మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా, భారత మార్కెట్లో విక్రయించిన టియువి300లో కంపెనీ ఓ కొత్త బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా, తాజాగా ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు, ఇతర వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

భారతదేశంలోని తాజా ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా మహీంద్రా తమ ప్రోడక్ట్ లైనప్‌ను కూడా అప్‌డేట్ చేస్తోంది. మహీంద్రా ఇప్పటికే, కొన్ని మోడళ్లలో బిఎస్6 వెర్షన్లను ప్రవేశపెట్టగా, మరికొన్ని మోడళ్లలో బిఎస్6 వెర్షన్లను ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. ఈ జాబితాలో మహీంద్రా టియువి300 కూడా.

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

వుయ్ గైడ్ ఆటో లీక్ చేసిన చిత్రాల ప్రకారం, పాక్షికంగా క్యామోఫ్లేజ్ చేసిన మహీంద్రా టియువి300 టెస్టింగ్ వాహనాన్ని తమిళనాడు రోడ్లపై పరీక్షిస్తుండటాన్ని గమనించవచ్చు. ఈ స్పై చిత్రాల్లో కొత్త టియువి300లోని సరికొత్త ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్‌ను గమనించవచ్చు.

MOST READ:వావ్.. హైవేపై అద్భుతం.. డ్రైవర్ లేకుండా నడుస్తున్న కార్ [వీడియో]

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

ఈ ఎస్‌యూవీ స్పై చిత్రాలను గమనిస్తే, ఇందులో బోల్డ్ గ్రిల్ మరియు మధ్యలో ఉంచిన మహీంద్రా లోగోతో కొత్తగా డిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియాను గమనించవచ్చు. ఇందులో వెర్టికల్ స్లాట్ గ్రిల్ క్రింది భాగంలో పెద్ద హనీకోంబ్ ప్యాటర్న్‌లో ఉన్న విశాలమైన ఎయిర్-ఇన్‌టేక్‌ను కూడా చూడొచ్చు.

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

ఇతర డిజైన్ మార్పులలో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌ల పైభాగంలో అమర్చిన కొత్త హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన బంపర్ మరియు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ ఉన్నాయి. ఇంకా ఇందులో రీడిజైన్ చేయబడిన టెయిల్-ల్యాంప్స్, రియర్ బంపర్స్ మరియు బూట్ లిడ్ వంటి మార్పులను కూడా గమనించవచ్చు.

MOST READ:ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిన గవర్నమెంట్.. అదేంటో తెలుసా !

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

మహీంద్రా టియువి300 బిఎస్6 సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు ఏవీ లేవు. ఇందులో ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్‌తో పాటు ఇదివరకటి అల్లాయ్-వీల్ డిజైన్‌నే కలిగి ఉంటుంది. ఓవరాల్ టియువి300 ఎస్‌యూవీ బాక్సీ సిల్హౌట్ మాత్రం చూడటానికి ఇదివరకటిలానే ఉంటుంది.

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని ఇంటీరియర్స్ గురించి సమాచారం లేకపోయినప్పటికీ, ఇందులో కూడా కొన్ని కీలకమైన అప్‌డేట్స్ ఉండవచ్చని తెలుస్తోంది. రీడిజైన్డ్ క్యాబిన్‌లో ప్రీమియం అనుభూతిని అందించేలా ఈ కాంపాక్ట్-ఎస్‌యూవీలో గణనీయమైన మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.

MOST READ:ఇల్లుగా మారిన ఇన్నోవా కారు.. చూసారా..!

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ టచ్-స్క్రీన్ సిస్టమ్ ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే, సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్‌లతో కొత్త ఇంటీరియర్ ట్రిమ్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఇదివరకటి బిఎస్4 మోడళ్లలో ఆఫర్ చేసిన కీలెస్ ఎంట్రీ, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది.

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

ఇక ఇంజన్ విషయానికి, ఇందులో పెద్దగా మార్పులేవీ ఉండబోవని సమాచారం. బిఎస్4 టియువి300 మోడళ్లలో ఉపయోగించిన 1.5-లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 3750 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1600-2800 ఆర్‌పిఎమ్ మధ్యలో 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Source: We Guide Auto

MOST READ:సుజుకి మోటార్‌సైకిళ్లలో కొత్త బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ టెక్నాలజీ!

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

ఈ ఇంజన్ ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా ఫైవ్-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మహీంద్రా బిఎస్6 ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్ కొనసాగుతుందని సమాచారం. అయితే, ఇందులో కొత్త పెట్రోల్‌తో నడిచే ఆప్షన్‌ను కూడా అందించవచ్చని తెలుస్తోంది.

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

మహీంద్రా టియూవి300 భారత మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది అత్యంత పోటీతో కూడుకున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోని ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ హోండా డబ్ల్యుఆర్-వి, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు రాబోయే నిస్సాన్ మాగ్నైట్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

మహీంద్రా టియువి300 బిఎస్6 స్పై చిత్రాలు, ఇతర వివరాలు లీక్

మహీంద్రా టియువి300 స్పై చిత్రాలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మహీంద్రా టియువి300లోని ఏడు సీట్ల లేఅవుట్ కారణంగా ఇది మెరుగైన ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, కస్టమర్లను అట్రాక్ట్ చేయటంలో సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది. ప్రస్తుత పండుగ సీజన్‌లో మహీంద్రా బ్రాండ్ అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీ టియువి300 బిఎస్6 మోడల్‌ను మరికొద్ది రోజుల్లోనే విడుదల చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra Auto is working on updating its vehicle line-up to meet BS6 emission norms in the Indian market. While some models have received the BS6 update from the company, other vehicles are yet to be launched in the market such as the TUV300 line-up. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X