మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ విడుదల: ధర తెలిస్తే అస్సలు నమ్మరు!!
ఆటో ఎక్స్‌పో 2020లో మహీంద్రా ఇకెయువి100 ఎలక్ట్రిక్ కారు విడుదలయ్యింది. దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశపు చీపెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఇకెయువి100 (eKUV100) ని మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ ధర రూ. 8.25 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా).

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2018లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ఆవిష్కరించి. సరిగ్గా రెండేళ్ల తరువాత అమ్మకాలకు సిద్దంగా పూర్తి స్థాయిలో దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఇండియన్ రోడ్లు, వాతావరణ మరియు పరిస్థితులకు అనుగుణంగా బ్యాటరీ సిస్టమ్‌ను అభివృద్ది చేసినట్లు మహీంద్రా తెలిపింది.

మహీంద్రా ఇకెయువి100 ఎస్‌యూవీలో సాంకేతికంగా 40kW సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ కలదు, ఇది గరిష్టంగా 53బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 15.9kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ సింగల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 120కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు ఉన్నాయి. అన్ని రకాల ప్లబ్ పిన్నులతో దీనిని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇళ్లు, ఆఫీసు మరియు అన్ని ఇతర ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి ఛార్జింగ్ పెట్టొచ్చు.

డిజైన్ విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ కెయువి100 చూడటానికి అచ్చం పెట్రోల్/డీజల్ వెర్షన్ కెయువి100 ఎస్‍యూవీనే పోలి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ కావడంతో, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ లైట్లు వచ్చాయి.

మహీంద్రా ఇకెయువి100 ఇంటీరియర్‌లో కూడా ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే విశాలమైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లేటెస్ట్ ఫీచర్లు వచ్చాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ప్యాసింజర్ కార్ల మార్కెట్లో పలు విదేశీయ కంపెనీలతో తీవ్రపోటీని ఎదుర్కుంటోంది. అయితే, ఇప్పటి వరకూ మరే ఇతర కంపెనీకి సాధ్యం కాని విధంగా భారతదేశపు చీపెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఇకెయువి100 ఎస్‌యూవీని లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతానికైతే ఈ మోడల్‌కు ఎలాంటి లేనప్పటికీ, మారుతి సుజుకి త్వరలో విడుదల చేయనున్న వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కాస్త పోటీనిచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








