Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి
మహీంద్రా వాహనాలు మంచి ఆఫ్-రోడ్ సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన విషయం దాదాపు అందరికి తెలిసిందే. మహీంద్రా అత్యంత ప్రమాదకర రహదారులలో ప్రయాణించిన ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఇదే విధంగా ఒక ప్రమాదకర రహదారిని దాటుతున్న వీడియో విడుదలైంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఇంటర్నెట్లో ఎంతో ఆశ్చర్యకరమైన వీడియోలో చూసి ఉంటారు. ఇలాంటి వీడియోలను చూసినప్పుడు ఒక్క నిముషం స్తంభింపజేస్తాయి. ఇప్పుడు మహీంద్రా యొక్క ఈ వీడియో కూడా మీరు చూసేటప్పుడు అబ్బురపరచడమే కాకుండా నిర్ఘాంతపోయేలా చేస్తుంది.

ఇక్కడ మీరు వీడియోలో గమనించినట్లయితే అత్యంత ప్రమాదకరమైన పర్వత రహదారిని చూడవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ రోడ్డుపై వేగంగా దూకే జలపాతాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియోను సూపర్ కార్ బ్లోండ్ హోమ్‌పేజీలో పోస్ట్ చేశారు. ఈ సైట్ సూపర్ కార్లు మరియు కొత్త ఖరీదైన కార్ల వీడియోలను సమీక్షించి ప్రచురించే సైట్.
MOST READ:అటల్ టన్నెల్లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

అత్యంత ప్రమాదకరమైన హిమాలయ పర్వత ప్రాంతం యొక్క సరిహద్దులను పంచుకునే దేశాలలో ఒకటైన ఒకటైన నేపాల్‌లో ఈ సంఘటన జరిగింది. వీడియో తీసిన ప్రదేశం కూడా హిమాలయాలలో ఒక భాగం, దీనిని మీరు గమనించవచ్చు. సాధారణంగా హిమాలయ పర్వత ప్రాంతంలో రహదారులు చాలా ప్రమాదకరమైనది.

వీడియోలో కనిపించే ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైన పర్వత కాలిబాటకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న రోడ్లు సాధారణ రోడ్ల కంటే కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఇంత ప్రమాదకరమైన రోడ్డులో మహీంద్రా కారు జలపాతంలో నీరు వేగంగా వస్తున్నప్పటికీ ధైర్యంగా రోడ్డుపై నడుస్తుంది. అందుకే ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
MOST READ:ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

ఇటువంతో ప్రమాదకరమైన రోడ్డుపై డ్రైవింగ్ చాలా ప్రమాదకరం, అంతే కాదు ప్రాణాంతకం కూడా.. కానీ కారు డ్రైవర్ ఇక్కడ చాలా నైపుణ్యంగా వ్యవహరించాడు మరియు అధిక వేగంతో ప్రవహించే నీటి ప్రవాహాన్ని దాటి వెళ్ళాడు.

ఈ వీడియోలో కనిపించే కారు మహీంద్రా సవారీ. ఇది ఎలాంటి కఠినమైన రోడ్డులో ప్రయాణించడానికైనా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా పర్వత ప్రాంతాలలో ఉండే వారు ఎక్కువ ఈ విధంగా వుండే ఎస్‌యూవీలు లేదా ఎంయువిలను ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేస్తారు.
MOST READ:ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..
ఏది ఏమైనా కారు ఎంత మంచి సామర్త్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇంత ప్రమాదకరమైన రోడ్డులో అందులోనూ వేగంగా ప్రవహించే జలపాతాన్ని దాటి వెళ్లడం ప్రమాదకరం. ఇటువంటి రోడ్డుపై గుంతలు మరియు ఎత్తుపల్లాలు గుర్తించడం కష్టం కావున ఇటువంటి మార్గంలో కాకుండా దీనికి ప్రత్యామ్నాయంగా ఉండే రోడ్లను ఎంచుకోవడం చాలావరకు మంచిది.

ఈ వీడియోలో కనిపించే డ్రైవర్ స్థానిక డ్రైవర్ కావడంతో ఇంత ప్రమాదకరమైన రోడ్డును కూడా చాలా సులభంగా నైపుణ్యంతో దాటగలిగాడు. మహీంద్రా రైడర్ అంత వేగంగా ప్రవహించే నాదీ ప్రవాహం ఉన్న రోడ్డు దాటడం నిజంగా ప్రశంసనీయం.
MOST READ:భారత్‌లో విడుదల కానున్న మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ ఇదే!