Just In
- 1 hr ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 1 hr ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 2 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 3 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Sports
ఇంగ్లండ్ ఓటమిని ఎగతాళి చేసిన ఆ దేశ మహిళా క్రికెటర్.. మండిపడ్డ పురుష క్రికెటర్లు!
- News
ఏపీ మున్సిపల్ పోరుకు లైన్ క్లియర్- 16 పిటిషన్లను తోసిపుచ్చిన హైకోర్టు
- Movies
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్‌కు ఫోన్ చేశా: మంచు విష్ణు
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డ్యూయెల్ టోన్‌లో మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టి విడుదల: ధర, ఫీచర్లు
ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తం ఎంట్రీ లెవల్ మోడల్ "కెయువి100 ఎన్‌ఎక్స్‌టి"లో కంపెనీ సైలెంట్‌గా ఓ డ్యూయెల్ టోన్ మోడల్‌ను విడుదల చేసింది. మార్కెట్లో మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి డ్యూయల్ టోన్ మోడల్ ప్రారంభ ధర రూ.7.35 లక్షలు, ఎక్స్‌షోరూమ్, ఢిల్లీగా ఉంది.

మహీంద్రా ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌లో కెయువి100 ఎన్ఎక్స్‌టి పెయింట్ స్కీమ్‌లను అప్‌డేట్ చేసింది. మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి ఎస్‌యూవీ ఇప్పుడు మోనో-టోన్ కలర్ ఆప్షన్స్‌తో పాటు సిల్వర్ / బ్లాక్ మరియు రెడ్ / బ్లాక్ అనే డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్‌లలో కూడా లభిస్తుంది. అయితే, డ్యూయెల్-టోన్ ఆప్షన్లు టాప్-ఎండ్ కె8 వేరియంట్‌లో మాత్రమే ప్రత్యేకంగా లభిస్తాయి.

కెయువి100 ఎన్ఎక్స్‌టిలోని డ్యూయెల్-టోన్ కలర్ ఆప్షన్స్ కోసం కస్టమర్లు అదనంగా రూ.7,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మోడల్‌లో లభించే మోనో-టోన్ కలర్ ఆప్షన్లలో పెరల్ వైట్, డాజ్లింగ్ సిల్వర్, ఫ్లేమ్‌బాయ్‌యాంట్ రెడ్, ఫైరీ ఆరెంజ్, డిజైనర్ గ్రే మరియు మిడ్‌నైట్ బ్లాక్‌లు ఉన్నాయి.
MOST READ:20 సంవత్సరాల తర్వాత కూడా కొత్తగా ఉన్న పాత కారు.. ఇది ఒక పొలిటికల్ లీడర్ ఇష్టమైన కార్ కూడా

ఈ మోనో-టోన్ పెయింట్ స్కీమ్స్ అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఇందులో కె2+, కె4+, కె6+ మరియు కె8 మోడళ్లు ఉన్నాయి. ఈ నాలుగు వేరియంట్‌లలో సింగిల్ 1.2-లీటర్ ఎమ్‌ఫాల్కాన్ జి80 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 82 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 115 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మహీంద్రా కెయువి100 ఎన్ఎక్స్‌టిలో కొత్త డ్యూయెల్-టోన్ పెయింట్ స్కీమ్ మినహా వేరే ఇతర మార్పులు ఏవీ లేవు. మార్కెట్లో బిఎస్6 కంప్లైంట్ బేస్ వేరియంట్ (కె2+) ధర రూ.5.54 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.
MOST READ:హోండా హైనెస్ సిబి 350 బైక్ డెలివరీస్ స్టార్ట్

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి డ్యూయెల్ టోన్ మోడల్‌లో ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, పడల్ ల్యాంప్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఇంటీరియర్ మూడ్ లైటింగ్ , ఫాగ్ లాంప్స్, కూల్డ్ గ్లౌవ్‌బాక్స్ మొదలైన ఫీచర్లను పొందవచ్చు.

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ సబ్-4 మీటర్ కాంపాక్ట్-ఎస్‌యూవీ. ఇది ఈ విభాగంలో మంచి ప్రజాదరణ పొందిన ఎక్స్‌యువి300 మోడల్‌తో పాటు విక్రయించబడుతుంది. అయితే, ధర పరంగా చూస్తే కెయువి100 ఎన్‌ఎక్స్‌టి మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
MOST READ:గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ కారులో ప్రయాణించాలనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి డ్యూయెల్ టోన్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి ఇప్పటి వరకూ సింగిల్ టోన్ కలర్‌లో మాత్రమే లభ్యమయ్యేది. ఇప్పుడు ఇది డ్యూయెల్ టోన్ కలర్‌తో మరింత స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంది. ఇందులో ఈ కొత్త కలర్ ఆప్షన్లను విడుదల చేయటం ద్వారా, ప్రస్తుత పండుగ సీజన్‌లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.