మహీంద్రా మరాజో బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు
దేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అందిస్తున్న మరాజో ఎమ్‌పివిలో కంపెనీ లేటెస్ట్ బిఎస్6 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2020 మహీంద్రా మరాజో బిఎస్6 ధర రూ.11.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

మహీంద్రా మరాజో బిఎస్6 ఇప్పుడు మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి: ఎమ్2, ఎమ్4+ మరియు ఎమ్6+. వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
-> మరాజో ఎమ్2 - రూ.11.25 లక్షలు
-> మరాజో ఎమ్4+ - రూ.12.37 లక్షలు
-> మరాజో ఎమ్6+ - రూ.13.51 లక్షలు
-> (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

మరాజో వేరియంట్ లైనప్‌లో కంపెనీ ఇదివరకు ఆఫర్ చేసిన ఎమ్8 వేరియంట్‌ను మహీంద్రా నిలిపివేసింది. కొత్త 2020 మహీంద్రా మరాజో ఎమ్‌పివిలో కొత్త బిఎస్6 ప్లైంట్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 121 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ప్రస్తుతానికి మహీంద్రా మరాజో బిఎస్6 కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానుంది. ఇందులో పెట్రోల్ వెర్షన్‌ను కూడా విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కొత్త బిఎస్6 మరాజోలో అప్‌డేట్ చేసిన డీజిల్ ఇంజన్ మినహా వేరే ఏ ఇతర మార్పులు లేవు. మహీంద్రా మరాజో బిఎస్6లో దాని మునుపటి బిఎస్4 మోడల్ డిజైన్‌ను మరియు ఫీచర్లను అలానే కొనసాగిస్తుంది.

ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఫాగ్ ల్యాంప్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, స్టైలిష్ డైమండ్-కట్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రియర్ ఫాగ్ ల్యాంప్స్, అడాప్టివ్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్‌వ్యూ పార్కింగ్ కెమెరా మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త మహీంద్రా మరాజో బిఎస్6 ఇంటీరియర్స్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రీమియం సీట్ అప్‌హోలెస్ట్రీ, ఏడుగురు ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చునేలా డిజైన్ చేసిన విశాలమైన క్యాబిన్, వెనుక సీటు ప్యాసింజర్స్ కోసం ఏసి వెంట్స్, ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2020 మహీంద్రా మరాజో బిఎస్6 ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి: మెరైనర్ మెరూన్, ఐస్‌బర్గ్ వైట్, షిమ్మరింగ్ సిల్వర్, ఓషియానిక్ బ్లాక్ మరియు ఆక్వా మెరైన్. కస్టమర్లు ఇప్పుడు ఎమ్‌పివిని ఆన్‌లైన్‌లో కానీ లేదా భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఏదైనా మహీంద్రా డీలర్‌షిప్ వద్ద కానీ బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే బిఎస్6 మహీంద్రా మరాజో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

మహీంద్రా మారాజో బిఎస్6 విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో మహీంద్రా బ్రాండ్‌కు మరాజో ప్రీమియం ఎమ్‌పివిగా ఉంది. ఇది ఈ విభాగంలో టొయోటా ఇన్నోవా క్రిస్టా, మారుతి సుజుకి ఎర్టిగా మరియు రెనాల్ట్ ట్రైబర్ వంటి 7-సీటర్ మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications