అధిక వేగంతో డివైడర్‌ని తాకి, బైక్‌పైకి దూసుకెళ్లిన మహీంద్రా స్కార్పియో

ప్రపంచంలో చాలా రకాల ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, వాటిని మనం నిత్యం చూస్తూనే ఉంటాము. ఈ రకంగా జరిగే ప్రమాదాలలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

అధిక వేగంతో డివైడర్‌ని తాకి, బైక్‌పైకి దూసుకెళ్లిన మహీంద్రా స్కార్పియో

మనదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 1.5 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విధంగా ప్రమాదాలు జరగటం వల్ల రోడ్డుపైన వాహనాలను నడపడానికి చాలా భయానకంగా మారింది.

అధిక వేగంతో డివైడర్‌ని తాకి, బైక్‌పైకి దూసుకెళ్లిన మహీంద్రా స్కార్పియో

భారతదేశంలో రహదారి మౌలిక సదుపాయాలూ అంతగా లేవు. ఉన్న రహదారులలో కూడా వాహనాదారులు సరైన నిబంధనలను పాటించడంలేదు. హైవేలపై అకస్మాత్తుగా ఏర్పరిచిన బారికేడ్ల వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ఏర్పరిచిన బారికేడ్ల వల్ల గుజరాత్ లో జారిన ఒక ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

అధిక వేగంతో డివైడర్‌ని తాకి, బైక్‌పైకి దూసుకెళ్లిన మహీంద్రా స్కార్పియో

ఈ సంఘటన గుజరాత్‌లోని జునాఘడ్ లో జరిగింది. రోడ్‌వర్క్‌ల కోసం బారికేడ్లతో రహదారిని మూసివేసినట్లు కనిపిస్తోంది. కానీ వాహనాల డ్రైవర్‌ను అప్రమత్తం చేసేందుకు అక్కడ ఎటువంటి సంకేతాలు మరియు హెచ్చరికలు రహదారిపై ఏర్పాటు చేయలేదు. హైవే మీద స్కార్పియో డ్రైవర్ అధిక వేగంతో వెళుతుండగా అకస్మాత్తుగా బారికేడ్ను గుర్తించాడు.

అధిక వేగంతో డివైడర్‌ని తాకి, బైక్‌పైకి దూసుకెళ్లిన మహీంద్రా స్కార్పియో

అయినప్పటికీ మహీంద్రా స్కార్పియో వాహనం యొక్క వేగాన్ని తగ్గించలేదు మరియు అధిక వేగంతో వెళుతూనే ఉంది. వాహనం అకస్మాత్తుగా డివైడర్ ని ఢీకొట్టింది అప్పుడు మహీంద్రా స్కార్పియో గాల్లోకి ఎగిరి, మోటారుసైకిల్‌ను ఢీకొట్టింది. సాధారణంగా హై-స్పీడ్ ప్రమాదం చాలా భయానకంగా ఉంటాయి, మరియు ప్రతి ఒక్కరూ హైవేలపై ఎందుకు అప్రమత్తంగా ఉండాలో చూపిస్తుంది.

అధిక వేగంతో డివైడర్‌ని తాకి, బైక్‌పైకి దూసుకెళ్లిన మహీంద్రా స్కార్పియో

ఏదేమైనా వాహనాలు హైవేలపై అధిక వేగంతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఈ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. రహదారులపై హెచ్చరిక సంకేతాలు లేదా హెచ్చరికలను వ్యవస్థాపించడానికి ప్రభుత్వం తగినంతగా పట్టించుకోకపోగా, ప్రతి ఒక్కరూ రోడ్లపై పరిమితమైన వేగాన్ని ఖచ్చితంగా పాటించాలి మరియు పరిసరాల గురించి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

భారతదేశంలో రహదారులపై పశువులు తిరగటం, పెద్ద గుంతలు కలిగి ఉండటం, రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేయడం వంటివి సర్వసాధారణంగా ఉంటుంది. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతాయి. కాబట్టి వాహనదారులంతా కనీస వేగపరిమితిని కలిగి పరిసరాలను అనుసరిస్తూ ఉండాలి.

Source:ABP Asmita

Most Read Articles

English summary
Mahindra Scorpio hits the divider at high speed: Flies & crashes into a bike [Video]. Read in Telugu.
Story first published: Thursday, January 23, 2020, 14:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X