అతి తక్కువ ధరలో మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్: పూర్తి వివరాలు!
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా ఎలక్ట్రిక్ కెయువి100 విడుదలతో తమ షోరూముల్లో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తుల సంఖ్యను పెంచుకునే ఆలోచోనలో ఉన్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ యొక్క తొలి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కెయువి300 మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల లైనప్‌లో కీలక మోడల్‌గా నిలవనుంది. సేల్స్ లక్ష్యంగా తీసుకొస్తున్న దీనిని వీలైనంత వరకు అతి తక్కువ ధరలో లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

కెయువి100 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, దీని ఆధారంగా ఎన్నో నూతన ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాన్నురు, అంతే కాకుండా మహీంద్రా కెయువి100 చీపెస్ట్ ధరలో పూర్తి స్థాయి బడ్జెట్ ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా పేర్కొన్నారు.

మహీంద్రా సంస్థ ఈ కెయువి100 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రూ. 9 లక్షల బడ్జెడ్ రేంజ్‌లో లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సింగల్ ఛార్జింగ్‌తో సుమారు 130 నుండి 150కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఎక్స్-షోరూమ్ ధర రూ. 9 లక్షలు అయితే ప్రభుత్వ ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు మరియు అమ్మకాలను ప్రోత్సహించే ఫేమ్-2 స్కీమ్ క్రింద ట్యాక్సులు మరియు ధరలో రాయితీ లభిస్తుంది. ఇదే ధరల శ్రేణిలో ఉన్న టాటా టిగోర్ ధర రూ. 9.12 లక్షల నుండి రూ. 9.44 లక్షల మధ్య ఉంది, కాబట్టి మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారతదేశపు చీపెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తొలిసారి 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ వెర్షన్‌లో ఆవిష్కరించింది. అయితే 2020లో ప్రొడక్షన్ వెర్షన్ కెయువి100 ఎలక్ట్రిక్‌ను ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.

మహీంద్రా కెయువి100 ప్రస్తుతం సాధారణ కంబషన్(పెట్రోల్/డీజల్‌తో నడిచే ఇంజన్) వెర్షన్ రూ. 4.88 లక్షల నుండి రూ. 7.95 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరలతో లభిస్తోంది. ఈ కారును ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద ఇంజన్ స్థానంలో బ్యాటరీలను ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురావడంతో డెవలప్‌మెంట్ మరియు తయారీ ఖర్చులు దాదాపు తగ్గిపోయాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ కెయువి100 ఎస్‌యూవీలోని 40కిలోవాట్ కెపాసిటీ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 54.4హార్స్‌పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 15.9kWh సామర్థ్యం గల బ్యాటరీ నుండి పవర్ పొందుతుంది.

ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో ఛార్జ్ అవడానికి 5 గంటల 45 నిమిషాలు సమయం తీసుకునే రెగ్యులర్ ఏసీ ఛార్జర్ మరియు 55 నిమిషాల్లోనే ఛార్జింగ్ పూర్తయ్యే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ విడుదల సమయానికి సరాసరి పోటీనిచ్చే మోడల్ ఏదీ లేదు. అయితే మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును సిద్దం చేస్తోంది మరియు హ్యుందాయ్ కూడా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు మీద పనిచేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది.


Click it and Unblock the Notifications








