మహీంద్రా మరాజో బిఎస్6 ప్రొడక్షన్ ప్రారంభం; అతి త్వరలోనే విడుదల!

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అందిస్తున్న మరాజో ఎమ్‌పివిలో కంపెనీ కొత్త బిఎస్6 వెర్షన్‌ను అతి త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ కొత్త మోడల్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. వాస్తవానికి ఈపాటికే ఈ మోడల్ మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19, లాక్‌డౌన్‌ల వలన అదికాస్తా ఆలస్యమైంది.

మహీంద్రా మరాజో బిఎస్6 ప్రొడక్షన్ ప్రారంభం; అతి త్వరలోనే విడుదల!

కార్అండ్‌బైక్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, కొత్త బిఎస్6 మహీంద్రా మరాజో ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ వార్తను కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ సీఈఓ వీజయ్ రామ్ నక్రా ధృవీకరించారు. మరోవైపు కొత్త మరాజో బిఎస్‌6 ఎమ్‌పివి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్ కేంద్రాలను కూడా చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా మరాజో బిఎస్6 ప్రొడక్షన్ ప్రారంభం; అతి త్వరలోనే విడుదల!

మహీంద్రా మరాజో బిఎస్6లో మునుపటి బిఎస్4 మోడల్‌తో పోలిస్తే కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండనున్నాయి. ఇది వరకు లీక్ అయిన వివరాల ప్రకారం, మహీంద్రా మరాజో ఎమ్4+ వేరియంట్‌లో బ్లూటూత్ ఎనేబుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ మరియు అల్లాయ్ వీల్స్ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మోడల్ విడుదల సమయంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

MOST READ:ల్యాండ్ రోవర్ ని కాపాడిన మహీంద్రా థార్, ఎలాగో వీడియో చూడండి

మహీంద్రా మరాజో బిఎస్6 ప్రొడక్షన్ ప్రారంభం; అతి త్వరలోనే విడుదల!

మహీంద్రా మరాజో ఎమ్‌పివిలో మునుపటి బిఎస్4 మోడళ్లలో ఉపయోగించిన 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌నే బిఎస్6కి అప్‌గ్రేడ్ చేసి ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. బిఎస్4 మోడళ్లలోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 121 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

మహీంద్రా మరాజో బిఎస్6 ప్రొడక్షన్ ప్రారంభం; అతి త్వరలోనే విడుదల!

అయితే, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మహీంద్రా తమ మరాజో ఎమ్‌పివి బిఎస్6 డీజిల్ యూనిట్‌తో పాటుగా కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో ఆఫర్ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మహీంద్రా కొరియన్ భాగస్వామి అయిన శాంగ్‌యాంగ్ అందిస్తున్న కొరాండో కారులో ఉపయోగించిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను మరాజోలో ఉపయోగించవచ్చని తెలుస్తోంది.

MOST READ:కారులో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లండి

మహీంద్రా మరాజో బిఎస్6 ప్రొడక్షన్ ప్రారంభం; అతి త్వరలోనే విడుదల!

ఈ టర్బో పెట్రోల్ ఇంజన్ 162 బిహెచ్‌పి శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇదే గనుక నిజమైతే, మహీంద్రా మరాజో బిఎస్6 మోడల్ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది. మరాజో మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఒకే ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యమయ్యేది.

మహీంద్రా మరాజో బిఎస్6 ప్రొడక్షన్ ప్రారంభం; అతి త్వరలోనే విడుదల!

మహీంద్రా మరాజో ఆరు వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ బిఎస్6 ఎమ్‌పివి మునుపటి మోడల్ మాదిరిగానే ఏడు సీట్లు మరియు ఎనిమిది సీట్ల కాన్ఫిగరేషన్‌తో ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఏడు సీట్ల వేరియంట్‌లో మధ్య వరుసలో కెప్టెన్ సీట్స్ ఉంటాయి. ఎనిమిది సీట్ల మోడళ్లలో ట్రెడిషనల్ స్ప్లిట్-ఫోల్డబిల్ బెంచ్ సీట్ ఉంటుంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్ ; కార్ ఓనర్ టీ అమ్ముకునేలాగా చేసింది, ఎలాగో చూడండి

మహీంద్రా మరాజో బిఎస్6 ప్రొడక్షన్ ప్రారంభం; అతి త్వరలోనే విడుదల!

ఈ బిఎస్6 ఎమ్‌పివిలో కొత్తగా చేసిన మార్పులతో పాటుగా దాని బిఎస్4 మోడల్ నుండి అనేక డిజైన్ ఎలిమెంట్స్ మరియు ఫీచర్లను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మూడు వరుసలకు ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, బహుళ ఎయిర్‌బ్యాగులు మరియు ఏబిఎస్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

మహీంద్రా మరాజో బిఎస్6 ప్రొడక్షన్ ప్రారంభం; అతి త్వరలోనే విడుదల!

మహీంద్రా మరాజో బిఎస్6 ఉత్పత్తి ప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా మరాజో ఓ మంచి ప్రాక్టికల్ ఎమ్‌పివి. ఈ విభాగంలో ఇది మంచి క్యాబిన్ స్పేస్‌ను ఆఫర్ చేయటంతో పాటుగా క్యాబిన్‌లో డ్రైవర్‌తో సహా ఏడుగురు లేదా ఎనిమిది మంది ప్రయాణీకులు సౌకర్యవంతంగా కూర్చోగలరు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో అధిక సీటింగ్ కలిగిన వాహనాలకు మంచి డిమాండ్ ఉంది, ఈ నేపథ్యంలో కొత్త మార్పులతో వస్తున్న మరాజో కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది.

MOST READ:పవిత్రమైన కాబాపై విమానాలు ప్రయాణించవు, ఎందుకో తెలుసా ?

Most Read Articles

English summary
According to the latest report by CarandBike, The production of the BS6 Mahindra Marazzo has begun. This news was confirmed by Veejay Ram Nakra, CEO, Automotive Division. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X