేవలు అందించగలుగుతున్నారు.

కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వానికి మద్దతుగా మహీంద్రా

ఈ అంబులెన్స్‌లను ఆదిత్య ఠాక్రేకు అందజేశారు. మహీంద్రా భారత మార్కెట్లో సుప్రో అంబులెన్స్‌ను లాంచ్ చేయడానికి కూడా ముందడుగు వేసింది. మొదటి బ్యాచ్ అంబులెన్సులను మహారాష్ట్రలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది.

MOST READ:భారత్ & చైనా వివాదం : ఆలస్యమైన హైమా బర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్

కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వానికి మద్దతుగా మహీంద్రా

మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఇతర నివేదికల ప్రకారం మహీంద్రా ఎక్స్‌యువి 500, స్కార్పియో మరియు థార్ ఎస్‌యూవీల విడుదల తేదీలను ధృవీకరించింది. కొత్త తరం థార్ ఈ ఏడాది చివర్లో లాంచ్ అవుతుందని, తరువాత తరం ఎక్స్‌యూవీ 500, స్కార్పియో వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరంలో విక్రయించబడే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వానికి మద్దతుగా మహీంద్రా

కొత్త మహీంద్రా థార్ కరోనా లాక్ డౌన్ ముగిసిన వెంటనే అమ్మకాలు జరపనున్నట్లు భావించవచ్చు. ఏదేమైనా COVID-19 మహమ్మారి మరియు పొడిగించిన లాక్ డౌన్ నిబంధనల మధ్య మహీంద్రా టెస్ట్ తరువాతి తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకుంది.

MOST READ:హ్యుందాయ్ కంపెనీ ఫస్ట్ మినీ ఎలక్ట్రిక్ బస్

కరోనా ఎఫెక్ట్ : ప్రభుత్వానికి మద్దతుగా మహీంద్రా

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశంలో కరోనా మహమ్మారిపై పోరాడటానికి కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడంలో మహీంద్రా కంపెనీ చాలా కృషి చేస్తోంది. ఈ కంపెనీ పేస్ మాస్కులు, పేస్ షీల్డ్ లు వంటి వాటిని అందించడమే కాకుండా వైద్య సేవలను మరింత త్వరితగతిన జరపడానికి మహీంద్రా అంబులెన్సులు కూడా అందించింది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి సమయంలో మహీంద్రా కంపెనీ తన మద్దతు తెలిపి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలిచింది.

Most Read Articles

English summary
COVID-19 Pandemic: Mahindra Distributes Over 12 Lakh Masks & 4 Lakh Face Shields In 3 Months. Read in Telugu.
Story first published: Wednesday, July 1, 2020, 16:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X