కస్టమైజ్డ్ మహీంద్రా టియువి 300 కారుని భార్యకి గిఫ్ట్ గా ఇచ్చిన భర్త

మహీంద్రా భారతదేశం యొక్క అతిపెద్ద యుటిలిటీ వాహన తయారీదారు. ఇది విస్తృత శ్రేణి వాహనాలను కలిగి ఉంది. మహీంద్రా కెయువి 100 NXT వంటి హ్యాచ్‌బ్యాక్‌లను కూడా కలిగి ఉన్నారు. ఇది ప్రస్తుతం మహీంద్రా యొక్క ప్రధాన మోడల్ అయిన అల్ట్రా లగ్జరీ ఫుల్ సైజ్ ఎస్‌యువి.

కస్టమైజ్డ్ మహీంద్రా టియువి 300 కారుని భార్యకి గిఫ్ట్ గా ఇచ్చిన భర్త

వాహనదారులు తమ వాహనాలు కొంత కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో చాలా మంది వాహనాలను మోడిఫై చేస్తారు. వీటిని కస్టమైజేడ్ వాహనాలు అంటారు. ఇటీవల ఒక భర్త తన భార్యకు కస్టమైజేడ్ మహీంద్రా టియువి 300 కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

కస్టమైజ్డ్ మహీంద్రా టియువి 300 కారుని భార్యకి గిఫ్ట్ గా ఇచ్చిన భర్త

ఇక్కడ అప్లోడ్ చేసిన వీడియోలో గమనించినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా మాడిఫై చేసిన టియువి 300 కనిపిస్తుంది. ఇది సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యువి. ఈ ప్రత్యేక వాహనాన్ని ముంబైకి చెందిన వ్యాపారవేత్త కపిల్ సంఘ్వి సొంతం చేసుకున్నారు.

కస్టమైజ్డ్ మహీంద్రా టియువి 300 కారుని భార్యకి గిఫ్ట్ గా ఇచ్చిన భర్త

మాడిఫై చేసిన ఈ టియువి 300 వాహనాన్ని కపిల్ సంఘ్వి తన భార్య అయిన మాన్సికి గిఫ్ట్ గా ఇచ్చాడు. మాడిఫై చేసిన తరువాత టియువి 300 చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఆకర్షణీయమైన ఆలివ్ గ్రీన్ కలర్ పెయింట్ తో ఉన్న ఈ కార్ అద్భుతంగా ఉంది. ఈ రంగుతో ఉండటం వల్ల రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఈ వాహనం ఇతర వాహనాకంటే భిన్నంగా కనిపిస్తుంది.

కస్టమైజ్డ్ మహీంద్రా టియువి 300 కారుని భార్యకి గిఫ్ట్ గా ఇచ్చిన భర్త

టియువి 300 ముందు భాగం ఎక్కువగా మాడిఫై చేయబడింది. 3 మిమీ మందమైన స్టీల్ లేపనంతో ఉంటుంది. అంతే కాకుండా పునఃరూపకల్పన చేయబడిన ఫ్రంట్ గ్రిల్‌ ఉంటుంది. హెడ్‌ల్యాంప్ చుట్టూ బ్లాక్ కలర్ ఇన్సర్ట్‌లతో రౌండ్ టైప్ హెడ్‌లైట్లు అమర్చబడ్డాయి. ఇందులో ఉన్న బంపర్ కూడా పునఃరూపకల్పన చేయబడింది మరియు ఫాగ్ లైట్స్, స్కిడ్ ప్లేట్లను కూడా కలిగి ఉంటుంది.

కారు వెనుక భాగం కొంత కఠినంగా కనిపిస్తుంది. పైభాగంలో అవి నాలుగు పైకప్పు లైట్లు అమర్చబడి ఉంటాయి. వెనుక వైపున ఓపెన్ చేయగల బూట్ ఉంది. ఇది ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి ఉపయోగ పడుతుంది. అంతే కాకుండా ప్రయాణించేటప్పుడు వెనుక కూర్చుని పర్యావరణాన్ని చూడటానికి కూడా ఉపయోగపడుతుంది.

కస్టమైజ్డ్ మహీంద్రా టియువి 300 కారుని భార్యకి గిఫ్ట్ గా ఇచ్చిన భర్త

ఈ కారు యొక్క లోపలి భాగంలో సీట్లు మరియు స్టీరింగ్ వంటివి కూడా అనుకూలీకరించబడ్డాయి. ఇంటీరియర్స్ సీట్లు ఆలివ్ గ్రీన్ ఇన్సర్ట్లతో బ్లాక్ ఇంటీరియర్ కలయికను కలిగి ఉంటాయి. టియువి 300 స్ట్రింగర్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఇది కస్టమర్ అభ్యర్థన ప్రకారం జోడించబడింది. ఈ మాడిఫై చేయబడిన కారుని తయారు చేయడానికి మహీంద్రా కంపెనీకి కొన్ని నెలల సమయం పట్టింది. ఇంత అద్భుతమైన మహీంద్రా టియువి 300 కారుని కపిల్ సంఘ్వి తన భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు.

Image Courtesy: Mahindra

Most Read Articles

English summary
Custom built Mahindra TUV300 is a husband’s gift to wife [Video]. Read in Telugu.
Story first published: Friday, March 13, 2020, 16:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X